దేవదేవుడికి రంగులు
ఖైరతాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి తయారీ పనులు దాదాపు పూర్తయ్యాయి. రంగులు వేసే పనులకు మంగళవారం శ్రీకారం చుట్టినట్లు శిల్పి రాజేంద్రన్ తెలిపారు. కాకినాడకు చెందిన సత్య ఆర్ట్స్ భీమేశ్ ఆధ్వర్యంలో 15 మంది బృందం దేవదేవుడికి రంగులు అద్దనుంది. 300 లీటర్ల రంగులను మహాగణపతికి ఉపయోగిస్తున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ చెప్పారు.