lord ganesh idols
-
విఘ్నేశ్వరుడి పూజలో బాలీవుడ్ స్టార్స్.. ఫోటోలు వైరల్
-
భిన్న రూపాల్లో బొజ్జ గణపయ్యలు (ఫోటోలు)
-
గణపతి రూపాన్ని మార్చకండి..అన్ని రూపాలకు మూలం గణనాధుడు
-
ఈసారి ఖైరతాబాద్ గణేషుడు ఇలా..
ఒక్కో ఏడాది ఒక్కో ఎత్తుతో.. ఒక్కో ప్రత్యేక రూపంతో దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణపతి అంటే.. తెలుగు రాష్ట్రాలకే కాదు, దేశం ఆ మాటకొస్తే విదేశీ పర్యాటకులకు సైతం ఆసక్తే. ఇక ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడి ఎత్తు, రూపం ఎలా ఉండనుందో తెలుసా? 69వ ఏడాది వినాయకుడ్ని నిలబెడుతోంది ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ. ఈసారి 63 అడుగుల ఎత్తుతో.. శ్రీ దశమహా విద్యాగణపతి అవతారంలో భారీ విఘ్నేషుడు ఖైరతాబాద్‌లో కొలువు దీరి ప్రజలను అలరించనున్నాడు. శ్రీపంచముఖ లక్ష్మీనారసింహస్వామి ఒకవైపు, శ్రీ వీరభద్రస్వామి మరోవైపు.. విఘ్నేషుడి మండపంలోనే సరస్వతీ దేవి, వరాహ దేవి కొలువు కానున్నారు. ఈ మేరకు మండప నమునా చిత్రాన్ని విడుదల చేసింది ఉత్సవ కమిటీ. ఇదిలా ఉంటే.. గతేడాది 50 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చిన ఖైరతాబాద్ మహా గణపతి ‘పంచముఖ మహాలక్ష్మి’ అవతారంలో దర్శనమిచ్చాడు. -
రాత్రికి రాత్రి దేవున్ని సృష్టించారు
కడప కార్పొరేషన్: ఆక్రమణదారులు తమ ఆటలు సాగనప్పుడు దేవున్ని ఎలా అడ్డుపెట్టుకుంటారనేందుకు ఎర్రముక్కపల్లె వైఎస్ఆర్ కాలనీలో జరిగిన సంఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో వైఎస్ఆర్ కాలనీ నుంచి ప్ర«ధాన రహదారిలోకి ఉన్న మార్గాన్ని ఆ పార్టీ నేతలు ఆక్రమించి షాపు రూము నిర్మించారు. ఈ ఆక్రమణను తొలగించాలని స్థానిక ప్రజలు అధికారులకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదు. దీనిపై అప్పట్లో ‘సాక్షి’ కథనం ప్రచురించింది. వారి వినతులపై ఇటీవల సానుకూలంగా స్పందించిన నగరపాలక టౌన్‌ప్లానింగ్ అధికారులు పోలీసుల సాయంతో జనవరి 4న ఆ ఆక్రమణలను తొలగించి వేశారు. ఆక్రమణలు తొలగిపోవడంతో రోడ్డు నిర్మించుకోవాలని స్థానికులు ఇసుక, కంకర తెచ్చి సిద్ధం చేసుకుంటున్న తరుణంలో ఆక్రమణదారులు ఆదివారం అర్థరాత్రి ఆక్రమణలు తొలగించిన ప్రాంతంలో వినాయకుని విగ్రహం ఏర్పాటు చేసి పూజలు ప్రారంభించారు. అక్కడ గుడి నిర్మించేందుకు ఏర్పాట్లు మొదలు పెట్టారు. ఈ వ్యవహారం చూసినవారంతా ఔరా...ఇదేం విడ్డూరం అంటూ ముక్కున వేలేసుకున్నారు. విగ్రహం తొలగింపు స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ అ«ధికారులు పోలీసుల ద్వారా ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి కార్పొరేషన్ కార్యాలయంలో చెట్టు కింద ఉంచారు. రోడ్డు నిర్మాణంపై ఇకపై ఎలాంటి అక్రమాలు జరక్కుండా వెంటనే నిర్మాణం చేపట్టాలనే యోచనలో స్థానిక ప్రజలు ఉన్నట్లు సమాచారం. -
వినాయకుడి విగ్రహాల ఫొటోలు పంపండి
ఆబాలగోపాలం ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ వినాయక చవితి. పండుగ నేపథ్యంలో ప్రథమ పూజితుడి ప్రతిమలు ఊరూవాడా పందిళ్లలో కొలువుతీరతాయి. లెక్కకు మిక్కిలిగా విభిన్న రూపాల్లో లంబోదరుడు కనువిందు చేస్తాడు. మీరు ప్రతిష్ఠించిన గణనాధుడి ప్రతిమ విభిన్నంగా ఉందా.. అయితే దాన్ని యావత్ ప్రపంచం వీక్షించే అవకాశాన్ని సాక్షి డాట్ కామ్ కల్పిస్తోంది. మీ ప్రాంతంలో ప్రతిష్ఠించిన గణేశుడి విగ్రహాల ఫోటోలు, వివరాలు sakshinetduty@gmail.comకు మెయిల్ చేయండి. ఈ ఫోటోలను సాక్షి డాట్ కామ్ వెబ్ సైట్ లో పోస్ట్ చేస్తాం. ప్రవాస తెలుగువారు కూడా తమ ప్రాంతంలో ప్రతిష్ఠించిన వినాయకుడి ప్రతిమల చిత్రాలు పంపించండి ప్రచురిస్తాం.