Hyderabad Ganesh Nimajjanam 2023 Live Updates
►హుస్సేన్‌సాగర్‌లో ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం
►గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ బడా గణేష్
►మహాగణపతిని చూసేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు
►ఎన్టీఆర్ మార్గ్ చేరుకున్న ఖైరతాబాద్ బడా గణేష్
►కాసేపట్లో గంగ ఒడికి ఖైరతాబాద్ బడా గణేష్
►రెండు భారీ క్రేన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం
►క్రేన్ నెం.4 వద్ద ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం
►సచివాలయం దాటిన బడా గణేష్ శోభాయాత్ర
►హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన సందడి
►హుస్సేన్ సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు
►40వేల మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు
►మొత్తం 20,600 సీసీ కెమెరాలతో నిఘా
►హైదరాబాద్‌లో సీపీ పరిధిలో 25 వేలమందికి పైగా పోలీసులతో బందోబస్తు
►సున్నిత ప్రాంతాల్లో ఆర్పీఎఫ్, పారా మిలిటరీ భద్రత
►రాచకొండ కమిషనరేట్ పరిధిలో 6వేల మంది పోలీసులతో భద్రత
►ఎన్టీఆర్ మార్గ్‌లోకి ప్రవేశించిన భారీ గణనాథుడు
►కొత్త సచివాలయం ముందు నుంచి సాగుతున్న గణేశుడు
►కాసేపట్లో క్రేన్-4 వద్ద ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం
►గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను ఉత్సవ సమితి నిర్వాహకులు పరిశీలించారు. లక్షకు పైగా విగ్రహాలు నిమజ్జనానికి రానున్నాయని, రేపు ఉదయం వరకు నిమజ్జనం కొనసాగుతుందని ఉత్సవ సమితి తెలిపింది.
►వేలంలో బాలాపూర్ గణేష్ లడ్డూకు రికార్డు స్థాయి ధర
►వేలంలో రూ.27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
►గత రికార్డును అధిగమించిన బాలాపూర్ లడ్డూ
►రూ.27 లక్షలకు గణేష్ లడ్డూను దక్కించుకున్న దాసరి దయానందరెడ్డి
►బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట ప్రారంభం
►గతేడాది రూ.24.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
►బాలాపూర్ లడ్డూ వేలంలో పాల్గొన్న 36 మంది
►వైభవంగా కొనసాగుతున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర
►మరికాసేపట్లో సెక్రటేరియట్ వద్దకు చేరుకోనున్న ఖైరతాబాద్ గణేష్
రూ. కోటి 20 లక్షలు పలికిన గణేశ్ లడ్డూ
►బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కీర్తి రిచ్ మండ్ విల్లాలో వినాయకుడి లడ్డూ రికార్డు ధరకు పలికింది
►వేలంలో రూ. కోటి 26 లక్షలు పలికింది వినాయకుడి లడ్డూ
మాదాపూర్‌లోనూ రికార్డు ధర పలికిన లడ్డూ
►మైహోం భుజాలో రూ.25.50 లక్షలు పలికిన లడ్డూ
►లడ్డూ దక్కించుకున్న చిరంజీవి గౌడ్ అనే వ్యక్తి
►కిందటి ఏడాది రూ.18.50 లక్షలకు పోయిన లడ్డూ
►బాలాపూర్ గణేష్ శోభాయాత్ర ప్రారంభం
►ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న లడ్డూ వేలం
►వేలంలో పాల్గొననున్న 36 మంది
►బాలాపూర్ లడ్డూ వేలానికి నేటితో 30 ఏళ్లు పూర్తి
►సన్సేషన్ థియేటర్ దగ్గరకు చేరుకున్న మహాగణపతి శోభాయాత్ర
►కాస్త నెమ్మదిగా కొనసాగుతున్న ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర
►చెట్టు కొమ్మలు అడ్డురావడంతో తొలగించిన నిర్వాహకులు
►వైభవంగా కొనసాగుతున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర
►కాసేపట్లో టెలిఫోన్ భవన్‌కు చేరుకోనున్న శోభాయాత్ర
►ఉదయం 10 గంటలకు తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌కు చేరుకోనున్న శోభాయాత్ర
►మధ్యాహ్నం 12 గంటలకు ఎన్టీఆర్ మార్గ్‌క్రేన్ 4 వద్ద ఉండేలా ప్లాన్
►ఖైరతాబాద్ శోభయాత్రకు అడుగడుగునా పోలీసు భద్రత
►బ్యాండ్‌కు అనుమతి ఇవ్వని పోలీసులు
►మధ్యాహ్నం కల్లా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం
►నిమజ్జనం సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
►లారీలకు ఎల్లుండి వరకు నగరంలోకి అనుమతి నిరాకరణ
►రాత్రి ఒంటి గంట వరకు నడవనున్న మెట్రో రైళ్లు
►బాలాపూర్ గణేష్ దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఉత్సవ కమిటీ ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఉదయం 9 గంటలకు లడ్డూ వేలం ప్రారంభం కానుంది.
►గౌరమ్మ తనయుడు గురువారం గంగమ్మ ఒడికి చేరనున్నాడు. కరిముఖుని సేవలో తరించిన భక్తజనులు గణపతి నిమజ్జనానికి సిద్ధమయ్యారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది.
►ఉదయం 7 గంటలకే శోభాయాత్ర ప్రారంభమైంది. ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీసులు, వివిధ శాఖల అధికారుల సమన్వయంతో మహా నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం సజావుగా సాగేందుకు రూట్ మ్యాప్‌తో పాటు భారీ క్రేన్‌లు, వాహనాలను సిద్ధం చేశారు.
►గణేశ్ శోభాయాత్ర నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేసింది. శోభాయాత్ర పొడవునా, నిమజ్జనాలు జరిగే చెరువుల వద్ద వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు దాదాపు 3వేల మంది పారిశుద్ధ్య కార్మికులను విధుల్లో నియమించింది.
అదనంగా ఆర్టీసీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లు
భక్తుల కోసం ఆర్టీసీ వివిధ మార్గాల్లో 535 బస్సులను నడిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 8 ఎంఎంటీఎస్ రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. ఎంఎంటీఎస్‌లు బుధవారం రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం ఉదయం 4 గంటల వరకు రాకపోకలు సాగిస్తాయి. శుక్రవారం తెల్లవారుజాము 2 గంటల వరకు నగరంలోని వివిధ మార్గాల్లో మెట్రో రైళ్లు సైతం రాకపోకలు సాగిస్తాయని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
అత్యవసర వైద్య సేవలు
ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 37 వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.వెంకట్ తెలిపారు. గణేష్ నిమజ్జనం జరిగే ప్రాంతాలలో అత్యవసర పరిస్థితులలో ఉపయోగించటానికి 108 అంబులెన్సులను, బేబీ పాండ్స్ దగ్గర ప్రైవేట్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 15 ప్రైవేటు ఆసుపత్రుల
భాగస్వామ్యంతో పని చేస్తున్నామన్నారు.
జలమండలి ఆధ్వర్యంలో తాగునీటి శిబిరాలు
భక్తుల దాహార్తిని తీర్చడానికి తగిన ఏర్పాటు చేస్తున్నట్లు జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు. 122 ప్రత్యేక తాగునీటి శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా నిమజ్జనాల కోసం ఏర్పాటు చేసిన 74 బేబీ పాండ్స్ (నీటి కొలనులు) వద్ద నీటి క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 34 లక్షల వాటర్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. అవసరమైన చోట్ల డ్రమ్ముల్లోనూ మంచినీరు అందిస్తామన్నారు.
నోడల్ అధికారుల నియామకం
వినాయక నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన మంచినీటి శిబిరాల నిర్వహణ, పర్యవేక్షణ, ఇతర సమస్యలు పరిష్కారానికి నోడల్ అధికారుల్ని నియమించామని పేర్కొన్నారు. దీంతో పాటు ట్యాంక్ బండ్, ఎనీ్టఆర్ మార్గ్‌లో రెండు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment