laddu distribution
-
తిరుమల లడ్డూల కోసం పర్యావరణహిత సంచి..
తిరుమల: తిరుమల శ్రీవారిని డీఆర్డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డి, డీఆర్డీవో డైరెక్టర్ ఆఫ్ జనరల్ విక్రమసింహ ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం లడ్డూ కౌంటర్ల వద్ద ఏర్పాటు చేసిన బయో డిగ్రేడబుల్ కవర్ల (పర్యావరణ హిత సంచుల) విక్రయ కేంద్రాన్ని సతీష్‌రెడ్డి, టీటీడీ ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న, పశువులకు ప్రాణసంకటంగా మారిన ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా బయో డిగ్రేడబుల్ కవర్లను డీఆర్డీవో రూపొందించిందన్నారు. మొక్కజొన్న వ్యర్థాలతో తయారయ్యే ఈ సంచుల వల్ల పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఈ కవర్లను పశువులు తిన్నా ఎలాంటి సమస్య ఉండదన్నారు. ఇవి 90 రోజుల్లోనే పూర్తిగా భూమిలో కలసిపోతాయని చెప్పారు. -
అయోధ్య: 4 లక్షల లడ్డూలు సిద్ధం
లక్నో (ఉత్తర ప్రదేశ్): రామ మందిర నిర్మాణం కోసం జరిగే భూమి పూజ కార్యక్రమానికి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ వేడుకలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నారు. ప్రధానితోపాటు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, 50 మంది అతిథులు కూడా హాజరుకానున్నారు. అయోధ్య నిర్మాణాన్ని పర్యవేక్షించే ఆలయ పాలక మండలి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భూమి పూజ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాలకు లడ్డూలను పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు నాలుగు లక్షల ప్యాకెట్ల లడ్డూలను ఆర్డర్ ఇచ్చినట్లు ట్రస్ట్ అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు 5న జరిగే కార్యక్రమానికి మొత్తం 1,11,000 వేల లడ్డూలు సిద్ధమవుతునన్నాయని అధికారులు పేర్కొన్నారు. వీటిని రామ్ దాస్ చావ్ని అనే వ్యక్తి వద్ద తయారు చేస్తున్నట్లు తెలిపారు. (అయోధ్యలో హైఅలర్ట్) ఆగస్టు 3వ తేదీన గణేశుడి పూజతో కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు. ఆగస్టు 5వ తేదీన గర్భగుడిలో జరిగే పూజ కోసం 11 మంది పండితులు వేదమంత్రాలు చదవనున్నారు. ప్రధాని మోదీ చేత భూమిపూజ చేపట్టనున్నారు. పూజా కార్యక్రమానికి 600 మంది సాధువులను ఆహ్వానించాలని ట్రస్ట్ నిర్ణయించింది. అలాగే కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేవలం 200 మందిని మాత్రమే వేడుకకు ఆహ్వానించాలని కూడా నిర్ణయించారు. పూజ నిర్వహించనున్న రామ మందిరం పూజారి ప్రదీప్ దాస్ తాజాగా కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. పూజారికి కరోనా సోకడంతో ఏం చేయాలనే దానిపై ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. (అయోధ్య పూజారికి కరోనా) -
భక్తుల లడ్డూలు..గోవిందా
శ్రీవారి లడ్డూ ప్రసాద వితరణలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. టోకెన్లకు సరిపడా లడ్డూలు ఇవ్వకుండా కౌంటర్ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దొడ్డిదారిన సొమ్ము చేసుకుంటున్నారు. ప్రీతిపాత్రమైన లడ్డూ అందక బాధిత భక్తులు అసంతృప్తికి లోనవుతున్నారు. నిఘా సిబ్బంది చోద్యం చూస్తున్నారు. సాక్షి, తిరుమల: తిరుమల ఆలయం పక్కన లడ్డూ వితరణ కౌంటర్లు 61 ఉన్నాయి. వీటిలో శ్రీవారి సేవకులు 20 నిర్వహిస్తున్నారు. బ్యాంకుల నేతృత్వంలో ఉండే మిగిలిన కౌంటర్లలో కాంట్రాక్టు సిబ్బంది పనిచేస్తున్నారు. ఇక్కడ కౌంటర్ సిబ్బంది చేతివాటం రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో లడ్డూ కౌంటర్లను శ్రీవారి సేవకులకు అప్పగించాలని నిర్ణయించారు. తొలుత 20 కౌంటర్లు అప్పగించారు. ఈ కౌంటర్ల నిర్వహణలో ఆరోపణలు లేవు. మిగిలి కౌంటర్ల విషయంలో ఆరోపణలు తారాస్థాయిలో ఉన్నాయి. దోచుకోవడానికి సిబ్బంది వెనుకాడడం లేదు. ఎవరి పద్ధతుల్లో వారు వారు లడ్డూలను కాజేస్తున్నారు. ఇందులో కొందరు లడ్డూలను చిలక్కొట్టుడు చేస్తుంటే, మరికొందరు భక్తుల టోకెన్లకు సరిపడా ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు ఏకంగా టోకెన్లు స్కానింగ్ కావడం లేదనే నెపంతో కోత వి«ధిస్తూ దోచుకుంటున్నారు. లడ్డూ కౌంటర్లో పెరిగిన వాటాల దందా కౌంటర్ సిబ్బంది భక్తుల నుంచి రోజువారీ దోచుకున్న లడ్డూలను, టోకెన్లను మధ్యవర్తులకు అప్పగించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.. లడ్డూ కౌంటర్లో పనిచేసే కాంట్రాక్టు సి బ్బంది ఆయా బ్యాంకుల్లోని కొందరు సిబ్బందికి కూడా వాటాలు ఇస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. అందువల్లే ఆరోపణలు ఉన్న సిబ్బందినే ఆయా బ్యాంకులు తమ కౌంటర్లలో వి«ధులు కేటాయిసున్నట్లు సమాచారం.నిజాయితీగా పనిచేసే బ్యాంకు సిబ్బందిని సహచర సిబ్బంది బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న బాధిత భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి వెళ్లే భక్తుల్లో ఒకరికి నాలుగు, నడచివచ్చేవారికి ఐదు, రూ.300 టికెట్లపై నాలుగు, ఆర్జిత సేవా టికెట్లపై కేటాయింపు సంఖ్యను బట్టి లడ్డూలు ఇవ్వాల్సి ఉంది. ఇందుకు భిన్నంగా టోకెన్లకు సరిపడా లడ్డూలు ఇవ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయి. భక్తుల అవసరం, తిరుగు ప్రయాణ హడావిడి, తెలియనితనాన్ని అనుకూలంగా మార్చుకుంటూ కౌంటర్ సిబ్బంది లడ్డూలు ఇస్తుంటారు. నాలుగురోజుల ముందు కర్ణాటకకు చెందిన భక్తుడికి ఇలాగే జరిగింది. ప్రశ్నిస్తే కౌంటర్ సిబ్బంది బెదిరించారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో కౌంటర్ వదిలి పారిపోయాడు. రోజూ 3 లక్షల లడ్డూలు వితరణ చేసే కౌంటర్లలో ఇలాంటి చేతి వాటం చర్యలు జరుగుతున్నాయి. విజిలెన్స్ నిఘా, చర్యలు అంతంతమాత్రమే రోజూ ఫిర్యాదులు అందుతున్నా విజిలెన్స్ అధికారులు పట్టించుకోవడం లేదు. భక్తులు కోరినన్ని లడ్డూలు ఇవ్వడంలో టీటీడీ ఏమాత్రం చొరవ చూపడం లేదు. భక్తుడు నగదు చెల్లించిన టోకెన్లకు కూడా లడ్డూలు అందజేయడంలో టీటీడీ యంత్రాంగం విఫలమవుతోంది. లడ్డూ కౌంటర్లపై ఫిర్యాదులు వెల్లువలాఉన్నా సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. -
లడ్డూ కోసం వస్తే.. లాఠీ దెబ్బలు!
- ఖైరతాబాద్ గణపతి ప్రసాదం కోసం 30 వేల మంది రాక - సరిపడా ఏర్పాట్లు లేకపోవడంతో క్యూలో తొక్కిసలాట - లాఠీచార్జి చేసిన పోలీసులు.. పలువురికి గాయాలు - అదనపు బలగాల రాకతో అదుపులోకి వచ్చిన పరిస్థితి సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి లడ్డూ కోసం ఏకంగా 30 వేల మంది భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. పోలీసులు లాఠీచార్జి చేసి జనాన్ని చెదరగొట్టారు. దీంతో పలువురు గాయాలపాలయ్యారు. సకాలంలో అప్రమత్తమైన అధికారులు అదనపు బలగాలను మోహరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఉదయం 4 గంటల నుంచే క్యూ.. శుక్రవారం ఉదయం 7 గంటలకు లడ్డూ దాత, సురుచి ఫుడ్స్ నిర్వాహకుడు మల్లిబాబు లడ్డూకు పూజలు చేశారు. ఆనవాయితీ ప్రకారం ఆయనకు 50 శాతం లడ్డూ ఇచ్చేందుకు స్థానిక నాయకులు అంగీకరించలేదు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని 15 శాతం లడ్డూను లారీలో పెట్టి పంపించారు. మహా ప్రసాదం కోసం ప్రతి ఏటా 5 నుంచి 6 వేల మంది భక్తులు వస్తుంటారు. అయితే ఈసారి అనూహ్యంగా ఉదయం 4 గంటల నుంచే క్యూలైన్లు నిండిపోవడం, దాదాపు 30 వేల మంది భక్తులు రావడంతో రద్దీ పెరిగిపోయింది. పోలీసు బందోబస్తు మధ్య ఉదయం 8 గంటల నుంచి పంపిణీ మొదలైంది. ఒక్కసారిగా అన్ని వైపుల నుంచీ భక్తులు ఎగబడ్డారు. ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. స్థానిక బీజేపీ నాయకుడికి తలకు తీవ్రంగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. సెంట్రల్ జోన్ డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి స్వయంగా అక్కడకు వచ్చి అదనపు బలగాలను మోహరించారు. ప్రసాదం పంపిణీ నిలిపివేశారు. దీంతో భక్తులు తోసుకుంటూ ముందుకు రావడంతో లైబ్రరీ పక్కనున్న బారికేడ్లు కూలిపోయాయి. ఈ గందరగోళంలోనే యూనిఫాంలో ఉన్న కొందరు పోలీసులు ప్రసాదాన్ని ప్యాకెట్లలో పట్టుకుపోవడం గమనార్హం. ఆరు వాహనాల్లో లడ్డూ తరలింపు పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లడ్డూ పంపిణీకి డీసీపీ కమలాసన్‌రెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పాత్రలో మిగిలిన లడ్డూను ఆరు భాగాలుగా విడగొట్టారు. వాటిని డీసీఎం వాహనాల్లో పెట్టి పోలీసు ఎస్కార్ట్‌తో మంటపం నుంచి తరలించారు. ఈ ప్రసాదాన్ని నగరంలోని వివిధ దేవాలయాల వద్ద ఉంచి పోలీసుల సమక్షంలో స్థానికంగా పంపిణీ చేశారు. ప్రసాదం వద్ద ఎలాంటి తొక్కిసలాట, లాఠీచార్జ్ జరగలేదని, ఊహించని విధంగా భక్తులు రావడమే గందరగోళానికి కారణమైందని కమలాసన్‌రెడ్డి వివరించారు. ప్రసాదం అమ్ముకోవాల్సిన అవసరం లేదు ఖైరతాబాద్‌లో లడ్డూ కోసం గలాటా జరుగుతుండగానే తన వాటాగా వచ్చిన లడ్డూను మల్లిబాబు నగర శివార్లలో విక్రయించారంటూ పుకార్లు పుట్టాయి. దీనిపై మల్లిబాబు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘ప్రసాదంగా ఇచ్చిన లడ్డూను అమ్ముకోవాల్సిన అవసరం నాకు లేదు. నా వాటాగా వచ్చిన లడ్డూను లారీలో స్వస్థలానికి తరలిస్తున్నాం. లారీ వెంట నా బంధువు రామకృష్ణ ఉన్నారు. లడ్డూను లారీలోకి ఎక్కించడం కోసం స్థానికంగా 10 మంది కూలీలను మాట్లాడుకున్నాం. వీరిని దారి మధ్యలో దింపాల్సి ఉన్నా.. లారీ ఆపేందుకు పోలీసులు అంగీకరించలేదు. దీంతో నగర శివార్ల వరకు వారిని తీసుకెళ్లాం. శివారుల్లో లారీ దిగిన కూలీలకు నా బంధువు రూ.2 వేలు చెల్లించారు. ఈలోపు ఎస్కార్ట్ పోలీసులు, వారి వెనుక స్కోడా కారులో వచ్చి మంత్రి సోదరుడిగా చెప్పుకున్న వ్యక్తి ప్రసాదంలో చాలా భాగం కవర్లలో వేసుకున్నారు. ఇది చూసిన ఓ మీడియా ఛానల్ విషయం తెలియక తప్పుగా ప్రసారం చేసింది’ అని పేర్కొన్నారు. -
లడ్డూ కాదు.. ప్రజల ప్రాణాలే ముఖ్యం
ఇక మీదట ఖైరతాబాద్ గణేశ్ లడ్డూ పంపిణీని నిలిపివేస్తామని డీసీపీ కమలాసన్ రెడ్డి ప్రకటించారు. ప్రతిసారీ ఈ ప్రసాదం పంపిణీలో తొక్కిసలాట జరిగే అవకాశం ఎక్కువగానే ఉందని ఆయన అన్నారు. తమకు ప్రజల ప్రాణాలే ముఖ్యమని తెలిపారు. ఇకపై గణేశ్ ప్రసాదం పంపిణీ జరగకుండా నిర్వాహకులతో మాట్లాడతామన్నారు. శుక్రవారం నాడు గణేశ్ లడ్డూ ప్రసాదం పంపిణీ సందర్భంగా తీవ్ర తొక్కిసలాట జరిగి, లాఠీ చార్జీ చేయాల్సి రావడం.. దాంతో ఒక భక్తుడికి తల కూడా పగలడం లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
ప్రసాదం పంపిణీకి కొత్త సాప్ట్వేర్