vijayaka chaviti
-
గణేష్ చతుర్థి: ఈ మూడు రోజులు సెలవులేనా? ఇవిగో వివరాలు
Ganesh Chaturthi 2023 Bank Holidays:దేశ వ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా జరుపుకునే వినాయక చవితి సందేడే వేరు. చిన్నా పెద్ద అంతా నవరాత్రులు చవితి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ. అయితే ఈ చవితి పండుగ విషయంలో సెప్టెంబర్ 18, 19 అనే సందిగ్ధత ఉంది. దీంతోప బ్యాంకుల సెలవులపై కూడా అనేక ఊహాగానాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ అందించిన వివరాల ప్రకారం ఆయా రాష్ట్రాల వారీగా చవితి సెలవులు ఏయే రోజుల్లో ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ♦ సోమవారం(సెప్టెంబర్ 18, 2023) రోజున కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకులకు సెలవు. ♦ మంగళవారం (సెప్టెంబర్ 19, 2023) గుజరాత్, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు, గోవాలో బ్యాంకులకు సెలవు ♦ బుధవారం( సెప్టెంబర్ 20, 2023): ఒడిశాతో పాటు గోవాలో గణేష్ చతుర్థికి రెండు రోజులు సెలవుల ప్రకటించారు. అంటే ఇక్కడ మంగళ, బుధవారాల్లో బ్యాంకులు పనిచేయవు. దీనికి కనుగుణంగా బ్యాంకు ఆఫీసులలో ఉండే పనులను సమయం కేటాయించుకోవాలి. అయితే బ్యాంకుల యూజర్లు గమనించాల్సిందేమంటే.. బ్యాంకులు పని చేయక పోయినా డిజిటల్ సేవలు అందుబాటులోఉంటాయి. గణేష్ చతుర్థి సందర్భంగా, రేపు అంటే సెప్టెంబరు 19, 2023న బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ ,నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ట్రేడింగ్ ఉండదు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో స్టాక్ మార్కెట్లకు ఇదొక్కటే సెలవు. -
మరో పాటతో దూసుకుపోతున్న మంగ్లీ
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ గాయని మంగ్లీ వినాయక చవితి సందర్భంగా మరో చక్కటి పాటను తన యూట్యూబ్ఛానల్లో అప్లోడ్ చేశారు. ప్రతీ పండుగకు ఒక ప్రత్యేక పాటను రిలీజ్ చేసే ఆమె తాజాగా ‘లంబోదరా’ అంటూ మరో గీతాన్ని ఆలపించి అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ఈ పాటలో మట్టి గణపతికి ప్రాధాన్యతనుగురించి చెప్పారు. అంతేకాదు ఎప్పటిలాగానే పచ్చటి ప్రకతి, పల్లె వాతావరణాన్ని హైలైట్ చేయడం విశేషం. దీంతో అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి పాటలు పాడుతూ చరిత్రలో నిలిచిపోవాలని కోరుకుంటున్నారు. (Ganesh Chaturthi 2021: మట్టి గణపతి! మహా గణపతి!!) రచయిత లక్క్ష్మణ్ ఈ గీతాన్ని రాయగా, సురేష బొబ్బులి సంగీతంలో మంగ్లి, మరికొంతమంది బాల గాయకులు ఈ గీతాన్ని ఆలపించారు. ఇప్పటికే పదకొండు లక్షలకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. -
ఖైరతాబాద్ గణేశ్ మండపం వద్ద తొక్కిసలాట
హైదరాబాద్:వినాయక నిమజ్జన శోభా యాత్ర సందర్భంగా ఖైరతాబాద్ లోని గణేశ్ మండపం వద్ద తొక్కిసలాట జరిగింది. సోమవారం ఖైరతాబాద్ లో ఉన్న భారీ లంబోదరుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఈ క్రమంలో తీవ్ర తొక్కిసలాట జరుగుతోంది. భక్తులు బారికేడ్లను దాటుకుని గణేషుడిని చూసేందుకు యత్నించటంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు తిప్పలు పడుతున్నారు. గణనాథుడికి వీడ్కోలు పలికేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దాంతో స్వామివారిని దర్శించుకున్న అనంతరం బయటకు వెళ్లేందుకు కూడా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గణేశ్ ఉత్సవ కమిటీ ఏర్పాట్లు సరిగా లేవంటూ భక్తులు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా ఖైరతాబాద్ గణనాధుడికి సాయంత్రం అయిదు గంటలకు పూలవర్షం కురిపించనున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. పూలవర్షం కురిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం పూలను సరఫరా చేస్తుందని వెల్లడించింది. హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించిన విషయం తెలిసిందే. అత్యధికంగా ఈసారి మాత్రమే 60 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం, వచ్చే ఏడాది నుంచి వరుసగా ఎత్తు తగ్గుతూ వస్తుండటంతో ఈసారి పూలవర్షం కురిపించాలని ఉత్సవ కమిటీ కేసీఆర్‌ను కోరిన విషయం తెలిసిందే. -
ఖైరతాబాద్ గణనాధుడికి సాయంత్రం పూలవర్షం
-
ఖైరతాబాద్ గణనాధుడికి సాయంత్రం పూలవర్షం
హైదరాబాద్ : ఖైదతాబాద్ గణనాధుడికి సాయంత్రం అయిదు గంటలకు పూలవర్షం కురిపించనున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. పూలవర్షం కురిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం పూలను సరఫరా చేస్తుందని వెల్లడించింది. హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించిన విషయం తెలిసిందే. అత్యధికంగా ఈసారి మాత్రమే 60 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం, వచ్చే ఏడాది నుంచి వరుసగా ఎత్తు తగ్గుతూ వస్తుండటంతో ఈసారి పూలవర్షం కురిపించాలని ఉత్సవ కమిటీ కేసీఆర్‌ను కోరిన విషయం తెలిసిందే. మరోవైపు భారీ లంబోదరుడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తులు బారికేడ్లను దాటుకుని గణేషుడిని చూసేందుకు యత్నించటంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు తిప్పలు పడుతున్నారు. గణనాథుడికి వీడ్కోలు పలికేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దాంతో స్వామివారిని దర్శించుకుని బయటకు వెళ్లేందుకు కూడా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. -
ఖైరతాబాద్ గణేశుడిపై పూలవర్షం
ఖైరతాబాద్‌లో నెలకొల్పిన 60 అడుగుల భారీ గణేశుడి విగ్రహంపై త్వరలోనే హెలికాప్టర్‌తో పూలవర్షం కురిపిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. అత్యధికంగా ఈసారి మాత్రమే 60 అడుగుల విగ్రహం ఏర్పాటుచేయడం, వచ్చే ఏడాది నుంచి వరుసగా ఎత్తు తగ్గుతూ వస్తుండటంతో ఈసారి పూలవర్షం కురిపించాలని ఉత్సవ కమిటీ సీఎం కేసీఆర్‌ను కోరింది. శుక్రవారం సాయంత్రం కేసీఆర్ ఖైరతాబాద్‌లో కొలువైన శ్రీ కైలాస విశ్వరూప మహాగణపతిని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణపతి దయతో బంగారు తెలంగాణ కల సాకారం కావాలని ఆకాంక్షించారు. విఘ్ననాయకుడి కరుణా కటాక్ష వీక్షణాలతో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.