హైదరాబాద్ : ఖైరతాబాద్ గణేష్ విగ్రహ ఏర్పాటుకు గురువారం పనులు ప్రారంభించారు. కర్ర పూజతో విగ్రహ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. అరవయ్యేళ్ల కింద ఒక అడుగుతో మొదలైన ఖైరతాబాద్ గణేశ విగ్రహ ప్రస్థానం.. 60 అడుగుల వరకూ వెళ్లి, గత ఏడాది నుంచి ఒక్కో అడుగు తగ్గించుకొస్తున్న సంగతి తెలిసిందే.
గత ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు 59 అడుగుల ఎత్తుతో కొలువుదీరాడు. అయితే ఈసారి ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం ఎత్తు తగ్గించాలని, 20 అడుగులకు మించి ఎత్తు ఉండకూడదని ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. విగ్రహం ఎత్తు 15 అడుగులు మించకూడదని హైకోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. చివరిగా పోలీసులు ఈసారికి 17 అడుగుల విగ్రహం తయారు చేసుకోవచ్చంటూ ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీకి అనుమతి ఇచ్చారు.
అయితే ఖైరతాబాద్ భారీ గణపతి ఎత్తుపై ఆంక్షలను అంగీకరించే ప్రసక్తే లేదని అన్ని రాజకీయ పార్టీలు, గణేశ కమిటీ కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో తర్జన భర్జనల అనంతరం ఈసారి గత ఏడాది కంటే ఒక్క అడుగు తగ్గించి 58 అడుగుల గణేశ్ విగ్రహాన్ని కొలువుదీరుస్తున్నామని గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది. గురువారం సాయంత్రం కర్ర పూజా కార్యక్రమంతో ఉత్సవ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.
ఖైరతాబాద్ గణేష్ విగ్రహ ఏర్పాటుకు పనులు ప్రారంభం
Published Thu, Jun 16 2016 6:05 PM | Last Updated on Mon, Sep 4 2017 2:38 AM
Advertisement
Advertisement