ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్న ఉప రాష్ట్రపతి
Published Mon, Sep 4 2017 12:17 PM | Last Updated on Tue, Sep 12 2017 1:51 AM
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతిని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది ఖైరతాబాద్ గణేశుడిని దర్శనం చేసుకుంటానని చెప్పారు. ఖైరతాబాద్ గణేశుడి దర్శనం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. దేశం అన్ని రంగాల్లో ముందుండాలని వేడుకున్నానని చెప్పారు. ఆయన వెంట మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, తదితరులు ఉన్నారు. ఉప రాష్ట్రపతి పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
Advertisement
Advertisement