khairatabad ganesh
-
అదర్‌సైడ్ .. నువ్వు విజిలేస్తే...
ప్రతి సంవత్సరం మన దేశంలో నిమజ్జనోత్సవాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రకరకాల వేషాల్లో వినాయకుడు సరదాగా ఉన్నాడు. లడ్డూ వేలాలు కోట్లకు చేరుకుంటు న్నాయి. ఇన్ని జరుగుతున్నా, ఇన్ని మారుతున్నా ఒక్కటి మాత్రం మారలేదు – నిమజ్జనం లాంటి సమయాల్లో పోగైన జనాల మధ్యనుంచి స్త్రీలని వేధించే పోకిరీ వేషాలు.నిమజ్జనాలు మొదలైన మూడో రోజు అనుకుంటా. ఒక మీటింగ్ ముగించుకుని ఊబర్ బైక్‌పై ఇంటికొస్తున్నాను. ట్రాఫిక్ మెల్లగా కదుల్తోంది. మా బైక్‌కి కొంచెం ముందు ఒక చిన్న ట్రాలీ ఆటోలో ఒక బుజ్జి వినాయకుడు. క్యూట్‌గా ఉన్నాడు. వినాయకుడి విగ్రహం కంటే చుట్టూ పెట్టిన సౌండ్ సిస్టం పెద్దదిగా ఉంది. డుబ్ డుబ్ అని డీజే సౌండ్లతో మారుమోగిపొతోంది రోడ్డంతా. ట్రాలీలో ఒక పదిమందికి పైగానే కుర్రాళ్ళు ఫుల్ డాన్స్ చేస్తున్నారు. అంతా బావుంది అనుకుంటుండగా ఆ గుంపులో ఒకడు నన్ను చూసి కన్ను కొట్టాడు. అప్పటివరకూ నేనూ సరదాగా చూస్తున్న ఆ దృశ్యం వికృతంగా మారింది.అంతటితో అయినపోలేదు. నా వైపు చూసి కన్ను కొట్టినోడు, పక్కనున్న మరొకడి చెవిలో ఏదో చెప్పడు. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఏమో గట్టిగా నవ్వుకుంటూ అప్పటిదాకా నిలబడి చూస్తున్న వీళ్లిద్దరూ డాన్స్ చేస్తున్న కుర్రాళ్లతో కలిసి అదో రకంగా స్టెప్స్ వేయడం మొదలుపెట్టారు. మామూలుగా అయితే నేను మొహం తిప్పేసుకోవడమో లేదా మొబైల్ చూసుకోవడమో చేసేదాన్ని. కానీ ఆ రోజు మాత్రం వాళ్లవైపే గుడ్లురుమి చూస్తుండిపోయాను. ఎంత కోపంగా చూస్తే అంత రెచ్చిపోతున్నారు. ట్రాఫిక్ కదలడం లేదు. కాసేపటికి నేనే తల తిప్పుకున్నాను. ట్రాఫిక్ కొంచెం మూవ్ అయింది. మా ఊబర్ డ్రైవర్ ఒక కారు వెనక ఆగిపోయాడు. ఆ ట్రాలీ ఆటో ముందుకు వెళ్లిపోయింది. పాట మారింది. అప్పుడే మమ్మల్ని దాటుకొని ఒక స్కూటీ వెళ్లింది. ఆ స్కూటీ నడుపుతున్న అమ్మాయి మీదకి మారింది ఆ కుర్రాళ్ల చూపు. ఆ అమ్మాయిని చూసి కూడా అవే కోతలు, అవే కేకలు, అవే కుప్పి గంతులు. ఆ అమ్మాయి చున్నీ సర్దుకోవడం నాకు కనిపించింది. ఆ అమ్మాయి ఆ ట్రాలీని కూడా దాటుకొని ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్లిపోయింది. ఓయ్ ఓయ్ అని తరిమాయి ఆ పిల్లని ఈ గాలి మాటలు.ఆ కుర్రాళ్లు ఆ రాత్రికెప్పుడో నిమజ్జనం పూర్తి చేసుకుని, ఏ అర్ధరాత్రో ఇంటికి చేరుకుని హాయిగా నిద్రపోయుంటారు. కానీ వాళ్ల చేసిన అల్లరికి ఎంతమంది అమ్మాయిలకు ఆ రాత్రి నిద్రపట్టకుండా చేసుంటారో, వాళ్లలో ఎంత భయాందోళనలు కలుగచేసి ఉంటారో వాళ్లకి తెలిసుండదు.ఏదో దార్లో ఆమ్మాయి కనిపిస్తే జస్ట్ విజిలేసా, అంతే అని మగాళ్లకి అనిపించవచ్చు. అదేం పెద్ద విషయం కాదని మన సినిమాలు నార్మలైజ్ చేసుండొచ్చు. కానీ ఈ రకమైన వేధింపులు స్త్రీలకు తీవ్రమైన మానసిక, శారీరక ఇబ్బందులను కలుగచేస్తాయనేది ఇప్పటికైనా అందరూ తెలుసుకోవాల్సిన విషయం.ఇదో పెద్ద సమస్యా అని తీసిపారేసే విషయం కాదు. 2014లో న్యూయార్క్ లో సొషానా రాబర్ట్స్ అనే మహిళ 10 గంటల పాటు నడిచినప్పుడు దాదాపు 100 సార్లు ఇలాంటి వేధింపులకు గురైంది. ఆమె ఈ అనుభవాన్ని వీడియోగా చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్ అయి, ప్రపంచవ్యాప్తంగా క్యాట్ కాలింగ్‌పై చర్చకు తెరలేపింది.అంటే ఒకమ్మాయి రోడ్డు మీద గంటసేపు నడిస్తే కనీసం పదిసార్లు ఎవరో ఒకరు ఆమెను అదోలా చూడడమో, ఏదో ఒకటి అనడమో జరుగుతుంది. ఒక్కసారి ఆలోచిస్తే భయంగా లేదా?సరే ఇది ఒక వైపైతే, నిమజ్జనం చివరి రోజు ఆ జనాల మధ్య ఎంతమంది మగాళ్లు ఆడవాళ్లని తాకరాని చోట తాకుతూ ఎంత హింసకు గురిచేస్తారో, ఈ దేశంలోని ప్రతి మహిళ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి అనుభవానికి గురయ్యే ఉంటారు. ఇది కేవలం నిమజ్జనానికి సంబంధించిన విషయం కాదు. ఎక్కడ ఎప్పుడు జనాలు గుమిగూడినా జరిగే విషయమే.ఒక్క ఖైరతాబాద్ గణేష్ మండపం దగ్గర, కేవలం వారం రోజుల్లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న 285 మందిని అరెస్ట్ చేశారంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించండి.లైంగిక వేధింపు అనేది కేవలం స్త్రీల సమస్య కాదు, ఇది మన సమాజం మొత్తం ఎదుర్కొంటున్న సమస్య. ఈసారి ఎదురుగా వస్తున్న అమ్మాయిని చూసి ఏదైనా అనాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా అక్కడ మీ అమ్మో, అక్కో, చెల్లో ఉంటే ఏం చేస్తారు అని ఒక్కసారి ఆలోచించమని మై డియర్ మగాళ్లను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతేకాదు ఈ సమస్య బయట వేరేవరో కాదు మీ అక్క, మీ చెల్లి కూడా ఎదుర్కొంటున్నారని ఆలోచించమంటున్నాను. -
ఖైరతాబాద్ గణేశుడి నవరాత్రి ఉత్సవాలు.. వెయ్యిమంది కీచకుల అరెస్ట్
సాక్షి,హైదరాబాద్ : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో కీచకులు రెచ్చిపోయారు. గణేష్ నవరాత్రల్లో మహిళలను తాకుతూ కీచకులు వేధించారు. ఖైరతాబాద్ గణేష్ వద్ద 11 రోజుల్లో సుమారు వెయ్యిమందిని కీచకుల్ని షీటీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కీచకులను పట్టుకునేందుకు పోలీసులు స్పై ఆపరేషన్ చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ పట్టుబడ్డారని, తదుపరి చట్టపరమైన చర్యల కోసం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, తగిన శిక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. -
మహా గణపతి నిమజ్జనానికి కదలిన భక్తజన సందోహం (ఫొటోలు)
-
HYD: ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర (ఫొటోలు)
-
బాలాపూర్ గణనాథుడి లడ్డూ అ‘ధర’హో
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలంటే ప్రతి ఒక్కరికీ ఠక్కున గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. ఆ తర్వాత అంతే ప్రాముఖ్యత కలిగిన బాలాపూర్ లడ్డూ వేలం పాట. 1954లో తొలిసారిగా ఒక్క అడుగుతో ఖైరతాబాద్ వినాయకుడిని ప్రతిష్టించారు. ఎత్తైన గణేష్ విగ్రహం (70 అడుగులు) కూడా ఇదే. కాగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి మొదటిసారి 1994లో లడ్డూ వేలంపాట ప్రారంభించింది. తొలి వేలంపాటలో అదే ప్రాంతానికి చెందిన కొలను మోహన్‌రెడ్డి రూ.450 లడ్డూ కైవసం చేసుకున్నారు. ఆయన వరుసగా మూడు సార్లు వేలంపాటలో పాల్గొన్నారు. ఈ లడ్డూను దక్కించుకున్న వారికి మంచి జరిగిందనే ప్రచారంతో కాల క్రమంలో ప్రసాదానికి డిమాండ్ పెరిగింది. 2002 నుంచి లక్షల్లో ధర పలకడం మొదలైంది. ఒకప్పుడు కేవలం బాలాపూర్‌కు మాత్రమే పరిమితమైన ఈ లడ్డూ వేలంపాట ప్రస్తుతం ఇంతింతై అన్నట్లు గ్రేటర్ అంతా విస్తరించింది.విగ్రహ సంస్కృతి ఇలా.. ఖైరతాబాద్ గణేషుడితో మొదలైన ఈ విగ్రహ ప్రతిష్టాపన సంస్కృతి.. క్రమంగా నగరమంతా విస్తరించింది. ప్రస్తుతం గ్రేటర్లో చిన్న, పెద్ద కలిపి మొత్తం రెండు లక్షలకుపైగా విగ్రహాలు నెలకొల్పినట్లు అంచనా. ఇదిలా ఉంటే రెండు మూడేళ్ల క్రితం వరకూ బాలాపూర్ లడ్డూకు మాత్రమే రికార్డు స్థాయిలో ధర పలికేది. 2023లో బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సన్‌సిటీ రిచ్మండ్ విల్లాలోని గణనాథుడి చేతిలో ఉన్న లడ్డూ ప్రసాదం బాలాపూర్ లడ్డూ రికార్డును బ్రేక్ చేసింది. ఏకంగా రూ.1.25 కోట్లు పలికి భక్తులందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. నిత్యం రికార్డుల్లో నిలిచే బాలాపూర్ లడ్డూ మాత్రం గతేడాది రూ.27 లక్షలు పలికింది. ఈ యేడాదికి సంబంధించి మంగళవారం ఉదయం 8 గంటలకు నిర్వహించే వేలం పాటలో ఎంత ధర పలుకుతుందో వేచి చూడాల్సిందే. -
ఖైరతాబాద్ గణేష్ వద్దకు భారీగా తరలివచ్చిన భక్తులు (ఫొటోలు)
-
ఖైరతాబాద్ గణనాథుడి చివరి పూజలు
-
ఖైరతాబాద్ గణేష్ తొలి పూజలో సీఎం రేవంత్ రెడ్డి
-
భక్త 'గణ' యాత్ర
సాక్షి, హైదరాబాద్: గణపతి నిమజ్జన వేడుకలు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయి. వేల సంఖ్యలో వినాయక విగ్రహాలను భక్తులు నిమజ్జనం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో భారీ సంఖ్యలో విగ్రహాలు, భక్తులతో రహదారులు కిటకిటలాడాయి. నగరం నలువైపుల నుంచి తరలి వచ్చిన భక్తజన సందోహంతో సాగరతీరం సందడిగా మారింది. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు, పీపుల్స్‌ప్లాజా తదితర ప్రాంతాల్లో ‘జై బోలో గణపతి మహారాజ్‌కీ జై ’అంటూ నినాదాలు హోరెత్తాయి. వైవిధ్య భరితమైన వినాయక మూర్తుల నిమజ్జన వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. భక్తుల నినాదాలు, నృత్యాలతో కూడిన శోభాయాత్రతో మహానగరం ఆధ్మాత్మికతను సంతరించుకుంది. 63 అడుగుల ఖైరతాబాద్ శ్రీ దశ మహావిద్యా గణపతి నిమజ్జన వేడుకలు మధ్యాహ్నం 1.27 గంటలకే ముగిశాయి. ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్త జనందోహం నడుమ శోభాయాత్ర ప్రశాంతంగా సాగింది. ఉదయం 6.12 గంటలకు ప్రారంభమైన ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర సెన్సేషన్ థియేటర్. రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మీనార్, సచివాలయం, ఎన్టీయార్మార్గ్ మీదుగా ఉదయం 11.40 గంటలకు 4వ నంబర్ క్రేన్ వద్దకు చేరుకుంది. మధ్యాహ్నం 12.24 గంటలకు చివరి పూజ నిర్వహించిన గంట తరువాత మహాగణపతిని నిమజ్జనం చేశారు. ఈ వేడుకల్లో మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. అన్ని విభాగాల సహకారంతో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతికి ప్రత్యేకత ఉందని పది రోజుల్లో 50 లక్షల మంది దర్శించుకున్నారని చెప్పారు. గురువారం నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్‌లో భారీగా పోటెత్తిన భక్త జనం వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ మహాగణపతి నిమజ్జన వేడుకలు ముగిసిన తర్వాత వివిధ ప్రాంతాల నుంచి బొజ్జ గణపయ్యలు సాగరతీరంలో నిమజ్జనానికి తరలివచ్చారు. మధ్యలో స్వాగత వేదికలు గణపతులకు సాదర స్వాగతం పలికాయి. రకరకాల ఆకృతులలో అందంగా రూపుదిద్దుకున్న మూషికవాహనుడి విగ్రహాలు ఆకట్టుకున్నాయి. తిరుపతి వెంకటేశ్వర దేవస్థానం అలంకరణలో ఏర్పాటు చేసిన మండపాలు, విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, జీమెయిల్ వంటి సోషల్ మీడియాను ప్రతిబింబించే చిన్న చిన్న విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి నిమజ్జనానికి తీసుకొచ్చారు. అబిడ్స్, ఎల్బీనగర్, తదితర ప్రాంతాల నుంచి వచ్చిన పండ్లతో అలంకరించిన విగ్రహాలు, కాగితంతో అందంగా తీర్చిదిద్దిన పర్యావరణ గణపతులు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం కోసం అమరవీరుల స్మారక చిహ్నం వద్ద బారులు తీరిన వినాయక విగ్రహాలు ఏరియల్ నిఘా రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిసేందుకు పోలీస్‌శాఖ బందోబస్తు ఏర్పాటు చేసింది. అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీ స్ కమిషనర్లు వినాయక నిమజ్జన ప్రాంతాలు పరిశీలించారు. హైదరాబాద్ పరిధిలో గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని మంత్రులు మహమూ ద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి డీజీపీ అంజనీకుమార్ ఏరియల్ వ్యూ ద్వారా పర్యవేక్షించారు. హెలికాప్టర్లో శోభాయాత్రను, హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనాలు జరుగుతున్న తీరును పరిశీలించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ కూడా పాల్గొన్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కూడా శోభయాత్రను పరిశీలించారు. సీసీటీవీ కెమెరాల లైవ్ ఫీడ్‌ను చూస్తూ సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. నగరం ఆధ్యాత్మిక సంద్రమైంది. ఎటుచూసినా భక్తజన సందోహం.. అంతటా గణనాథుని నిమజ్జన వేడుకల కోలాహలం.. దారిపొడవునా వినాయకులకు ఘన స్వాగతాలు.. ట్యాంక్బండ్లు, చెరువుల వద్ద వీడ్కోళ్లు.. గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. 63 అడుగుల ఖైరతాబాద్ శ్రీ దశ మహావిద్యా గణపతి నిమజ్జనోత్సవం మధ్యాహ్నం 1.27 గంటలకే ముగిసింది. -
కాసేపట్లో గంగ ఒడికి ఖైరతాబాద్ బడా గణేష్
-
రాష్ట్రాలతో ముడిపడివున్న ఖైరతాబాద్ గణనాధుడు
-
Live: ఖైరతాబాద్ గణేష్ శోభా యాత్ర
-
Hyderabad: గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణపతి
Hyderabad Ganesh Nimajjanam 2023 Live Updates ►హుస్సేన్‌సాగర్‌లో ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ►గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ బడా గణేష్ ►మహాగణపతిని చూసేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు ►ఎన్టీఆర్ మార్గ్ చేరుకున్న ఖైరతాబాద్ బడా గణేష్ ►కాసేపట్లో గంగ ఒడికి ఖైరతాబాద్ బడా గణేష్ ►రెండు భారీ క్రేన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ►క్రేన్ నెం.4 వద్ద ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ►సచివాలయం దాటిన బడా గణేష్ శోభాయాత్ర ►హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన సందడి ►హుస్సేన్ సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు ►40వేల మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు ►మొత్తం 20,600 సీసీ కెమెరాలతో నిఘా ►హైదరాబాద్‌లో సీపీ పరిధిలో 25 వేలమందికి పైగా పోలీసులతో బందోబస్తు ►సున్నిత ప్రాంతాల్లో ఆర్పీఎఫ్, పారా మిలిటరీ భద్రత ►రాచకొండ కమిషనరేట్ పరిధిలో 6వేల మంది పోలీసులతో భద్రత ►ఎన్టీఆర్ మార్గ్‌లోకి ప్రవేశించిన భారీ గణనాథుడు ►కొత్త సచివాలయం ముందు నుంచి సాగుతున్న గణేశుడు ►కాసేపట్లో క్రేన్-4 వద్ద ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ►గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను ఉత్సవ సమితి నిర్వాహకులు పరిశీలించారు. లక్షకు పైగా విగ్రహాలు నిమజ్జనానికి రానున్నాయని, రేపు ఉదయం వరకు నిమజ్జనం కొనసాగుతుందని ఉత్సవ సమితి తెలిపింది. ►వేలంలో బాలాపూర్ గణేష్ లడ్డూకు రికార్డు స్థాయి ధర ►వేలంలో రూ.27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ►గత రికార్డును అధిగమించిన బాలాపూర్ లడ్డూ ►రూ.27 లక్షలకు గణేష్ లడ్డూను దక్కించుకున్న దాసరి దయానందరెడ్డి ►బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట ప్రారంభం ►గతేడాది రూ.24.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ►బాలాపూర్ లడ్డూ వేలంలో పాల్గొన్న 36 మంది ►వైభవంగా కొనసాగుతున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ►మరికాసేపట్లో సెక్రటేరియట్ వద్దకు చేరుకోనున్న ఖైరతాబాద్ గణేష్ రూ. కోటి 20 లక్షలు పలికిన గణేశ్ లడ్డూ ►బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కీర్తి రిచ్ మండ్ విల్లాలో వినాయకుడి లడ్డూ రికార్డు ధరకు పలికింది ►వేలంలో రూ. కోటి 26 లక్షలు పలికింది వినాయకుడి లడ్డూ మాదాపూర్‌లోనూ రికార్డు ధర పలికిన లడ్డూ ►మైహోం భుజాలో రూ.25.50 లక్షలు పలికిన లడ్డూ ►లడ్డూ దక్కించుకున్న చిరంజీవి గౌడ్ అనే వ్యక్తి ►కిందటి ఏడాది రూ.18.50 లక్షలకు పోయిన లడ్డూ ►బాలాపూర్ గణేష్ శోభాయాత్ర ప్రారంభం ►ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న లడ్డూ వేలం ►వేలంలో పాల్గొననున్న 36 మంది ►బాలాపూర్ లడ్డూ వేలానికి నేటితో 30 ఏళ్లు పూర్తి ►సన్సేషన్ థియేటర్ దగ్గరకు చేరుకున్న మహాగణపతి శోభాయాత్ర ►కాస్త నెమ్మదిగా కొనసాగుతున్న ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ►చెట్టు కొమ్మలు అడ్డురావడంతో తొలగించిన నిర్వాహకులు ►వైభవంగా కొనసాగుతున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ►కాసేపట్లో టెలిఫోన్ భవన్‌కు చేరుకోనున్న శోభాయాత్ర ►ఉదయం 10 గంటలకు తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌కు చేరుకోనున్న శోభాయాత్ర ►మధ్యాహ్నం 12 గంటలకు ఎన్టీఆర్ మార్గ్క్రేన్ 4 వద్ద ఉండేలా ప్లాన్ ►ఖైరతాబాద్ శోభయాత్రకు అడుగడుగునా పోలీసు భద్రత ►బ్యాండ్‌కు అనుమతి ఇవ్వని పోలీసులు ►మధ్యాహ్నం కల్లా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ►నిమజ్జనం సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ►లారీలకు ఎల్లుండి వరకు నగరంలోకి అనుమతి నిరాకరణ ►రాత్రి ఒంటి గంట వరకు నడవనున్న మెట్రో రైళ్లు ►బాలాపూర్ గణేష్ దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఉత్సవ కమిటీ ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఉదయం 9 గంటలకు లడ్డూ వేలం ప్రారంభం కానుంది. ►గౌరమ్మ తనయుడు గురువారం గంగమ్మ ఒడికి చేరనున్నాడు. కరిముఖుని సేవలో తరించిన భక్తజనులు గణపతి నిమజ్జనానికి సిద్ధమయ్యారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. ►ఉదయం 7 గంటలకే శోభాయాత్ర ప్రారంభమైంది. ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీసులు, వివిధ శాఖల అధికారుల సమన్వయంతో మహా నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం సజావుగా సాగేందుకు రూట్ మ్యాప్‌తో పాటు భారీ క్రేన్లు, వాహనాలను సిద్ధం చేశారు. ►గణేశ్ శోభాయాత్ర నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది. శోభాయాత్ర పొడవునా, నిమజ్జనాలు జరిగే చెరువుల వద్ద వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు దాదాపు 3వేల మంది పారిశుద్ధ్య కార్మికులను విధుల్లో నియమించింది. అదనంగా ఆర్టీసీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లు భక్తుల కోసం ఆర్టీసీ వివిధ మార్గాల్లో 535 బస్సులను నడిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 8 ఎంఎంటీఎస్ రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. ఎంఎంటీఎస్‌లు బుధవారం రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం ఉదయం 4 గంటల వరకు రాకపోకలు సాగిస్తాయి. శుక్రవారం తెల్లవారుజాము 2 గంటల వరకు నగరంలోని వివిధ మార్గాల్లో మెట్రో రైళ్లు సైతం రాకపోకలు సాగిస్తాయని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అత్యవసర వైద్య సేవలు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 37 వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.వెంకట్ తెలిపారు. గణేష్ నిమజ్జనం జరిగే ప్రాంతాలలో అత్యవసర పరిస్థితులలో ఉపయోగించటానికి 108 అంబులెన్సులను, బేబీ పాండ్స్ దగ్గర ప్రైవేట్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 15 ప్రైవేటు ఆసుపత్రుల భాగస్వామ్యంతో పని చేస్తున్నామన్నారు. జలమండలి ఆధ్వర్యంలో తాగునీటి శిబిరాలు భక్తుల దాహార్తిని తీర్చడానికి తగిన ఏర్పాటు చేస్తున్నట్లు జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు. 122 ప్రత్యేక తాగునీటి శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా నిమజ్జనాల కోసం ఏర్పాటు చేసిన 74 బేబీ పాండ్స్ (నీటి కొలనులు) వద్ద నీటి క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 34 లక్షల వాటర్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. అవసరమైన చోట్ల డ్రమ్ముల్లోనూ మంచినీరు అందిస్తామన్నారు. నోడల్ అధికారుల నియామకం వినాయక నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన మంచినీటి శిబిరాల నిర్వహణ, పర్యవేక్షణ, ఇతర సమస్యలు పరిష్కారానికి నోడల్ అధికారుల్ని నియమించామని పేర్కొన్నారు. దీంతో పాటు ట్యాంక్ బండ్, ఎనీ్టఆర్ మార్గ్‌లో రెండు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. -
Khairatabad Ganesh 2023 Photos: ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫోటోలు)
-
ఖైరతాబాద్ గణేశుడి వద్ద ఇసుకేస్తే రాలని జనం
సాక్షి, హైదరాబాద్: వారాంతం కావడంతో ఖైరతాబాద్ గణేషుడి దర్శనార్థం జనం పోటెత్తారు. ఆదివారం ఉదయం నుంచే ఖైరతాబాద్ వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. ఇసుకేస్తే రాలని జనం.. జైబోలో గణపతి మహా రాజ్ కి జై నినాదాలతో ఖైరతాబాద్ ప్రాంగణం మారుమోగిపోతోంది.ఆదివారం మధ్యాహ్నం వరకే లక్షన్నర మంది భక్తుల దర్శనం చేసుకున్నట్లు అంచనా వేస్తోంది ఖైరతాబాద్ మహా గణపతి నిర్వాహక కమిటీ. సెప్టెంబర్ 28వ తేదీన నగరంలో నిమజ్జనం జరగనుంది. నిమజ్జనానికి ముందు ఆదివారం కావడంతో జనం ఖైరతాబాద్ గణేషుడి దర్శనార్థం క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం దాటాక.. జనం రావడం ఒక్కసారిగా పెరిగింది. దాదాపు మూడు కిలోమీటర్ల మేర లైన్లో నిల్చున్నారు భక్తులు. దీంతో.. వీఐపీ దర్శనాలను నిలిపివేసి సాధారణ భక్తులను అనుమతిస్తున్నారు. ఆదివారం సాయంత్రం సమయంలో ఈ సందడి మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఖైరతాబాద్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులతో పాటు.. మెట్రో స్టేషన్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. మరోపక్క.. నగరంలో విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే వందల కొద్దీ విగ్రహాలు ట్యాంక్‌బండ్ వైపు చేరుకుంటున్నాయి. ఖైరతాబాద్, సోమాజిగూడ, నెక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు విపరీతమైన రద్దీతో నిండిపోయాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు.. శాంతి భద్రతలను పోలీసులు పరిరక్షిస్తున్నారు. -
ఖైరతాబాద్ గణనాథుడి దర్శనం కోసం భారీగా తరలివస్తోన్న భక్తులు
-
Khairatabad Ganesh 2023: ఖైరతాబాద్ మహా గణపతి వద్ద భక్తజన సందోహం (ఫోటోలు)
-
హైదరాబాద్‌లో విషాదం.. ఖైరతాబాద్ గణపతిని చూసేందుకు వెళ్తూ..
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంల ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు వెళ్తుండగా గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. వివరాలు.. బోడుప్పల్‌కు చెందిన యశ్వంత్ (22) . ఇదే ప్రాంతానికి చెందిన సాయిరామ్ (31) స్నేహితులు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇద్దరు ఖైరతాబాద్ గణపతిని దర్శించుకునేందుకు బయల్దేరారు. యశ్వంత్, సాయిరామ్ స్పోర్ట్స్ బైక్‌పై బోడుప్పల్ నుంచి వెళ్తుండగా అడిక్‌మెట్ బ్రిడ్జి మీద వేగంగా బైక్ నడుపుతూ డివైడర్‌ను ఢీ కొట్టారు. ఈ ఘటనలో బైక్ నడిపిన యశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన సాయిరామ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఉస్మానియా వర్సిటీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
ఈసారి ఖైరతాబాద్ మహా గణపతి సమ్‌థింగ్ స్పెషల్
హైదరాబాద్: ఇంతింలై వటుడింతై అన్నట్లుగా ఖైరతాబాద్ మహాగణపతి ప్రస్థానం 1954లో ఒక్క అడుగుతో ప్రారంభమై 69వ సంవత్సరాలకు చేరుకుంది. ఈసారి పర్యావరణ హితంగా పూర్తిగా మట్టితో తయారు చేసిన మహాగణపతి 63 అడుగుల ఎత్తులో శ్రీ దశమహా విద్యాగణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. శుక్రవారం సాయంత్రం మహాగణపతికి నేత్రోనిలం (కంటిపాప ఏర్పాటు) కార్యక్రమాన్ని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ నిర్విఘ్నంగా పూర్తి చేశారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా ఖైరతాబాద్ మహాగణపతిని వివిధ రూపాల్లో తీర్చి దిద్దుతున్న శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. నా పూర్వజన్మ సుకృతం.. ఖైరతాబాద్ మహాగణపతిని ఏటా వివిధ రూపాల్లో తీర్చిదిద్దే అద్భుత అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. వినాయకచవితి వచ్చిందంటే ఎక్కడ ఉన్నా మహాగణపతి తయారీకి తప్పక వస్తాను. గత 40 సంవత్సరాలుగా మహాగణపతి సేవలో ఉన్నాను. ఈ సంవత్సరం మట్టితో మహాగణపతి అద్భుతంగా రూపుదిద్దుకుంది. 2020లో మొదటిసారిగా మట్టితో 12 అడుగుల ఎత్తులో.. ఆ తర్వాత 2022లో, 2023.. ఈ సంవత్సరం మట్టితోనే అద్భుతంగా తయారైంది. ఈసారి ప్రత్యేకతలేమిటంటే.. 63 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పులో, 45 టన్నుల బరువుతో శ్రీ దశమహా విద్యాగణపతిగా విఠల శర్మ సిద్ధాంతి సూచనల మేరకు నామకరణం చేసి, ఆయన ఇచ్చిన సూచనల మేరకే రూపు దిద్దుకుంది. ఒక చేతిలో గ్రంథం, వరాహదేవితో కలిసి ఉన్న మహాగణపతికి పూజ చేస్తే అన్ని శుభాలే జరుగుతాయి. మహాగణపతికి ప్రాణ ప్రతిష్ట ఇలా.. నేత్రోనిలనం చేయడం అంటే కంటి పాప అమర్చడం. ఇలా చేయడం వల్ల మహాగణపతికి రూపం వస్తుంది. వినాయక చవితి రోజు కలశ పూజ పూర్తి చేయడం ద్వారా ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది. సుదర్శన్ లేని లోటు కనిపించింది.. గత సంవత్సరం వరకు ఉత్సవ కమిటీ చైర్మన్‌గా ఉన్న సింగరి సుదర్శన్ మరణానంతరం ఆయన లేని లోటు కనిపించింది. ఆయన ఆశీర్వాదంతోనే మహాగణపతి పనులను ఎప్పుడూ లేని విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు దగ్గరుండి ప్రతీ పని చేస్తూ వచ్చాను. మట్టి వినాయకుడి ప్రత్యేకతలివీ.. మహాగణపతిని రూపొందించడానికి ఒక్క చుక్క పీఓపీ కూడా వాడలేదు. మొదటగా స్టీల్‌తో రూపు తీసుకువచ్చి ఆ తర్వాత జాళీని అమర్చి దానిపై గడ్డి, మట్టితో రెండో లేయర్, దానిపై ఔట్లేన్గా శాండ్, సుతిలి, ఓపీపోట్లు పౌడర్లను కలిపి మరో లేయర్, మట్టి, సుతిలి పౌడర్, బట్టతో మరో లేయర్ అమర్చి దానిపై ఫినిషింగ్ తీసుకువచ్చాం. ఇలా మొత్తం అయిదు లేయర్లు ఉన్నాయి. అయిదు లేయర్లపై వాటర్ పెయింట్స్ వాడటం వల్ల వర్షం నిరంతరంగా 4–5 గంటలు పడినా విగ్రహం ఏమాత్రం కరగదు. ఎలాంటి పగుళ్లకు అవకాశం లేదు. నిమజ్జన సమయంలో వర్షం పడి నా ఏ ఇబ్బందీ ఉండదు. నిమజ్జనం పూర్తిగా జరిగితే 8 గంటల్లో నీటిలో కరుగుతుంది. -
హుస్సేన్ సాగర్ చుట్టూ 200 సీసీ కెమెరాల ఏర్పాటు
-
వినాయక చవితికి సిద్ధమవుతున్న ఖైరతాబాద్ గణేష్
-
శ్రీ దశమహా విద్యా గణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు
-
ఈసారి ఖైరతాబాద్ గణేషుడు ఇలా..
ఒక్కో ఏడాది ఒక్కో ఎత్తుతో.. ఒక్కో ప్రత్యేక రూపంతో దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణపతి అంటే.. తెలుగు రాష్ట్రాలకే కాదు, దేశం ఆ మాటకొస్తే విదేశీ పర్యాటకులకు సైతం ఆసక్తే. ఇక ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడి ఎత్తు, రూపం ఎలా ఉండనుందో తెలుసా? 69వ ఏడాది వినాయకుడ్ని నిలబెడుతోంది ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ. ఈసారి 63 అడుగుల ఎత్తుతో.. శ్రీ దశమహా విద్యాగణపతి అవతారంలో భారీ విఘ్నేషుడు ఖైరతాబాద్‌లో కొలువు దీరి ప్రజలను అలరించనున్నాడు. శ్రీపంచముఖ లక్ష్మీనారసింహస్వామి ఒకవైపు, శ్రీ వీరభద్రస్వామి మరోవైపు.. విఘ్నేషుడి మండపంలోనే సరస్వతీ దేవి, వరాహ దేవి కొలువు కానున్నారు. ఈ మేరకు మండప నమునా చిత్రాన్ని విడుదల చేసింది ఉత్సవ కమిటీ. ఇదిలా ఉంటే.. గతేడాది 50 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చిన ఖైరతాబాద్ మహా గణపతి ‘పంచముఖ మహాలక్ష్మి’ అవతారంలో దర్శనమిచ్చాడు. -
Hyderabad: ఖైరతాబాద్ గణపయ్య నిమజ్జనం పూర్తి
-
Hyderabad: గంగమ్మ ఒడికి చేరుకున్న ఖైరతాబాద్ మహాగణపతి
► ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడి చేరుకున్నాడు. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ గణేషున్ని నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ►తుది దశకు చేరుకున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ►క్రేన్ దగ్గరకు చేరుకున్న ఖైరతాబాద్ గణపతి ►ఎన్టీఆర్ మార్గ్ వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్దకు ఖైరతాబాద్ గణేషుడు.. ► ఖైరతాబాద్ భారీ గణనాథుడి శోభాయాత్ర ఘనంగా కొనసాగుతోంది. ట్యాంక్ బండ్లో నిమజ్జనం సందర్భంగా గణేషుడు తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌కు చేరుకున్నాడు. అశేష భక్తజన సమూహంలో గణనాథుడు నాలుగో నెంబర్ క్రైన్ వరకు తరలివెళ్తున్నాడు. ►ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. గణనాథుడిని చివరిసారిగా భక్తజనం భారీగా తరలివచ్చారు. గణపతిబప్ప మోరియా అంటూ భక్తులు నినాదాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ గణేషున్ని నిమజ్జనం చేయనున్నారు. ►హుస్సేన్ సాగర్ వద్ద ఒక్క సారిగా వాతావరణం చల్లబడింది. వర్షం పడే సూచనలు కనిపిస్తుండటంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. వర్షం పడితే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నందున వడివడిగా యాత్ర సాగించనున్నారు. మరి కొద్ది సేపటిలో టాంక్ బండ్ వద్దకు బడా గణేష్ విగ్రహం రానుంది. ► గత ఏడాది కన్నా ఈ ఏడాది నిమజ్జన ఏర్పాట్లు ఎంతో ఘనంగా చేశామని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. తను దగ్గరుండి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చూస్తున్నట్లు పేర్కొన్నారు. నిమజ్జన కార్యక్రమం పూర్తయిన తర్వాత వ్యర్ధాలను తీసివేసే పని మొదలు పెడతామన్నారు. ► ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖైరతాబాద్ గణేషుడిని ట్రాలీలోకి ఎక్కించారు. ట్రాలీలో వెల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి. మరికాసేపట్లో 50 అడుగుల బడా గణేష్ శోభాయాత్ర ప్రారంభం కానుంది. ►ఖైరతాబాద్ గణేష్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంగరంగ వైభవంగా వినాయకుని నిమజ్జనాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రపంచంలో కెల్లా హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలకి ప్రత్యేకత ఉందని, భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. భారీ జనసమూహం మధ్య ఖైరతాబాద్ వినాయకుడి శోభ యాత్ర #KhairatabadGanesh pic.twitter.com/h31teOJMeW — Latha (@LathaReddy704) September 9, 2022 ►సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని తెలిపారు. 10వేలమంది పోలీసులు, 10వేలమంది శానిటేషన్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ రాత్రి నుంచి రేపటి ఉదయం వరకూ నిమజ్జనాలు జరుగుతాయనిచ రాత్రి ఎక్కువగా వర్షం కురవడంతో ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర ఆలస్యం అయిందన్నారు. ► ఖైరతాబాద్ గణనాథుడి వద్దకు చేరుకున్న మంత్రి తలసాని. ►బడా గణేషుడిని టస్కర్ మీదికి ఎక్కించే ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ క్రేన్ సహాయంతో గణేషుడిని విగ్రహాన్ని లిఫ్ట్ చేసేందుకు ప్రక్రియ మొదలైంది. వంద టన్నులు బరువు మోయగల బరువున్న లారీ, క్రేన్ సహాయంతో నిమర్జన శోభాయాత్ర ఏర్పాట్లు చేశారు. సాక్షి, హైదరాబాద్: పంచముఖ మహాలక్ష్మీ గణపతి శోభాయాత్ర కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈసారి 50 అడుగుల ఎత్తుతో రూపుదిద్దుకున్న మట్టి మహాగణపతి హుస్సేన్ సాగరంలో నిమజ్జనానికి తరలి వెళ్లనున్నాడు. 50 అడుగుల భారీ మట్టి మహాగణపతిని ఊరేగింపుగా నిమజ్జనం చేయడం ఇదే తొలిసారి. ఒడిశాకు చెందిన క్లే ఆర్టిస్టు జోగారావు నేతృత్వంలో శిల్పి చిన్నస్వామి సారథ్యంలో 30 మంది క్లే ఆర్టిస్టులు మట్టి మహాగణపతి తయారీలో పాల్గొన్నారు. ► గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతి బరువు రెట్టింపైంది. పూర్తిగా మట్టితో తయారు చేయడంతో మహాగణపతి బరువు 60– 70 టన్నులకు చేరింది. ►మహాగణపతిని సాగర తీరానికి ట్రయిలర్ వాహనంపై తరలిస్తారు. లేటెస్ట్ మోడల్ మెకానికల్ ట్రయిలర్ ఓల్వో ఇంజిన్ సామర్థ్యం. డీఎస్–6 పర్యావరణ కాలుష్య ప్రీ వాహనం. ఈ ట్రయిలర్ పొడవు 75 అడుగులు, 11 అడుగుల వెడల్పు ఉంటుంది. 26 టైర్లు ఉన్న ఈ వాహనం 100 టన్నుల బరువు వరకు కూడా మోస్తుంది. ►ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి 2010 నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా గౌతంపల్లి గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి తొమ్మిదోసారి రథసారథిగా వ్యవహరించనున్నారు. ►మహాగణపతికి గురువారం రాత్రి 11.10 గంటలకు చివరి పూజ నిర్వహించి కలశాలను కదిలించారు. క్రేన్ నంబర్ 4 వద్దకు.. ఎన్టీఆర్ మార్గ్‌లో క్రేన్ నంబర్–4 వద్దకు మహాగణపతి మధ్యాహ్నం 1 గంటలకల్లా చేరుకోగానే వెల్డింగ్ తొలగింపు, చివరి పూజలు అనంతరం మధ్యాహ్నం 2 గంటల కల్లా సాగర్‌లో మహా గణపతి నిమజ్జనం పూర్తవుతుందని పోలీసులు తెలిపారు. రూట్ మ్యాప్ ఇలా.. ఖైరతాబాద్ మండపం నుంచి ప్రారంభమయ్యే మహాగణపతి శోభాయాత్ర సెన్షేషన్ థియేటర్ ముందు నుంచి రాజ్ దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఎక్బాల్ మినార్ చౌరస్తా, తెలుగుతల్లి చౌరస్తా నుంచి లుంబినీ పార్క్ నుంచి ఎన్టీఆర్ మార్గ్‌లో క్రేన్ నం– 4 వద్దకు చేరుకుంటుంది. -
పూజలు సేయ తరలివచ్చారు.. మహాగణపతి సేవలో ప్రముఖులు
ఖెరతాబాద్: ఖైరతాబాద్‌లో కొలువైన 50 అడుగుల మట్టి మహాగణపతి సేవకు ప్రముఖులు క్యూ కట్టారు. పంచముఖ మహాలక్ష్మీ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం ఉదయం తొలిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ పంచముఖ మహాలక్ష్మీ గణపతి అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పూజలు నిర్వహించారు. అన్ని శాఖల సమన్వయంతో గణేష్ ఉత్సవాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తామని ఆయన చెప్పారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జవదేకర్, డీజీపీ మహేందర్‌రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్, ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్ తదితరులు మహాగణపతిని దర్శించుకున్నారు. మహాగణపతిని తొలిరోజు 2 లక్షలమందికి పైగా భక్తుల దర్శించుకున్నట్లు అంచనా. పోటెత్తిన భక్తులు జంధ్యం, కండువా సమర్పణ పంచముఖ మహా లక్ష్మీ గణపతికి పద్మశాలి సంఘం తరఫున 60 అడుగుల కండువా, గరికమాల, జంధ్యం, పట్టు వస్త్రాలను సమర్పించారు. తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జనరల్ బండా శివానంద ప్రసాద్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్, హైదరాబాద్ జిల్లా అడిషినల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, గాంధీ హాస్పిటల్ డిప్యూటీ సూపరిండెంట్ డాక్టర్ నర్సింహారావులు ఉన్నా రు. కార్యక్రమంలో ఖైరతాబాద్ పద్మశాలి సంఘం సభ్యులు శ్రీధర్, ఏలే స్వామి, గుర్రం కొండయ్య పాల్గొన్నారు. -
Chinnaswamy Rajendran: ఇక్కడ దొరికే సంతోషం ఎక్కడా దొరకదు
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతిని ప్రతి యేటా వివిధ రూపాల్లో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతూ భక్తుల మన్ననలు పొందుతున్నారు. ఆయనకు 18 ఏళ్లు ఉన్నప్పుడే మహాగణపతిని రూపుదిద్దారు. నూతన యవ్వనంలో ఉన్న పిల్లోడు గణపతి ప్రతిమను ఇంత బాగా తయారు చేశాడా? అని అంతా వేనోళ్ల పొగిడారు. ఇప్పటివరకు తయారు చేసినవాటిలో ఎలుక రథంపై ఉన్న గణేష్ విగ్రహమే తనకు అత్యంత ఆనందాన్నిచ్చిందంటున్నారు. 1978 నుంచి ఖైరతాబాద్ మహా గణపతిని తయారు చేస్తూ వస్తున్న శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్.. ‘సాక్షి’తో తన అనుభవాలను పంచుకున్నారు. మహాగణపతి తయారీ అవకాశం మీకెలా దక్కింది? 1978లో రిజర్వ్‌బ్యాంక్‌లో ఉద్యోగి ఏసుపాదం నా వద్దకు వచ్చి ఖైరతాబాద్‌లో శంకరయ్య ఆధ్వర్యంలో వినాయకుడిని 14 అడుగుల ఎత్తులో తయారు చేయాలని తీసుకువెళ్లారు. నాకు అప్పుడు 18 ఏళ్లు. ఇంత చిన్న పిల్లోడు విగ్రహం ఎలా తయారు చేస్తాడు? అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశా. తొలిసారిగా ఖైరతాబాద్‌లో ఆరు బయట స్టేజీ వేసి విష్ణు అవతారంలో వినాయక విగ్రహాన్ని రూపొందించాను. ఆ తర్వాత నాట్య వినాయకుడు, 1980లో పంచముఖ వినాయకుడిని శారదా స్టూడియోలో చేసి ఇక్కడకు తీసుకువచ్చాం. 1982లో ఎలుక రథంతో ఖైరతాబాద్ మంటపంలో వీలు ఉండే స్టాండ్‌లో కర్రలతో తయారు చేశాం. అప్పుడు సాగర సంగమం సినిమా షూటింగ్లో భాగంగా కమల్‌హాసన్‌తో ఇక్కడే ఓ పాటను రికార్డింగ్ చేశారు. ఇన్నేళ్లలో ఎప్పుడైనా విరామం ఇచ్చారా? 1983లో అనివార్య కారణాలతో రాలేకపోయాను. అప్పుడు ఆర్టిస్టు బ్రహ్మం 25 అడుగులతో వెల్డింగ్‌తో వినాయకుడిని తయారు చేశారు. చివర్లో మళ్లీ 10 రోజులు నేను వచ్చి తుది మెరుగులు దిద్దాను. 1993 నుంచి 1999 వరకు 7 ఏళ్లపాటు ఖైరతాబాద్ మహాగణతికి శిల్పిగా వ్యవహరించలేదు. 2000 నుంచి 2005 వరకు కమిటీ వాళ్లు ఇచ్చిన డ్రాయింగ్ మేరకు విగ్రహ తయారీ జరిగేది. 2006 నుంచి దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠలశర్మ పంచాగం చూసి నామకరణం, ఆకారం ఎలా ఉండాలో సూచించేవారు అదే విధంగా ఇప్పటి వరకు పాటిస్తూ వస్తున్నాం. నామకరణం పెట్టిన తర్వాత మహాగణపతికి పేరు ప్రతిష్ఠలు పెరిగాయి. మీకు అత్యంత ఆనందాన్నిచ్చిన గణపతి? 1982లో ఎలుక రథంపై చేసిన వినాయకుడు బాగా సంతోషం కలిగింది. ఆ తర్వాత విశ్వరూప వినాయకుడు, మత్స్య వినాయకుడి రూపంలో చేసినవి నాకెంతో సంతృప్తినిచ్చాయి. ప్రతిసారి నాలోని శక్తినంతా కూడదీసుకుని తయారు చేస్తూ వస్తున్నా. విగ్రహ తయారీ సమయంలో ఎలాంటి అనుభూతి పొందుతారు? 2003లో యాదాద్రి సురేంద్రపురిలో పని చేస్తుండంతో నేను ఆ ఏడాది విగ్రహం తయారు చేయలేనని చెప్పాను. తర్వాత నేను టూ వీలర్‌పై వెళ్తుండగా పెద్ద ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో నా బండి పూర్తిగా ధ్వంసమైనా నాకేమీ కాలేదు. అప్పుడు నా మదిలో మెదిలింది ఖైరతాబాద్ మహాగణపతే. దాంతో ఆ సంవత్సరం కూడా నేను శిల్పిగా వ్యవహరించి వినాయకుడిని పూర్తి చేశా. నేను బతికి ఉన్నంత కాలం మహాగణపతి తయారీలో ముందుంటాను. మీ స్వగ్రామంలో మీకెలాంటి గుర్తింపు ఉంది? మా సొంతూరు తమిళనాడులోని పెరంబలూరు జిల్లా పుదువేటైకుడి. తల్లిదండ్రులు చిన్నస్వామి, మరుదాయి. నేను రెండో సంతానం. చిన్నస్వామి రాజేంద్రన్ అని పేరు పెట్టారు. ఖైరతాబాద్ వినాయకుడిని చేసినప్పటి నుంచి నాతో పాటు నా కుటుంబానికి మంచి గుర్తింపు వచ్చింది. ఎక్కడకు వెళ్లినా ఖైరతాబాద్ విగ్రహ తయారీ శిల్పిగా గుర్తింపు వచ్చింది. మీ వ్యక్తిగత జీవితం గురించి వివరిస్తారా? ఖైరతాబాద్ మహాగణపతికి శిల్పిగా వ్యవహరిస్తున్నప్పటి నుంచి నా వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాఫీగా ఉంది. 68వ సంవత్సరంలో కూడా 50 అడుగులపై గోవా కట్టెలు ఎక్కి పని చేస్తున్నానంటే అన్నీ మహాగణపతి దీవెనలే. నా భార్య రాజ్యలక్ష్మి, కుమారుడు మోహన్‌కృష్ణ, కూతురు మాలతి ఎప్పుడూ నాకు సపోర్ట్‌గా ఉంటారు. అన్ని వేళలా సహాయ సహకారాలు అందజేస్తారు. నగరంతో మీకున్న అనుబంధం? హైదరాబాద్‌లో ఎక్కడా లేని విధంగా వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ ఉత్సవాలకు హాజరు కావడం నాకెంతో సంతోషాన్నిస్తుంది. ఇక్కడ దొరికే సంతోషం ఎక్కడా దొరకదు. అందరి అభిమానం మరువలేను. ఈ ఏడాది మట్టి వినాయకుడి తయారీపై మీ ఫీలింగ్? మట్టి వినాయకుడిని చేయాలనేది గత 10 ఏళ్లుగా నా కోరిక. గత సంవత్సరం ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్‌తో.. మట్టి విగ్రహాన్ని తయారు చేస్తానని చెప్పాను. విగ్రహం తయారు చేస్తున్నప్పుడు వర్షం అడ్డంకిగా మారినా ఏమాత్రం వెనుకంజ వేయకుండా నిర్విఘ్నంగా పూర్తి చేశా. అంతా ఆ మహాగణపతి చల్లని చూపులే కారణం. (క్లిక్: ఖైరతాబాద్‌లో కొలువు దీరిన మహా గణపతి) -
ఖైరతాబాద్‌లో కొలువు దీరిన మహా గణపతి
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్‌లో మహాగణపతి కొలువుదీరాడు. ఉదయం 9.30 గంటలకు నిర్వహించిన మహాగణపతి తొలి పూజకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్, ఉపాధ్యక్షుడు నాగేష్ హాజరయ్యారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిరానుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ ఏడాది ప్రత్యేకంగా మట్టితో 50 అడుగుల ఎత్తులో శ్రీ పంచముఖ మహా లక్ష్మీ గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక నేటి(బుధవారం) నుంచి ప్రారంభం కానున్న నవరాత్రి ఉత్సవాల కోసం నగరం శోభాయమానమైంది. వినాయక చవితి వేడుకలకు మండపాలు అందంగా ముస్తాబయ్యాయి. మహానగరం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. మరోవైపు వినాయక విగ్రహాలు, పూలు, పండ్లు, పూజా సామగ్రి తదితర వస్తువుల కొనుగోళ్లతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. ప్రధాన రహ దారులకు ఇరువైపులా అమ్మకాలతో సందడి నెలకొంది. పర్యావరణహిత మట్టి ప్రతిమల పట్ల నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ లాంటి ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే లక్షలాది విగ్రహాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశాయి. గణపతి వేడుకలకు భారీ ఏర్పాట్లు బన్సీలాల్‌పేట్: గణేష్ నవరాత్రోత్సవాలు నగరంలో బ్రహ్మాండంగా నిర్వహించడానికి ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సికింద్రాబాద్ బుద్ధభవన్‌లో మంగళవారం గణేష్ ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనోత్సవ ఏర్పాట్లపై పోలీసు, జీహెచ్ఎంసీ, జలమండలి, ఆర్అండ్బీ, విద్యుత్తు విభాగాల ఉన్నతాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగర్ ప్రజలు గణేష్ పండుగ వేడుకలు భక్తిప్రపత్తుల మధ్య అత్యంత ఘనంగా జరపుకోడానికి వీలుగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. నగరంలో సుమారు 35 నుంచి 40 వేల వరకు గణేష్ మండపాలను ఏర్పాటు చేశారన్నారు. మండపాల వద్ద నిర్వాహకులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 9 శుక్రవారం గణేష్ నిమజ్జనోత్సవం జరగనుందన్నారు. సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, అడిషనల్ కమిషనర్ సంతోష్, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శీలం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
వినాయకచవితికి సిద్ధమైన ఖైరతాబాద్ విఘ్నేషుడు
-
నాడు 15 రోజులపాటు వాహనంపైనే ఖైరతాబాద్ గణేషుడు.. కారణం ఇదే!
సాక్షి, ఖైరతాబాద్: ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్‌తోపాటు చెరువుల్లో నిమజ్జనం చేయనివ్వొద్దని హైకోర్టు సూచనలు చేసిన నేపథ్యంలో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనంపై సందిగ్ధం నెలకొంది. ఈ ఏడాది 40 అడుగుల ఎత్తులో శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిగా వినాయకుడు కొలువుదీరాడు. ప్రతి ఏటా మహాగణపతిని అత్యంత వైభవంగా..హంగూ ఆర్భాటాలతో ఖైరతాబాద్ నుంచి ట్యాంక్‌బండ్‌కు తరలించి అక్కడే నిమజ్జనం చేస్తున్నారు. పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన క్రేన్లు వేలాది మంది భక్తులు పాల్గొనే నిమజ్జన శోభార్యాలీ మొత్తం గణేష్ ఉత్సవాల్లోనే హైలెట్‌గా నిలుస్తుంది. ఇందుకోసం నిర్వాహకులతోపాటు అధికారులు, పోలీసు యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేపడుతుంది. అయితే..ఈసారి నిమజ్జనంపై కోర్టు సూచనల నేపథ్యంలో అధికారులు, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో అసలు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తారా..లేకుంటే ప్రత్యామ్నాయంగా ఎక్కడ ఏర్పాట్లు చేస్తారనేదానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సాగర్‌లోనే నిమజ్జనం: ఉత్సవ కమిటీ ఈసారి కూడా మహాగణపతి నిమజ్జనం హుస్సేన్‌సాగర్‌లోనే జరగాలని, 66 సంవత్సరాలుగా ఇది సంప్రదాయంగా కొనసాగుతోందని ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ఒక వేళ హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి అనుమతివ్వకుంటే, ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు మహాగణపతి విగ్రహాన్ని ఇక్కడే ఉంచుతామని పేర్కొన్నారు. 1986లో ఇలా... 1986లో 20 అడుగుల ఎత్తులో తయారుచేసిన వినాయకుడిని సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు ట్యాంక్‌బండ్‌పైకి వెళ్లగా అక్కడ తగిన సౌకర్యాలు కల్పించ లేదు. దీంతో 15 రోజుల పాటు వినాయకుడ్ని అక్కడే వాహనంపైనే ఉంచారు. ఆ తర్వాత ప్రభుత్వం ప్రత్యేక క్రేన్ ఏర్పాటు చేయడంతో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. తలసానికి విన్నపం అఫ్జల్‌గంజ్: హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు విధించిన ఆంక్షల నేపథ్యంలో మంగళవారం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి చర్చించారు. గణేష్ విగ్రహాల సామూహిక నిమజ్జనం హుస్సేన్‌సాగర్‌లో జరిపేలా ప్రభుత్వం తరపున చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు జి. రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంత్‌రావు, ఉపాధ్యక్షులు కరోడీమాల్, కోశాధికారి శ్రీరామ్‌వ్యాస్, రామరాజు, కార్యదర్శులు మహేందర్, శశి, ఆలె భాస్కర్, రూప్‌రాజ్ తదితరులు ఉన్నారు. అంబారీపై ఊరేగింపు.. వచ్చేసారి 70 అడుగుల మట్టి వినాయకుడు వచ్చే సంవత్సరం..2022లో ఖైరతాబాద్ మహాగణపతిని మట్టితో 70 అడుగుల ఎత్తులో తయారుచేస్తాం. ఈ భారీ వినాయకుడిని ఉన్నచోటే నిమజ్జనం చేస్తాం. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని..ఖైరతాబాద్ మహాగణపతిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. – సింగరి సుదర్శన్, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ 1954 : ఒక అడుగు వేరేచోట కష్టమే... 40 అడుగుల ఎత్తులో ఉన్న భారీ వినాయకుడిని హుస్సేన్‌సాగర్‌లో కాకుండా వేరేచోట నిమజ్జనం చేయడం కష్టమేనని నిపుణులు, ఉత్సవ కమిటీ సభ్యులు చెబుతున్నారు. మహాగణపతిని నిమజ్జనం చేసేంత విశాలమైన, లోతైన కొలనులు సమీపంలో ఎక్కడా లేవు. ఒకవేళ అంతపెద్ద పాండ్‌ను రూపొందించాలన్నా ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. అంత సమయమూ లేదు. మరోవైపు మహాగణపతి విగ్రహం మరో ప్రాంతానికి తీసుకెళ్లాలంటే రహదారిలో అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతాయి. ఫ్లై ఓవర్లు, మెట్రో మార్గంలో పిల్లర్లు, విద్యుత్ కేబుళ్లు దాటుకుంటూ తరలించడం అసాధ్యం. ఇది చాలా ఇబ్బందులతో కూడుకున్న పనిగా చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మహాగణపతి నిమజ్జనం ఎక్కడ, ఎలా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో నెలకొంది. గణేష్ మండపాల డిమాండ్ మేరకు వాహనాలు సాక్షి, సిటీబ్యూరో: వినాయక నిమజ్జన ఉత్సవాలపై రవాణాశాఖ దృష్టి సారించింది. ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్న నిమజ్జనం కోసం ప్రస్తుతం వెయ్యి భారీ వాహనాలను సిద్ధం చేసినట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ నాయక్ తెలిపారు. గణేష్ మండపాల డిమాండ్ మేరకు అవసరమైన వివిధ రకాల వాహనాలను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సూచన మేరకు నగరంలోని ప్రధాన మండపాల నుంచి వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలించేందుకు భారీ ట్రాలీ వాహనాలు మొదలుకొని టాటాఏస్ వంటి చిన్న వాహనాల వరకు అందజేయనున్నారు. నిమజ్జన వాహనాల కోసం వచ్చే మండపాల నిర్వాహకులకు నగరంలోని 12 చోట్ల వాహనాలను సిద్ధంగా ఉంచుతారు. ► నెక్లెస్‌రోడ్డు. మేడ్చల్, టోలీచౌకి, జూపార్కు, మలక్‌పేట్, కర్మన్‌ఘాట్, నాగోల్, గచ్చిబౌలి, మన్నెగూడ, పటాన్చెరు, ఆటోనగర్ నుంచి వాహనాలను తీసుకోవచ్చు. ► 19వ తేదీన నిమజ్జనంజరుగనున్న దృష్ట్యా మండపాల నిర్వాహకులు 18వ తేదీనే వాహనాలను తీసుకెళ్లవచ్చు. ► మరోవైపు వాహనాలను అందజేసేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రాంతీయ రవాణా అధికారుల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు జేటీసీ వెల్లడించారు. వాహనాల అద్దె.. ► నిమజ్జనానికి తరలి వచ్చే వాహనాల అద్దెలను సైతం అధికారులు ఖరారు చేశారు. ► భారీ ట్రాలీ లేదా టస్కర్‌లకు రూ.20 వేలు. (డీజిల్ ఖర్చు, డ్రైవర్ బత్తాతో కలిపి) ► 10 నుంచి 12 టైర్ల సామర్ధ్యం ఉన్న హెవీగూడ్స్ వెహికల్స్‌కు రూ. రూ.4000. డీజిల్ ఖర్చు, డ్రైవర్‌కు రూ.500 బత్తా అదనం. ► 6 టైర్ల సామర్ధ్యం కలిగిన లారీలకు రూ.2500, ► మిడిల్ గూడ్స్ వెహికల్స్‌కు రూ.1600, ► డీసీఎం వంటి లైట్‌గూడ్స్ వెహికల్స్‌కు రూ.1300, ► టాటాఏసీలకు రూ.1000 చొప్పున అద్దెలు చెల్లించాల్సి ఉంటుంది. ► వీటితో పాటు ప్రతి వాహనం డ్రైవర్‌కు బత్తా తప్పనిసరిగా ఇవ్వాలి. -
ఖైరతాబాద్ గణేశుడి వద్ద భక్తులు క్యూ ఫొటోలు
-
కొలువుదీరిన శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి
-
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ తమిళసై తొలిపూజ
-
ఖైరతాబాద్ గణపతికి గవర్నర్ తొలిపూజ
ఖైరతాబాద్: శ్రీపంచముఖ రుద్ర మహాగణపతిగా ఈ సంవత్సరం రూపుదిద్దుకున్న ఖైరతాబాద్ మహాగణపతి తొలిపూజా కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు పాల్గొన్నారు. తొలిపూజ అనంతరం గవర్నర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, మహాగణపతి ఆశీర్వాదంతో తెలు గు రాష్ట్రాలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని కోరుకున్నట్లు తెలిపారు. పూజా కార్యక్రమంలో మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డిలు పాల్గొన్నారు. విఘ్నాధిపతికి 60 అడుగుల కండువా మహాగణపతికి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 60 అడుగుల కండువా, గరికమాల, యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు స్వామి వారికి 25 కిలోల లడ్డూను సమర్పించారు. మహాగణపతిని దర్శించుకున్న కిషన్‌రెడ్డి, కేటీఆర్‌లు వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం సాయంత్రం 7.30 గంటలకు మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకొని పూజలు చేశారు ఇవీ చదవండి: మరో పాటతో దూసుకుపోతున్న మంగ్లీ మహాకాయ.. అభయమీయవయా! -
ఈ ఏడాది ఘనంగా గణేష్ ఉత్సవాలు.. ముస్తాబవుతున్న ఖైరతాబాద్
వినాయక చవితి.. ఆ పండుగకు ఉండే జోషే వేరు. గణేష్ మండపాలు, భారీ సెట్టింగులు, వీధికో వినాయకుడు, పెద్దఎత్తున పూజలు ఇలా ప్రతీదిగా సందడిగా ఉంటుంది. ఇక, నవరాత్రుల చివరి రోజున నిర్వహించే శోభాయాత్ర అయితే మామూలుగా ఉండదు. కిలోమీటర్ల మేర బారులు తీరిన గణనాథులను చూడ్డానికి రెండు కళ్లూ సరిపోవు. నాలుగైదు నెలల ముందు నుంచే విగ్రహాలు తయారైతే, నెలరోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది. గణపతి బప్పా మోరియా… జైబోలో గణేష్ మహరాజ్ కీ జై… నినాదాలతో దేశమంతా మారుమోగిపోతుంది. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది ఈ సందడి లేదు. అయితే ఈ ఏడాది మాత్రం వినాయక చవితికి మళ్లీ సందడి కనిపించనుంది. ఈసారి గణేష్ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేలా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో మహా సంబరానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సెప్టెంబర్ 10న వినాయక చవితి ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. గణేష్ విగ్రహాల తయారీ ఊపందుకుంది. ప్రతిమల ముస్తాబు చివరి దశకు చేరుకుంది. నవరాత్రుల బందోబస్తు, సామూహిక నిమజ్జనం తదితర ఏర్పాట్లకు సంబంధించి నగర పోలీసుల పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడిని పంచముఖ రుద్ర మహాగణపతి రూపంలో తయారు చేస్తున్నారు. మరి ఆ ఆకారంలో రూపొందించడానికి కారణం ఏంటి?, ఈసారి ఎన్ని అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఖైరతాబాద్ మహా గణపతి తయారీకి సంబంధించిన విశేషాలను శిల్పి రాజేంద్రనాథ్ ‘సాక్షి’ డిజిటల్‌కు వివరించారు. ఆ విశేషాలేంటో ఈ వీడియోలో చూడండి. -
కొలువుదీరిన ఖైరతాబాద్ గణనాథుడు
-
కొలువుదీరిన ఖైరతాబాద్ గణపతి
సాక్షి, హైదరాబాద్: ధన్వంతరీ నారాయణ మహాగణపతిగా కొలువుదీరిన ఖైరతాబాద్ గణనాథుడికి కండువ, గరక మాల, జంజెం, పట్టు వస్త్రాలను పద్మశాలి సంఘం సమర్పించింది. ఆంధప్రదేశ్‌లోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ వారు ప్రత్యేక తయారు చేసిన 100 కిలోల లడ్డూ ప్రసాదం గణపతి చేతిలో కొలువుదీరింది. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ దంపతులు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుని తొలి పూజ నిర్వహించారు. పది కిలోల వెండిని గణపతికి బహుకరించారు. గతంలో కంటే విభిన్నంగా తొమ్మిది అడుగుల మట్టితో గణపతిని ప్రతిష్టించారు. కరోనా కారణంగా వేడుకలను నిరాడంబరంగా జరుపుతున్నారు. కోవిడ్ నిబంధనలు నేపథ్యంలో వేలాదిగా ఒకేసారి తరలివచ్చే భక్తులను కట్టడిచేసేందుకు ఆన్లైన్లో మాత్రమే భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. భక్తులను గుంపులుగా పోలీసులు అనుమతించడం లేదు. -
ఖైరతాబాద్ గణేషుని ఎత్తు ఖరారు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ వినాయకుడిపై కూడా కరోనా ప్రభావం పడింది. కరోనా నేపథ్యంలో ఈ సారి 27 అడుగుల ఎత్తులో మట్టి వినాయకున్ని ప్రతిష్టంచనున్నట్టు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది. ధన్వంతరి రూపంలో ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు దర్శనం ఇవ్వనున్నట్టుగా కమిటీ సభ్యులు చెప్పారు. ఒక చేతిలో అమృతం, మరో చేతిలో ఆయుర్వేదంతో గణేషుడు కనిపించనున్నారు .ప్రతి ఏడాదిలాగే శిల్పి రాజేందర్ వినాయకుడి విగ్రహాన్ని రూపొందించనున్నారు.(చదవండి : కరోనా పరీక్షలు నిలిపేస్తున్నామని ఎలా చెబుతారు?) కరోనా వ్యాక్సిన్‌ను త్వరగా వచ్చేలా చేయాలని భగవంతుడి ఆశీస్సులు కోరుతూ ఈ ఏడాది ధన్వంతరి వినాయకుడిని ప్రతిష్టనుంచనున్నట్టు కమిటీ సభ్యులు వెల్లడించారు. విగ్రహం తయారుచేయడానికి కావాల్సిన మట్టిని గుజరాత్ నుంచి తెప్పించనున్నట్టుగా తెలిపారు. అయితే ఈ సారి ఖైరతాబాద్ వినాయకుడిని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయబోమని చెప్పారు. ఉన్న స్థలంలోనే పలు ద్రవాలతో అభిషేకం నిర్వహించి నిమజ్జన ప్రక్రియ పూర్తిచేయనున్నట్టుగా పేర్కొన్నారు. కాగా, కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది ఒక్క అడుగు ఎత్తులోనే ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం తయారుచేయాలని తొలుత భావించారు. అయితే భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తిల మేరకు తాజాగా 27 అడుగుల ఎత్తులో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. -
ఖైరతాబాద్ గణేష్‌పై కరోనా ఎఫెక్ట్..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వినాయకుడిపై కరోనా ప్రభావం పడింది. కరోనా నేపథ్యంలో భారీ విగ్రహ ఏర్పాటును కమిటీ విరమించుకుంది. ఈ ఏడాది ఒక్క అడుగు ఎత్తులోనే విగ్రహం ప్రతిష్టించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఈ నెల 18న నిర్వహించాల్సిన కర్ర పూజ కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారు. పోలీసులు అనుమతి వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని కమిటీ తెలిపింది. ఈ నెల 18న ఖైరతాబాద్ గణేష్ విగ్రహ కర్రపూజ ప్రారంభించాలని అనుకున్నామని.. కానీ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కర్ర పూజ ని రద్దు చేశామని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సుదర్శన్ ‘సాక్షి’కి తెలిపారు. ‘‘18 తలలతో విశ్వరూప వినాయకుడు ప్రతిష్టించాలని అనుకున్నాం. ఒక్క అడుగు తో పక్కనే ఉన్న ఆలయంలో విగ్రహం ఏర్పాటు చేసుకుంటాం. కరోనా వ్యాప్తి తగ్గితే భారీ వినాయకుడిని ప్రతిష్టించే ఆలోచన చేస్తామని’’ పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి, రాష్ట్ర పోలీస్ అధికారులను కలుస్తామని తెలిపారు. అనంతరం తమ నిర్ణయం ప్రకటిస్తామని సుదర్శన్ వెల్లడించారు. -
ఖైరతాబాద్ మహాగణపతి : ‘మహా’ భక్త జనసంద్రం
-
ఖైరతాబాద్‌లో కొలువుదీరిన గణనాధుడు
-
గణేష్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: గణేష్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. తొలిసారి దేవాదాయశాఖ ఆధ్వర్యంలో గంగాహారతిని ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన హోం మంత్రి మహమూద్‌అలీ, మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రాంమోహన్‌లు వివిధ శాఖల అధికారులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సచివాలయంలో సమీక్షించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 55 వేలకు పైగా విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తలసాని చెప్పారు. ఖైరతాబాద్ గణేశుడి వద్ద 9 రోజులు సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. -
ఈసారి గణేశుడు ఇలా..
ఖైరతాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి ఈ ఏడాది 61 అడుగు ల ఎత్తులో దర్శనమివ్వనుంది. మహాగణపతి చరిత్రలోనే ఇదే అత్యధికం. వాస్తవానికి మహాగణపతి 60 అడుగులకు చేరిన తర్వాత ప్రతిఏటా ఒక్క అడుగు చొప్పున ఎత్తుతగ్గిస్తున్న విషయం విదితమే. ఈసారి ద్వాదశాదిత్య రూపంలో భారీ గణపతిని తయారు చేయనున్న నేపథ్యంలో ఎత్తు 61అడుగులు ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు తుది నమూనాను ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తదితరులు మంగళవారం విడుదల చేశారు. ఎందుకీ పేరు? సూర్యుడు మనకు 12 రూపాల్లో కిరణాలుఅందిస్తాడు. అందుకే ద్వాదశాదిత్యుడని పేరు.ఆ 12 రకాల కిరణాల చెడు ప్రభావం మనపై పడకుండా కాపాడేందుకు ద్వాదశాదిత్య మహాగణపతిగా నామకరణం చేశాం. సూర్యుడు కూడా మహాగణపతి అధీనంలో ఉన్నాడని చెబుతూ.. ఈ సంవత్సరం అతివృష్టి, అనావృష్టి లేకుండా వర్షాలు కురవాలని, నవగ్రహ,రాహుకేతు, శనేశ్వరుడు, కుజ గ్రహాల దుష్ప్రభావాల నుంచిప్రజలను మహాగణపతి కాపాడాలని విగ్రహాన్ని ఈ రూపంలో తయారు చేయాలని నిర్ణయించాం. – దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠలశర్మ అందుకే ఇంతెత్తు.. వినాయకుడి ఎత్తు గతేడాది 56 అడుగులే ఉంది. ఈసారి వినాయకుడి తలపై మరొక తలను అదనంగా ఏర్పాటు చేయడం, దానిపై సూర్యభగవానుడి చక్రం, ఆపై 12 తలల పాములను ఏర్పాటు చేయడంతో గణపతి ఎత్తు 61 అడుగులకు చేరుకుంది. – శిల్పి రాజేంద్రన్ ప్రత్యేకతలివీ... పేరు: ద్వాదశాదిత్య మహాగణపతి ఆకారం: సూర్య భగవానుడి రథంపై 61 అడుగుల ఎత్తు 28 అడుగుల వెడల్పు 50 టన్నుల బరువు 12 ముఖాలు 24 చేతులు 12 సర్పాలు అశ్వాలు: 7 (వీటి ఎత్తు 20 అడుగులు) రథం లోపల కుడివైపు: మహంకాళి, మహాసరస్వతి స్వరూపమైన సిద్ధకుంజికా దేవి 12 అడుగుల ఎత్తులో 3 ముఖాలు, 6 చేతులతో ఉంటుంది. రథం లోపల ఎడమవైపు: బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపమైన దత్తాత్రేయస్వామి 12 అడుగుల ఎత్తులోగోవుతో నిలబడి ఉంటారు. విగ్రహానికి కుడివైపు మహావిష్ణువుతో పాటు ఏకాదశి దేవి విగ్రహాలు 16 అడుగుల ఎత్తులో ఉంటాయి. విగ్రహానికి ఎడమవైపు త్రిమూర్తులతో దుర్గాదేవి విగ్రహాలు 16 అడుగుల ఎత్తులో ఉంటాయి. షెడ్డు ఎత్తు 65 అడుగులు వెడల్పు 30 అడుగులు -
గంగమ్మ ఒడి చేరిన మహాగణపతి
-
మొదలైన ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర
-
గంగమ్మ ఒడి చేరిన మహాగణపతి
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా మధ్యాహ్నం ఒంటిగంటలోపే గణపతి నిమజ్జనం పూర్తయింది. తొమ్మిది రోజుల పాటు అశేష భక్తుల పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణనాథుని శోభయాత్ర ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా మహాగణపతి నిమజ్జనం కోనం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆరో నంబర్ క్రేన్ వద్ద శోభాయాత్ర చేరుకుంది. నగరంలో వైభవంగా కొనసాగుతున్న వినాయక నిమజ్జనం అప్డేట్స్ ఇవి. టాంక్ బండ్‌కు చేరుకున్న బాలాపూర్ గణనాథుడు హుస్సేన్ సాగర్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వరకు బారులు తీరిన గణనాధుల శోభాయాత్ర రథాలు గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటివరకు 51,500 గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగాయి. ఒక్క ట్యాంక్బండ్లోనే 16 వేల విగ్రహాల నిమజ్జనం కానున్నాయి. ట్యాంక్‌బండ్‌పై 29 క్రేన్లు, నెక్లెస్ రోడ్ మార్గంలో 9క్రేన్లు.. మొత్తం 38 క్రేన్ల ఏర్పాటు చేశాం. - దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలిస్తున్న వినాయకుడి విగ్రహాలతో ట్యాంక్ వద్ద భక్తుల కోలాహలం నెలకొంది. ఎన్టీఆర్ మార్గ్‌లో వినాయకుడి విగ్రహాలు బారులు తీరాయి. నిర్విరామంగా కొనసాగుతున్న ఖైరతాబాద్ సప్త ముఖ కాలసర్ప మహాగణపతి శోభాయాత్ర.. ఇప్పటికే సెన్సేషన్ థియేటర్ దాటి వాసవీ అతిధిగృహం వరకు చేరుకున్న శోభా యాత్ర.. ఉదయాన్నే శోభాయాత్ర ప్రారంభం కావటం.. పెద్దగా భక్తులు రాకపోవటంతో నిమజ్జనం ఘాట్‌కు ప్రశాంతంగా సాగుతున్న శోభాయాత్ర.. గతంలో ఎప్పుడూ లేనివిధంగా మధ్యాహ్నం 12 గంటలలోపే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయ్యే అవకాశం. నగరంలో వినాయక నిమజ్జనానికి ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సాయం అందిస్తోంది. నిమజ్జన ఊరేగింపు, ట్రాఫిక్ స్థితిగతుల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తోంది. నగరంలో సాగుతున్న వినాయక శోభాయాత్ర వీఆర్ డీవోటీ యాప్ తిలకించవచ్చు. ట్యాంక్‌బండ్ వద్ద గణేశ్ నిమజ్జనం కార్యక్రమాన్ని వీక్షించనున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఉప రాష్ట్రపతి హోదాలో తొలిసారి నిమజ్జనం కార్యక్రమాన్ని వీక్షించనున్న వెంకయ్యనాయుడు. ఆయన రాక సందర్భంగా అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు. నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి హుస్సెన్‌సాగర్‌కు పెద్ద ఎత్తున గణనాథులు తరలివస్తున్నాయి. మొత్తం 200 క్రేన్లను ఏర్పాటు చేసిన అధికారులు ఒక్కో క్రేన్ వద్ద గంటకు 25 విగ్రహాలు నిమజ్జనం చేసేలా చర్యలు చేపట్టారు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్‌లో సాధారణ వాహనాలకు ప్రవేశం లేదని పోలీసులు తెలిపారు. నిమజ్జన రూట్లలో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. -
‘మహా’భక్త సందోహం..
-
సప్తముఖుడి దర్శనం..సర్పదోష నివారణం
-
గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణనాధుడు
-
ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్న ఉప రాష్ట్రపతి
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతిని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది ఖైరతాబాద్ గణేశుడిని దర్శనం చేసుకుంటానని చెప్పారు. ఖైరతాబాద్ గణేశుడి దర్శనం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. దేశం అన్ని రంగాల్లో ముందుండాలని వేడుకున్నానని చెప్పారు. ఆయన వెంట మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, తదితరులు ఉన్నారు. ఉప రాష్ట్రపతి పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. -
మహాగణపతి నిమజ్జన యాత్రా ఇలా..
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తైతే.. వినాయక నిమజ్జనం పూర్తైందని పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకునే వారు. కానీ ఈ సారి మహాగణపతి నిమజ్జనం ముందే చేయాలని పోలీసులతో పాటు.. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు నిర్ణయించారు. 15వ తేదీ సాయంత్రం 3గంటల్లోపు మహాగణపతి నిమజ్జనం పూర్తిచేయాలని రంగం సిద్ధం చేస్తున్నారు. 58 అడుగుల ఎత్తులో శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి భక్తులకు ఈ సంవత్సరం విశేషంగా ఆకట్టుకున్నాడు. ఇరువైపులా రెండు శక్తిపీఠాలతో మహాగణపతిని భక్తులు దర్శించుకున్నారు. గంగాయానం ఇలా.. 13వ తేదీ ఉదయం నుంచే పని ప్రారంభించిన షెడ్డు టీం 25 మంది సుధాకర్ నేతృత్వంలో 14 సాయంత్రం వరకు మహాగణపతి షెడ్డును తొలగించింది. మహాగణపతిని నిమజ్జనానికి తరలించే ఎస్టీసీ ట్రాన్‌సపోర్ట్‌కు చెందిన ట్రయిలర్ వాహనానికి పీడబ్ల్యూ వర్క్‌షాప్ పిట్టర్ టెక్నీషియన్ బి.మహేష్ ఆధ్వర్యంలో పది మంది వెల్డింగ్ పనులు పూర్తిచేశారు. సాయంత్రం వినాయక విగ్రహానికి వెల్డింగ్ పనులు నిర్వహించేందుకు రంగం సిద్దం చేశారు. రథసారధి ఎం. వెంకటరెడ్డి.. ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి తరలించేందుకు ఎస్టిసి కంపెనీలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎం.వెంకట్‌రెడ్డి డ్రైవర్‌గా విధులు నిర్వహించనున్నారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన వెంకట్‌రెడ్డి ఈ సారిగా మహాగణపతి రథసారధిగా గణనాథుణ్ణి నిమజ్జనానికి తరలించనున్నాడు. ట్రయిలర్ వాహనం... తొమ్మిదేళ్లుగా మహాగణపతి నిమజ్జనానికి తరలించేందుకు ఉపయోగించే ట్రయిలర్ వాహనానికి (ఎపి16 టిడి 4059) 49 టన్నుల బరువు మోసే సామర్థం ఉంది. 26 టైర్లు, 70 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు ఉండే వాహనం దాదాపు 40 టన్నుల బరువున్న మహాగణపతిని నిమజ్జనానికి తరలించనుంది. మహాగణపతి ఇరువైపులా ఉన్న కుడివైపు కలియుగ వేంకటేశ్వరుడు, ఎడమవైపు ఉన్న ‘‘శ్రీ భాలాజీ బృందావన సహిత గోవర్థనగిరి’’ విగ్రహాలను నిమజ్జనానికి శ్రీలక్మీనర్సింహ స్వామి ట్రాన్‌సపోర్ట్‌కు చెందిన బాబీ సమకూర్చే వాహనంలో నిమజ్జనానికి తరలిస్తారు. హైడ్రాలిక్ టెలిస్కోప్ హెవీ మొబైల్ క్రేన్ సామర్థం...... గత 11 సంవత్సరాలుగా ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం కోసం తరలించేందుకు రవి క్రేన్సకు చెందిన హైడ్రాలిక్ టెలిస్కోప్ హెవీ మొబైల్ క్రేన్‌ను ఇస్తున్నట్లు ఎం.డి. కె.వి. రావు తెలిపారు. ఈ జర్మనీలో తయారైన క్రేన్ బరువు 110 టన్నులు, 150 టన్నుల బరువును అవలీలగా పైకి ఎత్తగలదు. క్రేన్ జాక్ 50 మీటర్ల పైకి వెళ్తుంది. వెడల్పు 11 పీట్లు, పొడవు 60 పీట్లు ఉంటుంది. దీనికి 12 టైర్లు ఉంటాయి. ఒక్కో టైరు ఒక టన్ను బరువు 2 మీటర్ల ఎత్తు ఉంటుంది. దీనికి 4 హై6డాలిక్ జాక్‌లు ఉంటాయి. 45 టన్నుల బరువున్న ఖైరతాబాద్ వినాయకుడిని క్రేన్ సునాయాసంగా తరలించగలదు. ఈ క్రేన్‌ను మహ్మద్ జమీల్ అపరేట్ చేస్తాడు. బారీ క్రేన్ ఆపరేటర్ మహ్మద్ జమీల్...... రవి క్రేన్‌స ఆధ్వర్యంలో ప్రతీ సంవ్సరం మహాగణపతిని ట్రయిలర్ వాహనంపైకి పెట్టడం, తిరిగి నిమజ్జనం చేయడం అంతా మహ్మద్ జమీల్ నిర్వహిస్తాడు. వేల మంది భక్తులు చూస్తుండగా మహాగణపతిని క్రేన్ సాయంతో గాల్లోకి ఎత్తి.. వాహనంపై ఆసీనుడయ్యే లా చేయడం నాకు సంతోషాన్ని ఇస్తుంది అంటారు జమీల్. నిమజ్జన ఏర్పాట్లు.... 14వ తేది అర్థరాత్రి 12గంటలకు సింగరి సుదర్శన్ కుటుంబ సభ్యులు కలశం పూజ నిర్వహిస్తారు. ఆ తరువాత 1గంట నుంచి తెల్లవారు జామున 5గంటల వరకు మహాగణపతికి వెల్డింగ్ పనులు, బారీ క్రేన్‌కు మహాగణపతిని అమర్చడం, వాహనంపై పెట్టి మరలా వెల్డింగ్ పనులు చేస్తారు. 5-6 గంటల మధ్య వాహనానికి అలంకరణ చేసి 15వ తేది ఉదయం 6గంటల కల్లా మహాగణపతి నిమజ్జనానికి సిద్దంగా ఉండేలా చూస్తామని ఉత్సవ కమిటి సభ్యులు సందీప్ తెలిపారు. ఉదయం 6గంటల నుంచి శోభాయాత్ర ప్రారంభమై 9గంటల కల్లా ఎన్టీఆర్ మార్గ్‌లోని 4వ నెంబర్ క్రేన్ వరకు చేరుకుంటుంది. 9-12 గంటల వరకు క్రేన్ సెట్టింగ్, వెల్డింగ్ కట్ చేయడం పనులు పూర్తచేసుకున్న తరువాత మరో గంట సేపు పూజా, సన్మాన కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 2-3 గంటల మధ్య (సూర్యాస్తమయం లోపు) మహాగణపతిని నిమజ్జనం చేస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. మహాగణపతి రూట్ మ్యాప్..... ఖైరతాబాద్ మంటపం నుంచి సెన్షేషన్ థీయేటర్ మీదుగా రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, హోంసైస్స్ కళాశాల మీదుగా ఇక్బాల్ మినార్ చౌరస్తా, సచివాలయం పాతగేటు అక్కడి నుంచి తెలుగుతల్లి చౌరస్తా వరకు రాగానే అక్కడ ఎడమ వైపుకు మలుపు తిరిగి లుంబినీ పార్క్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌లోని 4వ నెంబర్ క్రేన్ వరకు చేరుకుంటుంది. మహాగణపతికి భారీ బందోబస్తు...... నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డీసీపీ కమలాసన్‌రెడ్డి నేతృత్వంలో ఖైరతాబాద్ మహాగణపతికి బారీబందోబస్తు ఏర్పాటుచేశారు. 10రోజుల పాటు 200 మంది పోలీసులతో పాటు ముగ్గురు ఏసీపీలు, 6మంది ఇన్సస్పెక్టర్లు, 12మంది ఎస్ఐలు విధులు నిర్వహించారు. నిమజ్జనం రోజు అదనంగా మరో 200 మంది పోలీసులు విధుల్లో పాల్గొంటారని సైఫాబాద్ ఇన్స్పెక్టర్ పూర్ణచందర్ తెలిపారు. -
ఖైరతాబాద్ గణేశుని చూడాలని పారిపోయారు
-
ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి పెరిగిన రద్దీ
-
ఖైరతాబాద్ గణేషుడికి కృష్ణా జలాలు
ఖైరతాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఈ-కామర్స్ సంస్థ యాడ్రోబ్ డాట్ ఇన్ ఖైరతాబాద్ గణేషుడికి 108 లీటర్ల కృష్ణా పుష్కర జలాలను కానుకగా అందజేసింది. గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు ఈ జలాలను అందజేసిన అనంతరం యాడ్రోబ్ వ్యవస్థాపకుడు రాజిరెడ్డి కేశిరెడ్డి మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ పవిత్ర జలాలను స్వామివారి పూజా నిర్వహణలో ఉపయోగించాలని కోరినట్లు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా బీచుపల్లి ఘాట్ నుంచి ఈ జలాలను తమ సంస్థ సమీకరించిందని, రివర్స్ ఆస్మోసిస్ టెక్నాలజీని ఉపయోగించి శుద్ధి చేసి ఈ నీరు పూజకు మాత్రమే కాకుండా తాగడానికి కూడా ఉపయోగించుకోవచ్చునన్నారు. -
పూజలకు ఖైరతాబాద్ గణేష్ సిద్దం
-
ఖైరతాబాద్‌కు తరలిన తాపేశ్వరం లడ్డూ
హైదరాబాద్ : ఖైరతాబాద్ గణనాథుని కోసం తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం గ్రామానికి చెందిన సురుచి ఫుడ్స్ తయారు చేసిన లడ్డూను ప్రత్యేక వాహనంలో ఆదివారం తరలించారు. ఆరేళ్లుగా వస్తున్న ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా స్వామివారికి సురుచి సంస్థ లడ్డూను కానుకగా సమర్పించింది. ఖైరతాబాద్ గణేశ ఉత్సవ కమిటీ నిర్ణయం మేరకు ఈ ఏడాది 500 కిలోల లడ్డూను సిద్ధం చేశారు. సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబుతోపాటు 19 మంది సిబ్బంది గణపతి మాలధారణ చేసి ఈ లడ్డూ తయారు చేశారు. కాజూ పేస్టును ఉపయోగించి లడ్డూ పైభాగాన్ని దేవతామూర్తుల రూపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మల్లిబాబు, భారతి దంపతులు ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం క్రేన్‌తో లడ్డూను అత్యంత జాగ్రత్తగా ప్రత్యేక వాహనంలోకి చేర్చారు. వేదమంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాలు, బాణసంచా కాల్పుల నడుమ గ్రామంలో అత్యంత కోలాహలంగా ఈ లడ్డూను ఊరేగించారు. లడ్డూ తరలింపును తిలకించేందుకు స్థానికులు, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నేడు గాజువాకకు మహాలడ్డూ తరలింపు విశాఖ జిల్లా గాజువాకలో ప్రతిష్ఠించనున్న మహాగణపతికి సురుచి ఫుడ్స్ కానుకగా అందజేస్తున్న మహాలడ్డూను సోమవారం ఉదయం తరలించనున్నారు. 12.50 టన్నుల బరువుతో రూపొందించనున్న ఈ మహాలడ్డూ తయారీలో ఆదివారం ఉదయం నుంచి సిబ్బంది నిమగ్నమయ్యారు. తుది మెరుగుల అనంతరం ప్రత్యేక వాహనంలో గాజువాక తరలించనున్నట్టు మల్లిబాబు తెలిపారు. -
ఈ ఏడు గణేషుడు ఇలా..
హైదరాబాద్ : దక్షిణ భారతదేశంలో అతిపెద్ద వినాయకుడిగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ గణేషుడు వినాయక చవతికి సిద్ధమవుతున్నాడు. ఈ సారి 'శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి' గా పార్వతీ పుత్రుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. దీనికి సంబంధించిన చిత్రాన్ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు శనివారం విడుదల చేశారు. గణపతి విగ్రహానికి కుడిచేతి వైపు తిరుమల వేంకటేశ్వరస్వామి, ఎడమచేయి వైపు గోవర్ధన గిరిధారియైన శ్రీకృష్ణుడి విగ్రాహాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 58 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని నిర్మించనున్నట్లు విగ్రహ కమిటీ తెలిపింది. -
ఖైరతాబాద్ గణేశుడికి మల్లిబాబు లడ్డూ లేనట్లే!
వినాయక చవితి వస్తోందంటే చాలు.. జంటనగరాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకుంటారు. 58 అడుగుల ఎత్తుండే భారీ వినాయకుడి చేతిలో 6 టన్నుల వరకు బరువుండే అతిపెద్ద లడ్డూను చూసి మురిసిపోతారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం తాపేశ్వరం గ్రామానికి చెందిన మల్లిబాబు తయారుచేసే ఈ లడ్డూ.. ఇక మీదట ఖైరతాబాద్ గణేశుడికి రాబోదట. గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు ఈసారి స్థానికంగానే ఈ లడ్డూను తయారుచేయించాలని భావిస్తున్నట్లు సమాచారం. గత ఐదేళ్లుగా పీవీవీఎస్ మల్లికార్జున రావు (మల్లిబాబు) ఈ లడ్డూను తయారుచేసి, ఖైరతాబాద్ గణేశుడికి ఉచితంగా పంపుతున్నాడు. వేలాది మంది భక్తులు వచ్చి ఈ లడ్డూ ప్రసాదాన్ని తీసుకుంటారు. నిమజ్జనం రోజున నిర్వాహకులు దీన్ని పంచుతారు. గత సంవత్సరం మల్లిబాబు 6000 కిలోల (6 టన్నుల) లడ్డూ పంపారు. ఉత్సవ కమిటీ వాళ్లు వచ్చిన భక్తులను నియంత్రించలేకపోవడంతో ఎవరికి తోచినంత వాళ్లు పట్టుకుపోయారు. ఈసారి మల్లిబాబు నుంచి లడ్డూ తీసుకోవడం లేదని, దానికి బదులు ఇక్కడే చేయిస్తామని, అలాగే లడ్డూ బరువును కూడా 5 టన్నులే ఉంచాలని నిర్ణయించామని కమిటీ వ్యవస్థాపక సభ్యుడు సుదర్శన్ తెలిపారు. నగరం నుంచి గానీ, తెలంగాణ జిల్లాల నుంచి గానీ ఎవరైనా లడ్డూ స్పాన్సర్ చేస్తామంటే పరిశీలిస్తామని, తుది నిర్ణయం మాత్రం కమిటీయే తీసుకుంటుందని ఆయన అన్నారు. 2010లో మల్లిబాబు తొలిసారి 500 కిలోల లడ్డూ ఇచ్చారు. ప్రతియేటా బరువు పెంచుతున్నారు. 2011లో దాన్ని 2,400 కిలోలకు, 2015లో 6,000 కిలోలకు పెంచారు. 2013లో 5,000 కిలోల లడ్డూ ఇచ్చినా, భారీ వర్షం తర్వాత దాని మీద టార్పాలిన్ కప్పడంతో అది పాడైపోయింది. దాంతో లడ్డూను కూడా హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జన చేసేశారు. ఈ భారీ లడ్డూ తయారీకి మల్లిబాబుకు రూ. 18 లక్షలు ఖర్చవుతుంది. కమిటీ నిర్ణయం తనకు శరాఘాతంలా తగిలిందని మల్లిబాబు అన్నారు. ఇప్పటివరకు తనకు మాత్రం ఏమీ చెప్పలేదని, తనకు మాత్రం ఖైరతాబాద్ లడ్డూతో చాలా అనుబంధం ఉందని చెప్పారు. గణేశుడి ఆశీస్సులతో తన వ్యాపారం ప్రతియేటా రెట్టింపు అవుతోందని, ఇప్పుడు తనకు తూర్పుగోదావరి జిల్లాలో 200కు పైగా స్వీటు షాపులు ఉన్నాయని తెలిపారు. ఈసారి అమరావతి ప్రాంతంలో పెట్టే వినాయకుడికి భారీ లడ్డూ అందించే విషయమై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును సంప్రదిస్తానని అన్నారు. -
ఖైరతాబాద్ గణేష్ విగ్రహ ఏర్పాటుకు పనులు ప్రారంభం
హైదరాబాద్ : ఖైరతాబాద్ గణేష్ విగ్రహ ఏర్పాటుకు గురువారం పనులు ప్రారంభించారు. కర్ర పూజతో విగ్రహ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. అరవయ్యేళ్ల కింద ఒక అడుగుతో మొదలైన ఖైరతాబాద్ గణేశ విగ్రహ ప్రస్థానం.. 60 అడుగుల వరకూ వెళ్లి, గత ఏడాది నుంచి ఒక్కో అడుగు తగ్గించుకొస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు 59 అడుగుల ఎత్తుతో కొలువుదీరాడు. అయితే ఈసారి ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం ఎత్తు తగ్గించాలని, 20 అడుగులకు మించి ఎత్తు ఉండకూడదని ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. విగ్రహం ఎత్తు 15 అడుగులు మించకూడదని హైకోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. చివరిగా పోలీసులు ఈసారికి 17 అడుగుల విగ్రహం తయారు చేసుకోవచ్చంటూ ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీకి అనుమతి ఇచ్చారు. అయితే ఖైరతాబాద్ భారీ గణపతి ఎత్తుపై ఆంక్షలను అంగీకరించే ప్రసక్తే లేదని అన్ని రాజకీయ పార్టీలు, గణేశ కమిటీ కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో తర్జన భర్జనల అనంతరం ఈసారి గత ఏడాది కంటే ఒక్క అడుగు తగ్గించి 58 అడుగుల గణేశ్ విగ్రహాన్ని కొలువుదీరుస్తున్నామని గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది. గురువారం సాయంత్రం కర్ర పూజా కార్యక్రమంతో ఉత్సవ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. -
లడ్డూ కోసం వస్తే.. లాఠీ దెబ్బలు!
- ఖైరతాబాద్ గణపతి ప్రసాదం కోసం 30 వేల మంది రాక - సరిపడా ఏర్పాట్లు లేకపోవడంతో క్యూలో తొక్కిసలాట - లాఠీచార్జి చేసిన పోలీసులు.. పలువురికి గాయాలు - అదనపు బలగాల రాకతో అదుపులోకి వచ్చిన పరిస్థితి సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి లడ్డూ కోసం ఏకంగా 30 వేల మంది భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. పోలీసులు లాఠీచార్జి చేసి జనాన్ని చెదరగొట్టారు. దీంతో పలువురు గాయాలపాలయ్యారు. సకాలంలో అప్రమత్తమైన అధికారులు అదనపు బలగాలను మోహరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఉదయం 4 గంటల నుంచే క్యూ.. శుక్రవారం ఉదయం 7 గంటలకు లడ్డూ దాత, సురుచి ఫుడ్స్ నిర్వాహకుడు మల్లిబాబు లడ్డూకు పూజలు చేశారు. ఆనవాయితీ ప్రకారం ఆయనకు 50 శాతం లడ్డూ ఇచ్చేందుకు స్థానిక నాయకులు అంగీకరించలేదు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని 15 శాతం లడ్డూను లారీలో పెట్టి పంపించారు. మహా ప్రసాదం కోసం ప్రతి ఏటా 5 నుంచి 6 వేల మంది భక్తులు వస్తుంటారు. అయితే ఈసారి అనూహ్యంగా ఉదయం 4 గంటల నుంచే క్యూలైన్లు నిండిపోవడం, దాదాపు 30 వేల మంది భక్తులు రావడంతో రద్దీ పెరిగిపోయింది. పోలీసు బందోబస్తు మధ్య ఉదయం 8 గంటల నుంచి పంపిణీ మొదలైంది. ఒక్కసారిగా అన్ని వైపుల నుంచీ భక్తులు ఎగబడ్డారు. ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. స్థానిక బీజేపీ నాయకుడికి తలకు తీవ్రంగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. సెంట్రల్ జోన్ డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి స్వయంగా అక్కడకు వచ్చి అదనపు బలగాలను మోహరించారు. ప్రసాదం పంపిణీ నిలిపివేశారు. దీంతో భక్తులు తోసుకుంటూ ముందుకు రావడంతో లైబ్రరీ పక్కనున్న బారికేడ్లు కూలిపోయాయి. ఈ గందరగోళంలోనే యూనిఫాంలో ఉన్న కొందరు పోలీసులు ప్రసాదాన్ని ప్యాకెట్లలో పట్టుకుపోవడం గమనార్హం. ఆరు వాహనాల్లో లడ్డూ తరలింపు పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లడ్డూ పంపిణీకి డీసీపీ కమలాసన్‌రెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పాత్రలో మిగిలిన లడ్డూను ఆరు భాగాలుగా విడగొట్టారు. వాటిని డీసీఎం వాహనాల్లో పెట్టి పోలీసు ఎస్కార్ట్‌తో మంటపం నుంచి తరలించారు. ఈ ప్రసాదాన్ని నగరంలోని వివిధ దేవాలయాల వద్ద ఉంచి పోలీసుల సమక్షంలో స్థానికంగా పంపిణీ చేశారు. ప్రసాదం వద్ద ఎలాంటి తొక్కిసలాట, లాఠీచార్జ్ జరగలేదని, ఊహించని విధంగా భక్తులు రావడమే గందరగోళానికి కారణమైందని కమలాసన్‌రెడ్డి వివరించారు. ప్రసాదం అమ్ముకోవాల్సిన అవసరం లేదు ఖైరతాబాద్‌లో లడ్డూ కోసం గలాటా జరుగుతుండగానే తన వాటాగా వచ్చిన లడ్డూను మల్లిబాబు నగర శివార్లలో విక్రయించారంటూ పుకార్లు పుట్టాయి. దీనిపై మల్లిబాబు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘ప్రసాదంగా ఇచ్చిన లడ్డూను అమ్ముకోవాల్సిన అవసరం నాకు లేదు. నా వాటాగా వచ్చిన లడ్డూను లారీలో స్వస్థలానికి తరలిస్తున్నాం. లారీ వెంట నా బంధువు రామకృష్ణ ఉన్నారు. లడ్డూను లారీలోకి ఎక్కించడం కోసం స్థానికంగా 10 మంది కూలీలను మాట్లాడుకున్నాం. వీరిని దారి మధ్యలో దింపాల్సి ఉన్నా.. లారీ ఆపేందుకు పోలీసులు అంగీకరించలేదు. దీంతో నగర శివార్ల వరకు వారిని తీసుకెళ్లాం. శివారుల్లో లారీ దిగిన కూలీలకు నా బంధువు రూ.2 వేలు చెల్లించారు. ఈలోపు ఎస్కార్ట్ పోలీసులు, వారి వెనుక స్కోడా కారులో వచ్చి మంత్రి సోదరుడిగా చెప్పుకున్న వ్యక్తి ప్రసాదంలో చాలా భాగం కవర్లలో వేసుకున్నారు. ఇది చూసిన ఓ మీడియా ఛానల్ విషయం తెలియక తప్పుగా ప్రసారం చేసింది’ అని పేర్కొన్నారు. -
ఇదో రకం దోపిడీ!
హైదరాబాద్: లంబోదరుడి లడ్డూకు ఎంత కష్టం వచ్చింది. ఖైరతాబాద్ భారీ గణనాథుడి చేతిలో ఠీవిగా కొలువై పూజలందుకున్న లడ్డూ నేడు దోపిడీదారుల చేతుల్లో పడి చిన్నాభిన్నమైంది. సర్వం దోచుకుతింటున్న లూటీదారులు చివరకు వినాయకుడి లడ్డూను వదల్లేదు. ఖైరతాబాద్ గణేశుడి లడ్డూను భక్తులకు పంపిణీ చేయలేక నిర్వాహకులు చేతులెత్తేశారు. భారీగా తరలివచ్చిన భక్తులు ప్రసాదం కోసం ఎగబడడంతో తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు లాఠీలకు పనిచెప్పాడంతో పలువురు భక్తులు గాయపడ్డారు. చేసేదీ లేక లడ్డూ పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేశారు. తయారీదారులకే దీన్ని తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించారు. భారీ లడ్డూను లారీలో తాపేశ్వరంకు పంపారు. లడ్డూ ఉన్న లారీని హయత్ నగర్ లో ఆపేసి దోపిడీదారులు తమకు అలవాటైన విద్యను ప్రదర్శించారు. దేవుడి ప్రసాదాన్ని డబ్బులకు అమ్ముతూ సరికొత్త దోపిడీకి తెరతీశారు. వీరి లూటి వ్యవహారం మీడియా కంటపడడంతో దుండగులు జారుకున్నారు. -
లడ్డూ కాదు.. ప్రజల ప్రాణాలే ముఖ్యం
ఇక మీదట ఖైరతాబాద్ గణేశ్ లడ్డూ పంపిణీని నిలిపివేస్తామని డీసీపీ కమలాసన్ రెడ్డి ప్రకటించారు. ప్రతిసారీ ఈ ప్రసాదం పంపిణీలో తొక్కిసలాట జరిగే అవకాశం ఎక్కువగానే ఉందని ఆయన అన్నారు. తమకు ప్రజల ప్రాణాలే ముఖ్యమని తెలిపారు. ఇకపై గణేశ్ ప్రసాదం పంపిణీ జరగకుండా నిర్వాహకులతో మాట్లాడతామన్నారు. శుక్రవారం నాడు గణేశ్ లడ్డూ ప్రసాదం పంపిణీ సందర్భంగా తీవ్ర తొక్కిసలాట జరిగి, లాఠీ చార్జీ చేయాల్సి రావడం.. దాంతో ఒక భక్తుడికి తల కూడా పగలడం లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
ఖైరతాబాద్ లో భక్తులపై లాఠీచార్జి
-
ఖైరతాబాద్ లో భక్తులపై లాఠీచార్జి
హైదరాబాద్: ఖైరతాబాద్ వినాయకుడి లడ్డూ ప్రసాదం కోసం భక్తులు ఎగబడడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ప్రసాదం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నగరంలోని వారే కాకుండా జిల్లాల నుంచి భక్తులు రావడంతో శుక్రవారం ఉదయం ఖైరతాబాద్ కిక్కిరిసింది. ఈ తెల్లావారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో వారంతా ఇబ్బంది పడాల్సి వచ్చింది. కొంత మంది తమకు తెలిసిన వారికే ప్రసాదం పంచిపెట్టారు. దీంతో వరుసలో నించున్న భక్తులు అసహనం వ్యక్తం చేశారు. ప్రసాదం తమకు దక్కదేమోనన్న ఆందోళనతో భక్తులు ముందుకు తోసుకువచ్చారు. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి పరిస్థితి అదుపుచేసే ప్రయత్నం చేశారు. ఒక భక్తుడి తలకు తీవ్ర గాయమయినట్టు తెలుస్తోంది. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కొంతసేపు ప్రసాదం పంపిణీ నిలిచిపోయింది. సరైన ఏర్పాట్లు చేయని నిర్వాహకులపై భక్తులు మండిపడుతున్నారు. ఉదయం 11 గంటలకు ప్రసాదం పంపిణీ పూర్తయింది. -
గణేష్ వేడుకల్లో కేసీఆర్ మనవడు
-
శోభాయాత్రకు సిద్ధమైన ఖైరతాబాద్ గణేశుడు
-
మొదలైన ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం
-
మొదలైన ఖైరతాబాద్ గణపతి నిమజ్జన కార్యక్రమం
-
ఖైరతాబాద్‌కు భారీగా వస్తున్న భక్తులు
-
ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న డిక్టేటర్ మూవీ టీమ్
-
వాడ వాడలా కొలువు తీరిన గణేశుడు
-
లంబోదరుడు వినాయకచవితికి స్పెషల్ ఎట్రాక్షన్
-
ఖైరతాబాద్ వినాయకుడు ఒక అడుగుతగ్గాడు
-
తెలంగాణలోనూ తాపేశ్వరం లడ్డే!
హైదరాబాద్: ఖైరతాబాద్‌లో శ్రీకైలాస విశ్వరూప మహాగణపతి చేతిలో 11 రోజుల పాటు నిత్యం పూజలందుకున్న లడ్డు పంపిణీ కార్యక్రమం ఈ ఉదయం ప్రారంభించారు. 5 టన్నుల(5150 కిలోల) మహాప్రసాదం (లడ్డు)ను ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంకు చెందిన సురుచి ఫుడ్స్ సంస్థ కానుకగా అందజేసింది. రాష్ట్రం రెండుగా విడిపోయినా గణేశునికి ప్రసాదం ఏపి నుంచే తెప్పించారు. నిమజ్జనం అనంతరం ఈరోజు భక్తులకు లడ్డు పంపిణీ ప్రారంభించారు. లడ్దూ దాత మల్లిబాబుకు రెండు టన్నుల ప్రసాదాన్ని ఇచ్చారు. ఆయన దానిని మళ్లీ తాపేశ్వరం తీసుకు వెళ్లారు. ఏపీలో కూడా చాలా మంది ఖైరతాబాద్ లడ్డు కావాలని అడుగుతున్నారని సురచి ఫుడ్స్ యజమాని మల్లిబాబు చెప్పారు. తాపేశ్వరంలో తమ బంధువులు, కస్టమర్లు, భక్తులకు పంపిణీచేయనున్నట్లు ఆయన తెలిపారు. మిగిలిన ప్రసాదాన్ని ఉదయం 11.45 గంటల నుంచి భక్తులకు పంపిణీ చేయడం మొదలు పెట్టారు. పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరగటంతో ప్రసాదం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. మహిళలు సైతం ఉదయం నుంచే భారీగా బారులు తీరారు. పెద్ద ఎత్తున పోలీసులు భద్రత ఏర్పాటుచేశారు. లడ్డుపంపిణీలో తోపులాట చోటు చేసుకుంది. స్థానికులు, కమిటీ మెంబర్లు, పోలీసులు లడ్డును పెద్ద ఎత్తున కవర్లలో తీసుకెళుతుండటంతో క్యూ మెల్లగా కదిలింది. కొంత మంది భక్తులు పోలీసులు , కమిటీ తీరుపట్ల అభ్యంతరాలువ్యక్తంచేశారు. ఉదయం నుంచి క్యూ కట్టిన తమకు కొంచెం కొంచెంగా ఇస్తూ వారు మాత్రం సంచులు సంచులు తీసుకెళ్లారంటూ విమర్శించారు. లడ్డూ పంపిణీకి సంబంధించి ఈసారి దాదాపుగా లక్ష మంది వచ్చినట్లు కమిటీ సభ్యుల అంచనా. పోలీసులు మాత్రం ఎలాంటి అలజడి జరగకుండా సజావుగా పంపిణీ కార్యక్రమం జరిగేలా ఏర్పాట్లు చేశామంటున్నారు. ** -
ఖైరతాబాద్ గణేషు నిమజ్జనం
-
ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం పూర్తి
-
ఖైరతాబాద్ భారీ గణేషుడి నిమజ్జనం పూర్తి
హైదరాబాద్ :నగరంలో లక్షలాది మంది భక్తులచే పూజలందుకున్న ఖైరతాబాద్ భారీ వినాయకుడిని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం అయ్యాడు. మంగళవారం 8 గంటలపాటు సాగిన గణేషుడి శోభాయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రేన్‌తో వినాయకుడిని సాగర్ జలాల్లో నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశారు. అరవై వసంతాలు పూర్తి చేసుకున్నసందర్భంగా 60 కేజీల భారీ విగ్రహంతో 11 రోజుల పాటు భక్తులను అలరించిన గణనాథుడు నేటి సాయంత్రం తల్లి గంగమ్మ ఒడిలో సేద తీరాడు. గణనాధుడి నిమజ్జనాన్ని తిలకించేందుకు నగరవాసులు తరలి రావటంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఖైరతాబాద్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద ట్రాఫిక్ స్తంభించగా, సచివాలయం వెళ్లేవైపు కాసేపు రాకపోకలు ఆగిపోయాయి. పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. -
హుస్సేన్ సాగర్‌లో గణేషుడి నిమజ్జనం
-
కాసేపట్లో ఖైరతాబాద్ భారీ గణేషుడి నిమజ్జనం
హైదరాబాద్ : నగరంలో లక్షలాది మంది భక్తులచే పూజలందుకున్న ఖైరతాబాద్ భారీ వినాయకుడిని కాసేపట్లో హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు. మంగళవారం సాయంత్రం వరకు సాగిన గణేశుడి శోభాయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రైన్‌తో వినాయకుడిని సాగర్ జలాల్లో వదలనున్నారు. గణనాధుడి నిమజ్జనాన్ని తిలకించేందుకు నగరవాసులు తరలి రావటంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఖైరతాబాద్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద ట్రాఫిక్ స్తంభించగా, సచివాలయం వెళ్లేవైపు కాసేపు రాకపోకలు ఆగిపోయాయి. పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. -
తెలుగుతల్లి ఫ్లైఓవర్ కు ఖైరతాబాద్ గణేషుడు