
ఇదో రకం దోపిడీ!
హైదరాబాద్: లంబోదరుడి లడ్డూకు ఎంత కష్టం వచ్చింది. ఖైరతాబాద్ భారీ గణనాథుడి చేతిలో ఠీవిగా కొలువై పూజలందుకున్న లడ్డూ నేడు దోపిడీదారుల చేతుల్లో పడి చిన్నాభిన్నమైంది. సర్వం దోచుకుతింటున్న లూటీదారులు చివరకు వినాయకుడి లడ్డూను వదల్లేదు.
ఖైరతాబాద్ గణేశుడి లడ్డూను భక్తులకు పంపిణీ చేయలేక నిర్వాహకులు చేతులెత్తేశారు. భారీగా తరలివచ్చిన భక్తులు ప్రసాదం కోసం ఎగబడడంతో తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు లాఠీలకు పనిచెప్పాడంతో పలువురు భక్తులు గాయపడ్డారు. చేసేదీ లేక లడ్డూ పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేశారు. తయారీదారులకే దీన్ని తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించారు.
భారీ లడ్డూను లారీలో తాపేశ్వరంకు పంపారు. లడ్డూ ఉన్న లారీని హయత్ నగర్ లో ఆపేసి దోపిడీదారులు తమకు అలవాటైన విద్యను ప్రదర్శించారు. దేవుడి ప్రసాదాన్ని డబ్బులకు అమ్ముతూ సరికొత్త దోపిడీకి తెరతీశారు. వీరి లూటి వ్యవహారం మీడియా కంటపడడంతో దుండగులు జారుకున్నారు.