
సాక్షి, హైదరాబాద్: ధన్వంతరీ నారాయణ మహాగణపతిగా కొలువుదీరిన ఖైరతాబాద్ గణనాథుడికి కండువ, గరక మాల, జంజెం, పట్టు వస్త్రాలను పద్మశాలి సంఘం సమర్పించింది. ఆంధప్రదేశ్‌లోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ వారు ప్రత్యేక తయారు చేసిన 100 కిలోల లడ్డూ ప్రసాదం గణపతి చేతిలో కొలువుదీరింది. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ దంపతులు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుని తొలి పూజ నిర్వహించారు. పది కిలోల వెండిని గణపతికి బహుకరించారు.
గతంలో కంటే విభిన్నంగా తొమ్మిది అడుగుల మట్టితో గణపతిని ప్రతిష్టించారు. కరోనా కారణంగా వేడుకలను నిరాడంబరంగా జరుపుతున్నారు. కోవిడ్ నిబంధనలు నేపథ్యంలో వేలాదిగా ఒకేసారి తరలివచ్చే భక్తులను కట్టడిచేసేందుకు ఆన్‌లైన్లో మాత్రమే భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. భక్తులను గుంపులుగా పోలీసులు అనుమతించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment