
ఖైరతాబాద్: ఖైరతాబాద్ శ్రీ పంచముఖ లక్ష్మీ మహాగణపతికి ఆదివారం ఉదయం దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠలశర్మ సూచించిన ముహూర్తంలో కంటిపాప (నేత్రోనిలనం)ను శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ అమర్చారు. 50 అడుగుల విగ్రహానికి కంటిపాపను అమర్చడం ద్వారా విగ్రహానికి ప్రాణం పోసినట్లు అవుతుందని శిల్పి తెలిపారు.
విగ్రహ పనులన్నీ పూర్తికావడంతో సోమవారం సాయంత్రం వరకు కర్రలను పూర్తిగా తొలగిస్తామని, ఆ తర్వాత మహాగణపతి భక్తులకు సంపూర్ణ దర్శనం ఇస్తారని తెలిపారు. మహాగణపతి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment