ఈసారి ఖైరతాబాద్ గణేషుడు ఇలా..  | Khairatabad Maha Ganesh 2023 Height Other Details | Sakshi
Sakshi News home page

Khairatabad Ganesh: ఈసారి ఖైరతాబాద్ మహా గణేషుడు ఇలా.. 

Published Thu, Aug 17 2023 8:31 PM | Last Updated on Fri, Aug 18 2023 11:38 AM

Khairatabad Maha Ganesh 2023 Height Other Details - Sakshi

ఒక్కో ఏడాది ఒక్కో ఎత్తుతో.. ఒక్కో ప్రత్యేక రూపంతో దర్శనమిచ్చే ఖైరతాబాద్‌ గణపతి అంటే.. తెలుగు రాష్ట్రాలకే కాదు, దేశం  ఆ మాటకొస్తే విదేశీ పర్యాటకులకు సైతం ఆసక్తే. ఇక ఈ ఏడాది ఖైరతాబాద్‌ గణేశుడి ఎత్తు, రూపం ఎలా ఉండనుందో తెలుసా?
 
69వ ఏడాది వినాయకుడ్ని నిలబెడుతోంది ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ. ఈసారి 63 అడుగుల ఎత్తుతో.. శ్రీ దశమహా విద్యాగణపతి అవతారంలో భారీ విఘ్నేషుడు ఖైరతాబాద్‌లో కొలువు దీరి ప్రజలను అలరించనున్నాడు. శ్రీపంచముఖ లక్ష్మీనారసింహస్వామి ఒకవైపు, శ్రీ వీరభద్రస్వామి మరోవైపు.. విఘ్నేషుడి మండపంలోనే సరస్వతీ దేవి, వరాహ దేవి కొలువు కానున్నారు. ఈ మేరకు మండప నమునా చిత్రాన్ని విడుదల చేసింది ఉత్సవ కమిటీ.  

ఇదిలా ఉంటే..  గతేడాది 50 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చిన ఖైరతాబాద్‌ మహా గణపతి ‘పంచముఖ మహాలక్ష్మి’ అవతారంలో దర్శనమిచ్చాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement