
ఖైరతాబాద్: శ్రీపంచముఖ రుద్ర మహాగణపతిగా ఈ సంవత్సరం రూపుదిద్దుకున్న ఖైరతాబాద్ మహాగణపతి తొలిపూజా కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు పాల్గొన్నారు. తొలిపూజ అనంతరం గవర్నర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, మహాగణపతి ఆశీర్వాదంతో తెలు గు రాష్ట్రాలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని కోరుకున్నట్లు తెలిపారు. పూజా కార్యక్రమంలో మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డిలు పాల్గొన్నారు.
విఘ్నాధిపతికి 60 అడుగుల కండువా
మహాగణపతికి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 60 అడుగుల కండువా, గరికమాల, యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు స్వామి వారికి 25 కిలోల లడ్డూను సమర్పించారు.
మహాగణపతిని దర్శించుకున్న కిషన్‌రెడ్డి, కేటీఆర్‌లు
వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం సాయంత్రం 7.30 గంటలకు మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకొని పూజలు చేశారు
ఇవీ చదవండి:
మరో పాటతో దూసుకుపోతున్న మంగ్లీ
మహాకాయ.. అభయమీయవయా!