వినాయకుడి విగ్రహాల ఫొటోలు పంపండి
ఆబాలగోపాలం ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ వినాయక చవితి. పండుగ నేపథ్యంలో ప్రథమ పూజితుడి ప్రతిమలు ఊరూవాడా పందిళ్లలో కొలువుతీరతాయి. లెక్కకు మిక్కిలిగా విభిన్న రూపాల్లో లంబోదరుడు కనువిందు చేస్తాడు. మీరు ప్రతిష్ఠించిన గణనాధుడి ప్రతిమ విభిన్నంగా ఉందా.. అయితే దాన్ని యావత్ ప్రపంచం వీక్షించే అవకాశాన్ని సాక్షి డాట్ కామ్ కల్పిస్తోంది.
మీ ప్రాంతంలో ప్రతిష్ఠించిన గణేశుడి విగ్రహాల ఫోటోలు, వివరాలు sakshinetduty@gmail.comకు మెయిల్ చేయండి. ఈ ఫోటోలను సాక్షి డాట్ కామ్ వెబ్ సైట్ లో పోస్ట్ చేస్తాం. ప్రవాస తెలుగువారు కూడా తమ ప్రాంతంలో ప్రతిష్ఠించిన వినాయకుడి ప్రతిమల చిత్రాలు పంపించండి ప్రచురిస్తాం.