ఖైరతాబాద్ గణేశుడిపై పూలవర్షం | flowers to pour on khairatabad ganesh, says kcr | Sakshi
Sakshi News home page

ఖైరతాబాద్ గణేశుడిపై పూలవర్షం

Published Fri, Aug 29 2014 6:41 PM | Last Updated on Sat, Sep 2 2017 12:38 PM

flowers to pour on khairatabad ganesh, says kcr

ఖైరతాబాద్లో నెలకొల్పిన 60 అడుగుల భారీ గణేశుడి విగ్రహంపై త్వరలోనే హెలికాప్టర్తో పూలవర్షం కురిపిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. అత్యధికంగా ఈసారి మాత్రమే 60 అడుగుల విగ్రహం ఏర్పాటుచేయడం, వచ్చే ఏడాది నుంచి వరుసగా ఎత్తు తగ్గుతూ వస్తుండటంతో ఈసారి పూలవర్షం కురిపించాలని ఉత్సవ కమిటీ సీఎం కేసీఆర్ను కోరింది.

శుక్రవారం సాయంత్రం కేసీఆర్ ఖైరతాబాద్లో కొలువైన శ్రీ కైలాస విశ్వరూప మహాగణపతిని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణపతి దయతో బంగారు తెలంగాణ కల సాకారం కావాలని ఆకాంక్షించారు. విఘ్ననాయకుడి కరుణా కటాక్ష వీక్షణాలతో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement