కాసేపట్లో ఖైరతాబాద్ భారీ గణేషుడి నిమజ్జనం | khairatabad ganesh immertion completed | Sakshi
Sakshi News home page

కాసేపట్లో ఖైరతాబాద్ భారీ గణేషుడి నిమజ్జనం

Published Tue, Sep 9 2014 4:59 PM | Last Updated on Sat, Sep 2 2017 1:07 PM

khairatabad ganesh immertion completed

హైదరాబాద్ : నగరంలో లక్షలాది మంది భక్తులచే పూజలందుకున్న ఖైరతాబాద్ భారీ వినాయకుడిని కాసేపట్లో హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయనున్నారు. మంగళవారం సాయంత్రం వరకు సాగిన గణేశుడి శోభాయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు.  అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రైన్తో వినాయకుడిని సాగర్ జలాల్లో వదలనున్నారు.

గణనాధుడి నిమజ్జనాన్ని తిలకించేందుకు నగరవాసులు తరలి రావటంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఖైరతాబాద్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద ట్రాఫిక్ స్తంభించగా, సచివాలయం వెళ్లేవైపు కాసేపు రాకపోకలు ఆగిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ను పునరుద్ధరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement