తిరుమల: తిరుమల శ్రీవారిని డీఆర్‌డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డి, డీఆర్‌డీవో డైరెక్టర్ ఆఫ్ జనరల్ విక్రమసింహ ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం లడ్డూ కౌంటర్ల వద్ద ఏర్పాటు చేసిన బయో డిగ్రేడబుల్ కవర్ల (పర్యావరణ హిత సంచుల) విక్రయ కేంద్రాన్ని సతీష్‌రెడ్డి, టీటీడీ ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న, పశువులకు ప్రాణసంకటంగా మారిన ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా బయో డిగ్రేడబుల్ కవర్లను డీఆర్‌డీవో రూపొందించిందన్నారు. మొక్కజొన్న వ్యర్థాలతో తయారయ్యే ఈ సంచుల వల్ల పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఈ కవర్లను పశువులు తిన్నా ఎలాంటి సమస్య ఉండదన్నారు. ఇవి 90 రోజుల్లోనే పూర్తిగా భూమిలో కలసిపోతాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment