
లడ్డూ కాదు.. ప్రజల ప్రాణాలే ముఖ్యం
ఇక మీదట ఖైరతాబాద్ గణేశ్ లడ్డూ పంపిణీని నిలిపివేస్తామని డీసీపీ కమలాసన్ రెడ్డి ప్రకటించారు. ప్రతిసారీ ఈ ప్రసాదం పంపిణీలో తొక్కిసలాట జరిగే అవకాశం ఎక్కువగానే ఉందని ఆయన అన్నారు. తమకు ప్రజల ప్రాణాలే ముఖ్యమని తెలిపారు. ఇకపై గణేశ్ ప్రసాదం పంపిణీ జరగకుండా నిర్వాహకులతో మాట్లాడతామన్నారు.
శుక్రవారం నాడు గణేశ్ లడ్డూ ప్రసాదం పంపిణీ సందర్భంగా తీవ్ర తొక్కిసలాట జరిగి, లాఠీ చార్జీ చేయాల్సి రావడం.. దాంతో ఒక భక్తుడికి తల కూడా పగలడం లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.