మహాగణపతికి పూజలు చేస్తున్న గవర్నర్ తమిళిసై
ఖెరతాబాద్: ఖైరతాబాద్‌లో కొలువైన 50 అడుగుల మట్టి మహాగణపతి సేవకు ప్రముఖులు క్యూ కట్టారు. పంచముఖ మహాలక్ష్మీ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం ఉదయం తొలిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ పంచముఖ మహాలక్ష్మీ గణపతి
అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పూజలు నిర్వహించారు. అన్ని శాఖల సమన్వయంతో గణేష్ ఉత్సవాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తామని ఆయన చెప్పారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జవదేకర్, డీజీపీ మహేందర్‌రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్, ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్ తదితరులు మహాగణపతిని దర్శించుకున్నారు. మహాగణపతిని తొలిరోజు 2 లక్షలమందికి పైగా భక్తుల దర్శించుకున్నట్లు అంచనా.
పోటెత్తిన భక్తులు
జంధ్యం, కండువా సమర్పణ
పంచముఖ మహా లక్ష్మీ గణపతికి పద్మశాలి సంఘం తరఫున 60 అడుగుల కండువా, గరికమాల, జంధ్యం, పట్టు వస్త్రాలను సమర్పించారు. తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జనరల్ బండా శివానంద ప్రసాద్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్, హైదరాబాద్ జిల్లా అడిషినల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, గాంధీ హాస్పిటల్ డిప్యూటీ సూపరిండెంట్ డాక్టర్ నర్సింహారావులు ఉన్నా రు. కార్యక్రమంలో ఖైరతాబాద్ పద్మశాలి సంఘం సభ్యులు శ్రీధర్, ఏలే స్వామి, గుర్రం కొండయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment