తొక్కిసలాట, అగ్ని ప్రమాదంపై నివేదిక పంపాలని కేంద్ర హోం శాఖ ఆదేశం
నిగ్గు తేల్చేందుకు అడిషనల్ సెక్రటరీని పంపుతామని సమాచారం
టీటీడీ చరిత్రలో మొదటిసారిగా కేంద్రం జోక్యం..
ఏడు నెలల్లోనే పవిత్ర తిరుమలను భ్రష్టు పట్టించిన ‘పెద్దలు’
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమలలో వరుస ఘటనలను కేంద్ర హోం శాఖ తీవ్రంగా పరిగణించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఏకంగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం.. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా ఈ నెల 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందడం, పదుల సంఖ్యలో భక్తులు గాయపడటం.. ఈ ఘటన గురించి మరచిపోక ముందే 13న లడ్డూ కౌంటర్‌లో అగ్ని ప్రమాదం జరగడంపై కేంద్రం దృష్టి సారించింది.
తొక్కిసలాట, అగ్ని ప్రమాదంపై టీటీడీ నుంచి నివేదిక కోరింది. వరుస పరిణామాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో పర్యటించి, వాస్తవాలు తెలుసుకోవాలని కేంద్ర హోం శాఖ అడిషనల్ సెక్రటరీ సంజీవ్ కుమార్ జిందాల్‌కు ఆదేశాలు జారీ చేసింది. సంజీవ్ కుమార్ జిందాల్ ఆదివారం తిరుమలకు వస్తారని టీటీడీ చైర్మన్‌కు లేఖ పంపింది. అయితే ఆయన పర్యటన వాయిదా పడినట్లు శనివారం రాత్రి తిరిగి సమాచారం అందించింది. టీటీడీ చరిత్రలో కేంద్రం జోక్యం చేసుకోవడం ఇదే మొదటిసారి. కాగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి టీటీడీని రాజకీయంగా వాడుకోవడంపై దృష్టి సారించింది.
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తింటాయన్న విచక్షణ మరచి, సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు శ్రీవారి ప్రసాదాల్లో జంతువుల కొవ్వు కలిసిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో టీటీడీకి ఉన్న రికార్డుకు మచ్చ తీసుకొస్తూ కనీస ఏర్పాట్లు చేయకుండానే ఈ నెల 8న తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం ఒక్కసారిగా క్యూలైన్ గేట్లు తెరిచారు. ఫలితంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన మరువక ముందే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కౌంటర్‌లో షార్ట్ సర్కూట్‌తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పదుల సంఖ్యలో కౌంటర్లు, క్యూలలో వేలాది భక్తులు ఉన్న సమయంలో ఈ ఘటన జరిగడం ఆందోళనకు గురి చేసింది. వీటన్నింటికీ తోడు లోకేశ్ మనిషి లక్ష్మణ్‌కుమార్ ‘సూడో’ అదనపు ఈఓగా చెలరేగిపోతుండటం పట్ల టీటీడీ యంత్రాంగం మండిపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment