ganesh shobha yatra
-
Hyderabad: గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణపతి
Hyderabad Ganesh Nimajjanam 2023 Live Updates ►హుస్సేన్‌సాగర్‌లో ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ►గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ బడా గణేష్ ►మహాగణపతిని చూసేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు ►ఎన్టీఆర్ మార్గ్ చేరుకున్న ఖైరతాబాద్ బడా గణేష్ ►కాసేపట్లో గంగ ఒడికి ఖైరతాబాద్ బడా గణేష్ ►రెండు భారీ క్రేన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ►క్రేన్ నెం.4 వద్ద ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ►సచివాలయం దాటిన బడా గణేష్ శోభాయాత్ర ►హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన సందడి ►హుస్సేన్ సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు ►40వేల మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు ►మొత్తం 20,600 సీసీ కెమెరాలతో నిఘా ►హైదరాబాద్‌లో సీపీ పరిధిలో 25 వేలమందికి పైగా పోలీసులతో బందోబస్తు ►సున్నిత ప్రాంతాల్లో ఆర్పీఎఫ్, పారా మిలిటరీ భద్రత ►రాచకొండ కమిషనరేట్ పరిధిలో 6వేల మంది పోలీసులతో భద్రత ►ఎన్టీఆర్ మార్గ్‌లోకి ప్రవేశించిన భారీ గణనాథుడు ►కొత్త సచివాలయం ముందు నుంచి సాగుతున్న గణేశుడు ►కాసేపట్లో క్రేన్-4 వద్ద ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ►గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను ఉత్సవ సమితి నిర్వాహకులు పరిశీలించారు. లక్షకు పైగా విగ్రహాలు నిమజ్జనానికి రానున్నాయని, రేపు ఉదయం వరకు నిమజ్జనం కొనసాగుతుందని ఉత్సవ సమితి తెలిపింది. ►వేలంలో బాలాపూర్ గణేష్ లడ్డూకు రికార్డు స్థాయి ధర ►వేలంలో రూ.27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ►గత రికార్డును అధిగమించిన బాలాపూర్ లడ్డూ ►రూ.27 లక్షలకు గణేష్ లడ్డూను దక్కించుకున్న దాసరి దయానందరెడ్డి ►బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట ప్రారంభం ►గతేడాది రూ.24.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ►బాలాపూర్ లడ్డూ వేలంలో పాల్గొన్న 36 మంది ►వైభవంగా కొనసాగుతున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ►మరికాసేపట్లో సెక్రటేరియట్ వద్దకు చేరుకోనున్న ఖైరతాబాద్ గణేష్ రూ. కోటి 20 లక్షలు పలికిన గణేశ్ లడ్డూ ►బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కీర్తి రిచ్ మండ్ విల్లాలో వినాయకుడి లడ్డూ రికార్డు ధరకు పలికింది ►వేలంలో రూ. కోటి 26 లక్షలు పలికింది వినాయకుడి లడ్డూ మాదాపూర్‌లోనూ రికార్డు ధర పలికిన లడ్డూ ►మైహోం భుజాలో రూ.25.50 లక్షలు పలికిన లడ్డూ ►లడ్డూ దక్కించుకున్న చిరంజీవి గౌడ్ అనే వ్యక్తి ►కిందటి ఏడాది రూ.18.50 లక్షలకు పోయిన లడ్డూ ►బాలాపూర్ గణేష్ శోభాయాత్ర ప్రారంభం ►ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న లడ్డూ వేలం ►వేలంలో పాల్గొననున్న 36 మంది ►బాలాపూర్ లడ్డూ వేలానికి నేటితో 30 ఏళ్లు పూర్తి ►సన్సేషన్ థియేటర్ దగ్గరకు చేరుకున్న మహాగణపతి శోభాయాత్ర ►కాస్త నెమ్మదిగా కొనసాగుతున్న ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ►చెట్టు కొమ్మలు అడ్డురావడంతో తొలగించిన నిర్వాహకులు ►వైభవంగా కొనసాగుతున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ►కాసేపట్లో టెలిఫోన్ భవన్‌కు చేరుకోనున్న శోభాయాత్ర ►ఉదయం 10 గంటలకు తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌కు చేరుకోనున్న శోభాయాత్ర ►మధ్యాహ్నం 12 గంటలకు ఎన్టీఆర్ మార్గ్క్రేన్ 4 వద్ద ఉండేలా ప్లాన్ ►ఖైరతాబాద్ శోభయాత్రకు అడుగడుగునా పోలీసు భద్రత ►బ్యాండ్‌కు అనుమతి ఇవ్వని పోలీసులు ►మధ్యాహ్నం కల్లా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ►నిమజ్జనం సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ►లారీలకు ఎల్లుండి వరకు నగరంలోకి అనుమతి నిరాకరణ ►రాత్రి ఒంటి గంట వరకు నడవనున్న మెట్రో రైళ్లు ►బాలాపూర్ గణేష్ దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఉత్సవ కమిటీ ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఉదయం 9 గంటలకు లడ్డూ వేలం ప్రారంభం కానుంది. ►గౌరమ్మ తనయుడు గురువారం గంగమ్మ ఒడికి చేరనున్నాడు. కరిముఖుని సేవలో తరించిన భక్తజనులు గణపతి నిమజ్జనానికి సిద్ధమయ్యారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. ►ఉదయం 7 గంటలకే శోభాయాత్ర ప్రారంభమైంది. ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీసులు, వివిధ శాఖల అధికారుల సమన్వయంతో మహా నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం సజావుగా సాగేందుకు రూట్ మ్యాప్‌తో పాటు భారీ క్రేన్లు, వాహనాలను సిద్ధం చేశారు. ►గణేశ్ శోభాయాత్ర నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది. శోభాయాత్ర పొడవునా, నిమజ్జనాలు జరిగే చెరువుల వద్ద వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు దాదాపు 3వేల మంది పారిశుద్ధ్య కార్మికులను విధుల్లో నియమించింది. అదనంగా ఆర్టీసీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లు భక్తుల కోసం ఆర్టీసీ వివిధ మార్గాల్లో 535 బస్సులను నడిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 8 ఎంఎంటీఎస్ రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. ఎంఎంటీఎస్‌లు బుధవారం రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం ఉదయం 4 గంటల వరకు రాకపోకలు సాగిస్తాయి. శుక్రవారం తెల్లవారుజాము 2 గంటల వరకు నగరంలోని వివిధ మార్గాల్లో మెట్రో రైళ్లు సైతం రాకపోకలు సాగిస్తాయని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అత్యవసర వైద్య సేవలు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 37 వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.వెంకట్ తెలిపారు. గణేష్ నిమజ్జనం జరిగే ప్రాంతాలలో అత్యవసర పరిస్థితులలో ఉపయోగించటానికి 108 అంబులెన్సులను, బేబీ పాండ్స్ దగ్గర ప్రైవేట్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 15 ప్రైవేటు ఆసుపత్రుల భాగస్వామ్యంతో పని చేస్తున్నామన్నారు. జలమండలి ఆధ్వర్యంలో తాగునీటి శిబిరాలు భక్తుల దాహార్తిని తీర్చడానికి తగిన ఏర్పాటు చేస్తున్నట్లు జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు. 122 ప్రత్యేక తాగునీటి శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా నిమజ్జనాల కోసం ఏర్పాటు చేసిన 74 బేబీ పాండ్స్ (నీటి కొలనులు) వద్ద నీటి క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 34 లక్షల వాటర్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. అవసరమైన చోట్ల డ్రమ్ముల్లోనూ మంచినీరు అందిస్తామన్నారు. నోడల్ అధికారుల నియామకం వినాయక నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన మంచినీటి శిబిరాల నిర్వహణ, పర్యవేక్షణ, ఇతర సమస్యలు పరిష్కారానికి నోడల్ అధికారుల్ని నియమించామని పేర్కొన్నారు. దీంతో పాటు ట్యాంక్ బండ్, ఎనీ్టఆర్ మార్గ్‌లో రెండు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. -
ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర
-
12న గణేష్ శోభాయాత్ర
సాక్షి, హైదరాబాద్: తొమ్మిది రోజుల పాటు కొలిచే గణనాథులకు ఘన వీడ్కోలు పలికేందుకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాట్లు చేస్తోంది. 12వ తేదీ ఉదయం 8 గంటలకు బాలాపూర్ వినాయకుని లడ్డూ వేలంతో శోభాయాత్ర కార్యక్రమాలు మొదలుకానున్నాయి. ఈ సంవత్సరం శోభాయాత్రకు ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ (చీఫ్) మోహన్ భాగవత్ హాజరుకానున్నారని, స్వామి ప్రజ్ఞానంద యాత్రలో పాల్గొంటారన్నారు. శుక్రవారం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి భగవంతరావు మీడియాతో మాట్లాడుతూ.. 12వ తేదీ ఉదయం 8 గంటలకు బాలాపూర్ లడ్డూ వేలం తర్వాత శోభాయాత్ర ప్రారంభం అవుతుందని.. చాంద్రాయణగుట్ట, షాలిబండ, చార్మినార్ మీదుగా సాగుతుందని తెలిపారు. యాత్రలో డీజేలు, సినిమా పాటలు, వికృత డాన్సులు చేయరాదని సూచించారు. దేశభక్తి, దైవభక్తి పెంపొందించేలా భజనలు, కీర్తనలు, హరికథలు, బుర్ర కథలు ఏర్పాటు చేయాలన్నారు. ప్లాస్టిక్ వాడరాదని, స్వచ్ఛత, శుభ్రత పాటించాలని, మండపాల వద్ద గ్రీనరీ ఉండేలా చూడాలన్నారు. సమితి ఆ«ధ్వర్యంలో ప్రతీ సంవత్సరం ఒక థీమ్ పెట్టుకుంటామని, ఈ యేడు జలియన్ వాలాబాగ్‌లో జరిగిన ఘటనను మననం చేసుకుంటూ ఊరేగింపు సాగాలన్నారు. ఊరేగింపులో గుర్తుతెలియని వ్యక్తులు ఏదైనా వదంతులు పుట్టిస్తే దాన్ని నమ్మరాదని సూచించారు. పోలీసులకు, ఉత్సవ కమిటీ సభ్యులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. యాత్రకు 40 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని అన్నారు. వినాయక్‌సాగర్‌లో మహా హారతి.. కాశీ తరహాలో వినాయక్ సాగర్ (ట్యాంక్‌బండ్)లో కూడా మహా హారతి ఇవ్వాలని తాము ప్రతిపాదించగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని రాఘవరెడ్డి చెప్పారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు పూర్తిగా సహకరిస్తున్నాయని, యాత్ర పొడువునా నీరు ఏర్పాటు చేసేందుకు వాటర్‌వర్క్స్, లైట్ల ఏర్పాటుకు విద్యుత్ సంస్థ సిద్ధమైనట్లు తెలిపారు. -
డీజేలు,డ్యాన్స్‌లు మన సంస్కృతి కాదు..
సాక్షి, హైదరాబాద్: గణేష్ మండలపాల వద్ద డీజేలు, సినిమా పాటలు, డ్యాన్స్‌లు మన సంస్కృతి కాదని..ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలని భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు పిలుపునిచ్చారు. దేశ,దైవ భక్తిని పెంపొందించేందుకు గణేష్ ఉత్సవాలు దోహదపడాలని ఆకాంక్షించారు. అనంత చతుర్దశి రోజున మాత్రమే గణేష్ నిమజ్జనం చేయాలన్నారు. ఉత్సవాల సందర్భంగా సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు.. చిన్నారుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఆరోగ్యకరమైన పోటీలు నిర్వహించాలన్నారు. మనమంతా ఒక్కటి కావాలనే సందేశం ఇవ్వడం కోసం జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని గణేష్ ఉత్సవాల్లో జ్ఞాపకం చేసుకోవాలని కోరారు. ప్లాస్టిక్ రహిత,స్వచ్ఛత,శుభ్రత గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గంగా హారతి ఇవ్వాలని నిర్ణయించడం సంతోషకరమని తెలిపారు. 10న రవీంద్రభారతీలో భజన పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు.. ఈ నెల 12న జరిగే 40వ సామూహిక గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామని భగవంతరావు తెలిపారు.8 గంటలకు లడ్డూ వేలం అనంతరం బాలాపూర్ గణేష్ శోభా యాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ నిమజ్జన కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, స్వామి ప్రజ్ఞనంద్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. -
వైభవంగా వినాయక శోభయాత్ర
-
మధ్యాహ్నానికే మహానిమజ్జనం
-
మధ్యాహ్నానికే మహానిమజ్జనం
తొలిసారిగా రికార్డు సమయంలో ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం సాక్షి, హైదరాబాద్: తొమ్మిది రోజుల పాటు వైభవోపేతంగా పూజలందుకున్న బొజ్జ గణపయ్య గంగమ్మ చెంతకు చేరారు. ఒకవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం.. మరోవైపు భక్త జనుల జయజయ ధ్వానాలు.. బ్యాండు మేళాలు.. యువత కోలాహలం మధ్య ప్రతిష్టాత్మక ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జన ప్రక్రియ తొలిసారిగా రికార్డు సమయంలో పూర్తయ్యింది. ఈసారి బడా గణేశ్ నిమజ్జన ప్రక్రియ ఆరు గంటల వ్యవధిలో పూర్తికావడం విశేషం. గురువారం ఉదయం 8.20 గంటలకు పూజాధికాలు ముగించుకుని ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జన యాత్ర మొదలైంది. ఖైరతాబాద్, లక్డీకాపూల్, రాజ్‌దూత్ చౌరస్తా మీదుగా ట్యాంక్‌బండ్‌కు చేరింది. మధ్యాహ్నం 1.45 గంటలకు క్రేన్ నంబర్ 4 వద్ద నిమజ్జనం పూర్తి చేశారు. నిమజ్జనం సందర్భంగా భారీ గణనాథుడిని చూసేందుకు వేలాదిగా భక్తజనం తరలిరావడంతో స్వల్ప తోపులాట జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. వైభవంగా శోభా యాత్ర.. భాగ్యనగరంలో గురువారం ఉదయం ప్రారంభమైన గణేశ్ నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. ఎడతెరిపి లేని వర్షంతో ఉదయం కాస్త ఆలస్యంగా నిమజ్జన ఊరేగింపులు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు వర్షం కాస్త తెరిపినివ్వడంతో నిమజ్జనాలు ఊపందుకుంది. అర్థరాత్రి వరకు ప్రశాంత వాతావరణంలో ఈ ప్రక్రియ కొనసాగింది. శుక్రవారం ఉదయం వరకు నిమజ్జన పర్వాన్ని కొనసాగించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్, దిల్సుఖ్నగర్-ట్యాంక్‌బండ్, సికింద్రాబాద్-ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్-ట్యాంక్‌బండ్, చార్మినార్-హుస్సేన్‌సాగర్, కూకట్పల్లి-లిబర్టీ, తెలుగుతల్లి ఫ్లైఓవర్, లక్డీకాపూల్, నెక్లెస్‌రోడ్ తదితర ప్రధాన మార్గాల్లో కన్నుల పండువగా సాగిన మహానిమజ్జన క్రతువులో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. సుమారు 388.5 కిలోమీటర్ల మార్గంలో శోభాయాత్ర సాగింది. శోభాయాత్ర మార్గాల్లో 12 వేల సీసీ కెమెరాలు.. 25 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హుస్సేన్‌సాగర్ వద్ద 23 భారీ క్రేన్లను ఏర్పాటు చేసి భారీ గణనాథులను గంగ ఒడికి చేర్చారు. నగరంలో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన కొలనుల్లో గురువారం అర్ధరాత్రి వరకు సుమారు 50 వేల విగ్రహాలు నిమజ్జనమైనట్లు అధికారులు లెక్కగట్టారు. స్వల్ప అపశ్రుతులు మినహా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. హోంమంత్రి, డీజీపీ, కమిషనర్ పర్యవేక్షణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి, అదనపు డీజీ అంజనీకుమార్ గురువారం సాయంత్రం ఏరియల్ వ్యూ ద్వారా శోభాయాత్ర మార్గాలను పర్యవేక్షించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్ట్టర్‌లో బయలుదేరిన వీరు నిమజ్జన ఏర్పాట్లు, పరిస్థితుల్ని పరిశీలించారు. లక్షలు పలికిన లడ్డూలు.. గణపతి లడ్డూల వేలం పాటలో ఎప్పటిలాగానే బాలాపూర్ లడ్డూ రికార్డు ధర పలికింది. మేడ్చల్నియోజకవర్గం కీసర ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త కందాడి స్కైలాబ్‌రెడ్డి రూ.14.65 లక్షలకు బాలాపూర్ లడ్డూను వేలంపాటలో దక్కించుకున్నారు. గతేడాది ఈ లడ్డూ రూ.10.32 లక్షల ధర పలికింది. -
చరిత్రలో తొలిసారిగా ఖైరతాబాద్ గణపతి..!
-
చరిత్రలో తొలిసారిగా ఖైరతాబాద్ గణపతి..!
హైదరాబాద్: భారీగా వర్షం కురుస్తున్నా.. భాగ్యనగరంలో గణేష్ శోభాయత్ర వైభవంగా జరుగుతోంది. ప్రజల ఆటపాటలు, భజన కోలాటాలతో మహా గణపతికి వీడ్కోలు పలుకుతున్నారు. నగరంలో గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రత, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో సజావుగా ఈ వేడుక కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్‌కు తరలుతున్న గణనాథులతో, ప్రజల ఆటపాటలతో నగరం సందడిగా మారిపోయింది. ఎటుచూసినా కోలాహలమే కనిపిస్తోంది. ఇక చరిత్రలో ఎప్పుడూలేనివిధంగా ముందుగానే ఖైరతాబాద్ మహగణపతిని నిమజ్జనం పూర్తయింది. అత్యంత కోలాహలం నడుమ ఖైరతాబాద్ గణేషుడు నిమజ్జనానికి బయలుదేరాగా.. భారీ క్రేన్ సాయంతో గణనాథుడిని ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం చేశారు. ఈ వేడుకను చాలామంది ప్రత్యక్షంగా తిలకించారు. గత ఏడాది వరకు అన్ని వినాయకుల నిమజ్జనం పూర్తయిన తర్వాతే ఖైరతాబాద్ మహా గణపతిని నిమజ్జనం చేసిన సంగతి తెలిసిందే. రికార్డు సమయంలో ఈసారి ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనోత్సవం ముగియడం విశేషం. ఉదయం 8 గంటలకు శోభాయాత్రగా బయలుదేరిన గణనాథుడు ఈసారి ఆరు గంటల్లోనే నిమజ్జనం పూర్తిచేసుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ భారీ వినాయకుడి నిమజ్జనం ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. సాయంత్రంలోగా గణేష్ నిమజ్జనోత్సవాన్ని పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. దాదాపు గురువారం 30వేల విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశముంది. హుస్సేన్ సాగర్ సహా నగరంలో పదిచోట్ల నిమజ్జనోత్సవాలు జరగనున్నాయి. దాదాపు 100 మార్గాల నుంచి గణనాథులు తరలివస్తున్నారు. 225 కిలోమీటర్ల మేర శోభాయాత్రల జరగనున్నట్టు భావిస్తున్నారు. శోభాయాత్ర సందర్భంగా నగరంలో 20వేల ప్రత్యేక విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జనోత్సవంపై జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ సమీక్ష నిర్వహించారు. ట్యాంక్‌బండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా 30వేలమంది పోలీసులతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. 13 కంపెనీల కేంద్ర పారామిలిటరీ బలగాలు కూడా రంగంలోకి దిగాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను మోహరించారు. ప్రతి 4 కిలోమీటర్లకు ఒక గణేష్ యాక్షన్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. -
హైదరాబాద్‌లో ఘనంగా శోభాయాత్ర