Ganesh Chaturthi 2023 Bank Holidays:దేశ వ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా జరుపుకునే వినాయక చవితి సందేడే వేరు. చిన్నా పెద్ద అంతా నవరాత్రులు చవితి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ. అయితే ఈ చవితి పండుగ విషయంలో సెప్టెంబర్ 18, 19 అనే సందిగ్ధత ఉంది. దీంతోప బ్యాంకుల సెలవులపై కూడా అనేక ఊహాగానాలున్నాయి.
ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ అందించిన వివరాల ప్రకారం ఆయా రాష్ట్రాల వారీగా చవితి సెలవులు ఏయే రోజుల్లో ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం.
♦ సోమవారం(సెప్టెంబర్ 18, 2023) రోజున కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకులకు సెలవు.
♦ మంగళవారం (సెప్టెంబర్ 19, 2023) గుజరాత్, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు, గోవాలో బ్యాంకులకు సెలవు
♦ బుధవారం( సెప్టెంబర్ 20, 2023): ఒడిశాతో పాటు గోవాలో గణేష్ చతుర్థికి రెండు రోజులు సెలవుల ప్రకటించారు. అంటే ఇక్కడ మంగళ, బుధవారాల్లో బ్యాంకులు పనిచేయవు.
దీనికి కనుగుణంగా బ్యాంకు ఆఫీసులలో ఉండే పనులను సమయం కేటాయించుకోవాలి. అయితే బ్యాంకుల యూజర్లు గమనించాల్సిందేమంటే.. బ్యాంకులు పని చేయక పోయినా డిజిటల్ సేవలు అందుబాటులోఉంటాయి.
గణేష్ చతుర్థి సందర్భంగా, రేపు అంటే సెప్టెంబరు 19, 2023న బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ ,నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడింగ్ ఉండదు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో స్టాక్ మార్కెట్లకు ఇదొక్కటే సెలవు.
Comments
Please login to add a commentAdd a comment