
సాక్షి, హైదరాబాద్: గణేష్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. తొలిసారి దేవాదాయశాఖ ఆధ్వర్యంలో గంగాహారతిని ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన హోం మంత్రి మహమూద్‌అలీ, మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రాంమోహన్‌లు వివిధ శాఖల అధికారులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సచివాలయంలో సమీక్షించారు.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 55 వేలకు పైగా విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తలసాని చెప్పారు. ఖైరతాబాద్ గణేశుడి వద్ద 9 రోజులు సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment