Mahaganapathi
-
పూజలు సేయ తరలివచ్చారు.. మహాగణపతి సేవలో ప్రముఖులు
ఖెరతాబాద్: ఖైరతాబాద్‌లో కొలువైన 50 అడుగుల మట్టి మహాగణపతి సేవకు ప్రముఖులు క్యూ కట్టారు. పంచముఖ మహాలక్ష్మీ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం ఉదయం తొలిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ పంచముఖ మహాలక్ష్మీ గణపతి అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పూజలు నిర్వహించారు. అన్ని శాఖల సమన్వయంతో గణేష్ ఉత్సవాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తామని ఆయన చెప్పారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జవదేకర్, డీజీపీ మహేందర్‌రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్, ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్ తదితరులు మహాగణపతిని దర్శించుకున్నారు. మహాగణపతిని తొలిరోజు 2 లక్షలమందికి పైగా భక్తుల దర్శించుకున్నట్లు అంచనా. పోటెత్తిన భక్తులు జంధ్యం, కండువా సమర్పణ పంచముఖ మహా లక్ష్మీ గణపతికి పద్మశాలి సంఘం తరఫున 60 అడుగుల కండువా, గరికమాల, జంధ్యం, పట్టు వస్త్రాలను సమర్పించారు. తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జనరల్ బండా శివానంద ప్రసాద్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్, హైదరాబాద్ జిల్లా అడిషినల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, గాంధీ హాస్పిటల్ డిప్యూటీ సూపరిండెంట్ డాక్టర్ నర్సింహారావులు ఉన్నా రు. కార్యక్రమంలో ఖైరతాబాద్ పద్మశాలి సంఘం సభ్యులు శ్రీధర్, ఏలే స్వామి, గుర్రం కొండయ్య పాల్గొన్నారు. -
మహాగణపతికి కంటిపాప అమరిక
ఖైరతాబాద్: ఖైరతాబాద్ శ్రీ పంచముఖ లక్ష్మీ మహాగణపతికి ఆదివారం ఉదయం దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠలశర్మ సూచించిన ముహూర్తంలో కంటిపాప (నేత్రోనిలనం)ను శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ అమర్చారు. 50 అడుగుల విగ్రహానికి కంటిపాపను అమర్చడం ద్వారా విగ్రహానికి ప్రాణం పోసినట్లు అవుతుందని శిల్పి తెలిపారు. విగ్రహ పనులన్నీ పూర్తికావడంతో సోమవారం సాయంత్రం వరకు కర్రలను పూర్తిగా తొలగిస్తామని, ఆ తర్వాత మహాగణపతి భక్తులకు సంపూర్ణ దర్శనం ఇస్తారని తెలిపారు. మహాగణపతి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. -
మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం
-
దేవదేవుడికి రంగులు
ఖైరతాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి తయారీ పనులు దాదాపు పూర్తయ్యాయి. రంగులు వేసే పనులకు మంగళవారం శ్రీకారం చుట్టినట్లు శిల్పి రాజేంద్రన్ తెలిపారు. కాకినాడకు చెందిన సత్య ఆర్ట్స్ భీమేశ్ ఆధ్వర్యంలో 15 మంది బృందం దేవదేవుడికి రంగులు అద్దనుంది. 300 లీటర్ల రంగులను మహాగణపతికి ఉపయోగిస్తున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ చెప్పారు. -
జూన్ 12 టూ సెప్టెంబర్ 10
మేకింగ్ ఆఫ్ మహాగణపతి 91 రోజుల ప్రతిమ ప్రస్థానం ఖైరతాబాద్: ఎన్నో ఆలోచనలు.. మరెన్నో అంచనాలు.. సిద్ధహస్తులైన శిల్పులు.. చేయి తిరిగిన కళాకారులు.. వెరసి 59 అడుగుల భారీ గణపయ్య విగ్రహం. అదే ఖైరతాబాద్ మహా గణపతి. భక్తుల కంటికి ఇంపైన రూపం. ఈ ఏడాది త్రిశక్తిమయ మోక్ష గణపతి స్వరూపం. భక్తుల అంచనాలకు అనుగుణంగా ప్రధాన శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ ఊహకు రూపమిచ్చారు. జూన్ 12న భూమి పూజతో మొదలై సెప్టెంబర్ 10 నాటికి నేత్రాలను దిద్దే స్థాయికి చేరుకుంది ఈ ప్రతిమ ప్రస్థానం. 91రోజుల పాటు ఎలా సాగిందో వివరించే స‘చిత్ర’ కథనం.. జూన్ 12: భూమిపూజ ఆ రోజు నుంచే ఉత్సవ కమిటీ ప్రతినిధులు ప్రధాన శిల్పి రాజేంద్రన్‌తో ఈ ఏడాది రూపంపై కసరత్తు ప్రారంభించారు. ఎన్నో సలహాలు, మార్పులతో గణపయ్య రూపు తయారీ మొదలైంది. కంప్యూటర్ డిజైనర్ ప్రవీణ్ సహకారంతో శిల్పి రాజేంద్రన్ రెండు రోజుల పాటు శ్రమించి తుదిరూపును తయారు చేశారు. ‘త్రిశక్తిమయమోక్ష గణపతి’గా నామకరణం చేశారు. జూలై 2: నమూనా ఆవిష్కరణ ఆదిలాబాద్‌కు చెందిన సుధాకర్ అండ్ టీం (15 మంది) షెడ్డును నిర్మించారు. 22 టన్నుల సర్వే కర్రలు, 50 బండిళ్ల తాళ్లు వినియోగించారు. జూలై 15: వెల్డింగ్ పనులు షురూ కావలికి చెందిన శేషారెడ్డి బృందం (10 మంది) వెల్డింగ్ పనుల్ని ప్రారంభించింది. 20 టన్నుల స్టీల్‌ను వినియోగించారు. జూలై 28: 4 టన్నుల బరువైన 42 అడుగుల ఎత్తయిన సెంటర్ పోల్‌ను క్రేన్ సాయంతో అమర్చారు. ఆగస్ట్ 7: ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పనులు.. చెన్నైకి చెందిన మూర్తి టీం(25 మంది), మహారాష్ట్ర సుభాష్ టీం పీఓపీ పనుల్ని ప్రారంభించాయి. ఇందుకు 34 టన్నుల పీఓపీ, 75 బండిళ్ల కొబ్బరి నార, బంకమట్టి 600 బ్యాగులు, ఫెవికాల్ 30 లీటర్లు, సబ్బులు 50, నూనె 40 లీటర్లు వినియోగించారు. సెప్టెంబర్ 2: పెయింటింగ్ పనులు ప్రారంభం కాకినాడకు చెందిన భీమేష్ టీం (20 మంది) విగ్రహానికి రంగులద్దే పనులకు శ్రీకారం చుట్టింది. 200 లీటర్ల రంగుల్ని వినియోగించారు. సెప్టెంబర్ 10: నేత్రాలను దిద్దారు 59 అడుగుల ఖైరతాబాద్ త్రిశక్తి మయ మోక్ష గణపతికి గురువారం ఉదయం 6.20 గంటలకు ప్రధాన శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ నేత్రాలను దిద్దారు. మహాగణపతి కంటిని ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు ఆయన వివరించారు. విగ్రహాన్ని ఏ వైపు నుంచి చూసినా అటువైపు మహా గణపతి చూస్తున్నట్టు ఉండడం ఈ ఏడాది ప్రత్యేకత అని రాజేంద్రన్ అన్నారు. సిద్ధాంతి గౌరీభట్ల విఠల్‌శర్మ నిర్ణయించిన ముహూర్తానికే నేత్రాల ఏర్పాటు కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు. విగ్రహ ప్రత్యేకతలివే.. 59 అడుగుల మహా గణపతి విగ్రహం కుడివైపు గజేంద్రమోక్షం ఎడమ వరంగల్ భద్రకాళి అమ్మవారు -
విశ్వరూప విజయవంతం
చంద్రకాంతులు వెదజల్లుతున్న వేళ... భక్తుల జయజయధ్వానాల మధ్య కైలాస విశ్వరూప మహాగణపతి దుర్గామాత వెంటరాగా ‘మహా’రథంపై ఆశీనుడయ్యాడు. వేల మెగావాట్ల విద్యుత్ దీప కాంతుల మధ్య జరిగిన ఈ మహత్తర ఘట్టాన్ని వీక్షించి భక్తకోటి తరించింది. ‘జై బోలో గణేశ్ మహరాజ్ కీ’ అంటూ స్తుతించింది. ఆనంద పరవశంతో నర్తించింది. వెరసి ‘ఆపరేషన్ విశ్వరూప’ విజయవంతమైంది. సోమవారం అర్ధరాత్రి సమీపిస్తున్న తరుణంలో భారీగణపయ్య గంగ ఒడికి కదిలాడిలా..! అపురూప ఘట్టాలు.. మధ్యాహ్నం 3 గంటలకు: క్రేన్ మహాగణపతి ప్రాంగణానికి చేరుకుంది. 3.20: భారీ వాహనం పొజిషన్ తీసుకుంది. 4.00: భక్తుల దర్శనం నిలిపివేశారు. 4.50: లక్ష్మీనర్శింహ స్వామి విగ్రహాన్ని కదిలించేందుకు క్రేన్ సిద్ధమైంది. 5.00: భక్తులు ఎక్కువగా ఉండడంతో వారిని మళ్లీ దర్శనానికి అనుమతించారు. 6.00: తిరుమల తిరుపతి దేవస్థానం కళాకారుల కోలాట ప్రదర్శన 6.10: క్రేన్‌కు పూజలు 7.30: లక్ష్మీ నర్శింహ స్వామి విగ్రహాన్ని పైకి లేపి మండపానికి దూరంగా పెట్టారు. 8.00: లడ్డూపై నున్న గొడుగును తొలగించారు. 8.30: లడ్డూని కిందకు దించారు. 9.50: దుర్గామాత విగ్రహాన్ని పైకిలేపి వాహనంపై ఉంచారు. 9.55: కైలాస విశ్వరూపుడి విగ్రహానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి చివరి పూజ చేశారు. 10.10: మహాగణపతిని పైకి లేపేందుకు విగ్రహం అడుగుభాగంలో వైర్లను అమర్చారు. 10.15: భారీ వినాయకుడిని వాహనంపై అమర్చేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. 10.35: కైలాస విశ్వరూపుడి విగ్రహాన్ని కొంచెం కదిలించారు. 10.55: భారీ గణనాథుడ్ని వాహనంపై అమర్చారు. 11.00: వాహనానికి వెల్డింగ్ పనులు మొదలయ్యాయి. అర్ధరాత్రి తర్వాత విశ్వరూపుడు శోభాయాత్రకి కదిలాడు. -
ఇంతింతై... మహాగణపతియై..
సిద్ధమవుతున్న ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలకు షష్టిపూర్తి వచ్చే ఏడాది నుంచి తగ్గనున్న ఎత్తు మహాగణపతి విగ్రహం బరువు: 40 టన్నులు మహా విగ్రహంతో పాటు పక్కనున్న దేవతా విగ్రహాల తయారీకి వాడే పదార్థాలు స్టీలు: 20 టన్నులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్: 40 టన్నులు గోనె సంచులు: 10 వేల మీటర్లు బంకమట్టి: 500 బ్యాగులు (ఒకటిన్నర టన్నులు) నార: 75 బండిళ్లు( రెండున్నర టన్నులు) చాక్ పౌడర్: 100 బ్యాగులు పనివారు: 150 మంది ఖైరతాబాద్ అనగానే భక్తుల మదిలో మెదిలేది ‘మహా’గణపతి రూపం. ఏటా ఒక్కో అడుగూ పెరుగుతూ భిన్నమైన ఆకృతిలో కనువిందు చేస్తూ భక్తులతో ‘జై’ కొట్టించుకుంటున్న గణనాథుడు ఇంత భారీగా దర్శనమివ్వడం ఇదే చివరిసారి. వచ్చే ఏడాది నుంచి లంబోదరుడి రూపం ఒక్కో అడుగూ తగ్గనుంది. అవును మీరు చదివింది నిజమే. ఒక్క అడుగుతో మొదలైన గజాననుడి రూపం ఆరోహణ క్రమంలో పెరిగి ప్రస్తుతం 60 అడుగులకు చేరింది. వచ్చే ఏడాది నుంచి ఒక్కో అడుగు తగ్గుతూ అవరోహణ క్రమంలో రూపు దిద్దుకోనుంది. అందుకే ఈ ఏడాది విఘ్ననాయకుడి మహారూపం తయారీలో ప్రతి విషయమూ ప్రత్యేకమే. ఆ విశేషాలు... ఖైరతాబాద్: గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని ఖైరతాబాద్‌లో ఈ ఏడాది ఏర్పాటవుతున్న 60 అడుగుల మహాగణపతి విగ్రహానికి అన్నీ విశేషాలే. తొలిసారిగా 1954లో ఖైరతాబాద్‌లో గణపతిని ఏర్పాటు చేశారు. ఈ ఏడాదికి 60 ఏళ్లు పూర్తవుతాయి. మహా గణపతి ఈ ఏడాది 60 అడుగుల ఎత్తులో కమలంపై నిల్చొని‘కైలాస విశ్వరూప మహా గణపతి’గా దర్శనమివ్వనున్నారు. షష్టిపూర్తి (60 ఏళ్లు) సందర్భంగా ప్రత్యేకంగా వినాయకుడి కుటుంబాన్ని ఒకే ఫ్రేములోకి వచ్చే విధంగా తయారు చేస్తున్నారు. తలపై మహా సర్పం నీడలో కైలాసంలో శివుడు, పార్వతి, కుమారస్వామి, అయ్యప్ప ఉంటారు. వినాయకుడి పక్కన ఒకవైపు సిద్ధి, మరోవైపు బుద్ధి విగ్రహాలను రూపొందిస్తున్నారు. 20 అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పుతో కుడివైపు లక్ష్మీ నృసింహ స్వామి, ఎడమ వైపు దుర్గామాత విగ్రహాలు ఉంటాయి. ఇప్పటి వరకు విగ్రహానికి సంబంధించిన 60 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ నెల 12వ తేదీలోగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పనులు పూర్తవుతాయి. 15 నుంచి రంగులు వేస్తారు. ఆగస్టు 29 (వినాయక చవితి)కి నాలుగు రోజుల ముందే పనులు పూర్తి కానున్నాయి. మహాగణపతి మొదటి రోజు పూజలకు రాష్ట్ర ముఖ్యమంత్రిని, గవర్నర్ దంపతులను ఆహ్వానిస్తున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు. మహిళలు ప్రత్యేకంగా వారికి బోనాలతో స్వాగతం పలుకుతారని చెప్పారు. వినాయకుని తయారు చేసేందుకు ఇప్పటి వరకు రూ.30 లక్షలు ఖర్చయిందని, మరో రూ.పది లక్షలకు పైగా ఖర్చు కానుందని వెల్లడించారు. ప్రసాదాన్ని విక్రయించే ప్రసక్తే లేదు.. ఖైరతాబాద్ మహాగణపతికి ఈ ఏడాది కూడా తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ నిర్వాహకుడు మల్లిబాబు 5 వేల కిలోల లడ్డూను సమర్పించేందుకు సిద్ధమయ్యారు. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు స్పష్టమైన హామీ ఇవ్వగానే తయారీ పనులు చేపడతానని ఆయన చెప్పారు. శిల్పి రాజేంద్రన్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ ఈ విషయమై మాట్లాడుతూ ఐదు వేల కిలోల బరువు మోసేందుకు అనుగుణంగా మహాగణపతి చేతి నిర్మాణాన్ని పూర్తి చేశామన్నారు. లడ్డూ బరువులో సగభాగం భక్తులకు పంపిణీ చేస్తామని, మిగిలిన సగభాగం ప్రసాద దాతకే ఇస్తామన్నారు. అంతేగానీ ప్రసాదాన్ని విక్రయించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.