Ganesh Puja
-
తప్పుడు సంకేతాలకు ఆస్కారం..!
న్యూఢిల్లీ: ‘భారత ప్రధాన న్యాయమూర్తి ఇంటికి ఒక ప్రైవేటు కార్యక్రమం కోసం ప్రధానమంత్రి వెళ్లడం తప్పుడు సంకేతాలను పంపదా? నరేంద్ర మోదీ అలా వెళ్లకుండా ఉండాల్సింది. ఆయన సలహాదారులైనా చెప్పాలిగా.. తప్పుడు సంకేతాలు వెళ్లే ఆస్కారం ఉంద’ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిల్ సిబల్ అన్నారు. వ్యవస్థలపై ప్రజల్లో చర్చకు తావిచ్చే ఇలాంటి ప్రైవేట్ వేడుకల పట్ల ప్రధానమంత్రి ఆసక్తి చూపకపోవడమే మంచిదని అన్నారు. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో బుధవారం జరిగిన గణపతి పూజలో ప్రధాని మోదీ పాల్గొనడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ప్రధాన న్యాయమూర్తిని ప్రభావితం చేసేందుకు ప్రధాని మోదీ ప్రయతి్నస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రైవేట్ కార్యక్రమాన్ని ఇలా బహిరంగపర్చడం సరైంది కాదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ గురువారం పేర్కొన్నారు. అత్యున్నత సంస్థ గురించి ప్రజల్లో రకరకాల ఊహాగానాలు చెలరేగేందుకు అవకాశం కలి్పంచకూడదని సూచించారు. సీజేఐ ఇంట్లో పూజలో మోదీ పాల్గొన్న వీడియోను సోషల్ మీడియాలో చూసి ఆశ్చర్యపోయానని సిబల్ వెల్లడించారు. గత 50 ఏళ్లుగా తాను సుప్రీంకోర్టులో పని చేస్తున్నానని, ఎంతోమంది గొప్పగొప్ప ప్రధాన న్యాయమూర్తులను చూశానని తెలిపారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్‌పై ఎంతో గౌరవం ఉందని పేర్కొన్నారు. మనం నమ్మే మతం, మన విశ్వాసాలు పూర్తిగా వ్యక్తిగతమని, అవి అందరికీ తెలియజేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఫొటోలు, వీడియోలు చిత్రీకరించి, బయటపెట్టాల్సిన అవసరం లేదని కపిల్ సిబల్ తేలి్చచెప్పారు. తాజా వివాదంపై సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ స్పందించారు. కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉందని గుర్తుచేశారు. ఈ విభజన రేఖ విషయంలో సీజేఐ రాజీ పడుతున్నట్లు కనిపిస్తోందని ఆక్షేపించారు. ఆ పిటిషన్ల విచారణ నుంచి సీజేఐ తప్పుకోవాలి: సంజయ్ రౌత్ సీజేఐ నివాసంలో ప్రధాని మోదీ గణపతి పూజ పట్ల శివసేన(ఉద్ధవ్) పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హతకు సంబంధించిన పిటిషన్లు సుప్రీంకోర్టులో ప్రస్తుతంజస్టిస్ చంద్రచూడ్ ఎదుట పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఈ పిటిషన్లపై విచారణ నుంచి జస్టిస్ చంద్రచూడ్ తప్పుకోవాలని గురువారం డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తులు రాజకీయ నాయకులను కలవడంపై ప్రజల్లో సందేహాలు తలెత్తుతున్నాయని తెలిపారు. మోదీతో జస్టిస్ చంద్రచూడ్ బంధం బయటపడిందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జస్టిస్ చంద్రచూడ్ మనకు న్యాయం చేకూర్చగలరా? అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది: సుప్రియా సూలే జస్టిస్ చంద్రచూడ్ ఇంటికి ప్రధాని మోదీ వెళ్లిన సంగతి తెలిసి తాను చాలా ఆశ్చర్యపోయానని నేషనలిస్టు కాంగ్రెస్ పారీ్ట(ఎస్పీ) వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ సుప్రియా సూలే గురువారం పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని చెప్పారు. వయసులో, అనుభవంలో ప్రధాని మోదీ, జస్టిస్ చంద్రచూడ్ తనకంటే చాలా పెద్దవారని, వారిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని వెల్లడించారు. అయితే, సీజేఐ ఇంటికి ప్రధాని వెళ్లడం గతంలో తాను ఎప్పుడూ వినలేదన్నారు. నీచ రాజకీయాలు చేయొద్దు: సంబిత్ పాత్రా సీజేఐ ఇంటికి ప్రధాని మోదీ వెళ్లడం పట్ల ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా విరుచుకుపడ్డారు. గతంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఇచి్చన విందుకు అప్పటి సీజేఐ వెళ్లినప్పుడు ఎందుకు మాట్లాడలేదని మండిపడ్డారు. అప్పట్లో అభ్యంతరం వ్యక్తంచేయని నాయకులు ఇప్పుడెందుకు స్పందిస్తున్నారో చెప్పాలని నిలదీశారు. గణపతి పూజలో మోదీ పాల్గొంటే తప్పేంటని ప్రశ్నించారు. నీచ రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్‌ను కలిస్తే ఇక్కడి రాజకీయ పారీ్టలేవీ స్పందించడం లేదని సంబిత్ పాత్రా ధ్వజమెత్తారు. -
గణపతి పూజ చేసిన బంగ్లాదేశ్ క్రికెటర్.. ఫొటోలు వైరల్
-
Vinayaka Chavithi 2024: వినాయక వ్రత కథ, కష్టాలు తొలగి, సమస్త సౌఖ్యాలు సొంతం
Vinayaka Chavithi 2924: వినాయక వ్రత కథ, కష్టాలు తొలగి, సమస్త సౌఖ్యాలు సొంతం
-
వినాయక చవితి 2024 : మహాగణపతి పూజా విధానం
వినాయక చవితి 2024 : మహాగణపతి పూజా విధానం
-
భక్తి భావంతో...
విలక్షణ నటుడు మోహన్‌బాబు వాయిస్ చాలా గంభీరంగా ఉంటుందనే విషయం తెలిసిందే. అందుకు నిదర్శనం సినిమాల్లో ఆయన చెప్పిన పవర్ఫుల్ డైలాగ్సే. అలాగే ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా మోహన్‌బాబు ఉద్వేగభరితంగా డైలాగులు చెబుతారు. ఇప్పుడు భక్తి భావంతో ఆయన చెప్పే మాటలను వినబోతున్నాం. ఈ నెల 22న వినాయక చవితి. ఈ సందర్భంగా గణేశుడి పూజా విధానంతో కూడిన ఓ ఆడియో మోహన్‌బాబు గళంతో రానుంది. వినాయక చవితి పండగకు ఒక రోజు ముందు ఈ నెల 21న ఈ ఆడియో విడుదలవుతుంది. మోహన్‌బాబు గళంలో వినాయక పూజా విధానాన్ని వింటూ పండగను జరుపుకోవడం ఆయన అభిమానులకు ఓ మంచి అనుభూతి అని చెప్పొచ్చు. -
సీఎం ఇంట్లో పూజలో పాల్గొన్న కొద్దిరోజులకే..!
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నివాసంలో గణపతి పూజలో పాల్గొన్న పరమనంద హెవలేకర్ అనే వ్యక్తి మళ్లీ వార్తల్లో నిలిచాడు. సీఎం నివాసంలో పూజల్లో పాల్గొన్న కొద్దిరోజులకే ఆయనను పోలీసులు అరెస్టు చేసి.. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. ఓ మహిళను లైంగికంగా వేధించినట్టు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటుండటం రాజకీయంగా సీఎం ఫడ్నవిస్‌ను ఇరకాటంలో నెట్టేసింది. సింధుదుర్గ్ జిల్లా మహదేవ్వాడి గ్రామానికి చెందిన హెవలేకర్ దంపతులు గత బుధవారం గణేష్ విగ్రహాంతో సచివాలయం ప్రధాన గేటు వద్దకు వచ్చి.. ఆందోళనకు దిగారు. తమను గ్రామంలో సాంఘికంగా వెలివేశారని, గణేష్ ఉత్సవాల్లో పాల్గొనకుండా అడ్డుకుంటారని ఆరోపిస్తూ.. రచ్చ చేశారు. దీంతో సీఎం ఫడవ్నిస్ తన నివాసం 'వర్ష'కు ఆ దంపతులను ఆహ్వానించి.. గణేష్ పూజలో వారితోపాటు పాల్గొన్నారు. అయితే, హెవలేకర్ పొరుగున ఉండే ఓ మహిళను లైంగికంగా వేధించాడని ఆయనపై ఆగస్టు 7, 2013న కేసు నమోదైంది. 2014లో స్థానిక కోర్టులో ఆయనపై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు అరెస్టు వారెంట్ జారీచేసింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఓ పోలీసు కేసు నమోదైన వ్యక్తిని తన ఇంట్లో పూజలకు పిలువడం సీఎంకు ఇబ్బంది కలిగించే అంశమేనంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. -
ఖైరతాబాద్ గణేశ్ మండపం వద్ద తొక్కిసలాట
హైదరాబాద్:వినాయక నిమజ్జన శోభా యాత్ర సందర్భంగా ఖైరతాబాద్ లోని గణేశ్ మండపం వద్ద తొక్కిసలాట జరిగింది. సోమవారం ఖైరతాబాద్ లో ఉన్న భారీ లంబోదరుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఈ క్రమంలో తీవ్ర తొక్కిసలాట జరుగుతోంది. భక్తులు బారికేడ్లను దాటుకుని గణేషుడిని చూసేందుకు యత్నించటంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు తిప్పలు పడుతున్నారు. గణనాథుడికి వీడ్కోలు పలికేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దాంతో స్వామివారిని దర్శించుకున్న అనంతరం బయటకు వెళ్లేందుకు కూడా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గణేశ్ ఉత్సవ కమిటీ ఏర్పాట్లు సరిగా లేవంటూ భక్తులు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా ఖైరతాబాద్ గణనాధుడికి సాయంత్రం అయిదు గంటలకు పూలవర్షం కురిపించనున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. పూలవర్షం కురిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం పూలను సరఫరా చేస్తుందని వెల్లడించింది. హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించిన విషయం తెలిసిందే. అత్యధికంగా ఈసారి మాత్రమే 60 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం, వచ్చే ఏడాది నుంచి వరుసగా ఎత్తు తగ్గుతూ వస్తుండటంతో ఈసారి పూలవర్షం కురిపించాలని ఉత్సవ కమిటీ కేసీఆర్‌ను కోరిన విషయం తెలిసిందే. -
ఖైరతాబాద్ గణనాధుడికి సాయంత్రం పూలవర్షం
-
ఖైరతాబాద్ గణనాధుడికి సాయంత్రం పూలవర్షం
హైదరాబాద్ : ఖైదతాబాద్ గణనాధుడికి సాయంత్రం అయిదు గంటలకు పూలవర్షం కురిపించనున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. పూలవర్షం కురిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం పూలను సరఫరా చేస్తుందని వెల్లడించింది. హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించిన విషయం తెలిసిందే. అత్యధికంగా ఈసారి మాత్రమే 60 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం, వచ్చే ఏడాది నుంచి వరుసగా ఎత్తు తగ్గుతూ వస్తుండటంతో ఈసారి పూలవర్షం కురిపించాలని ఉత్సవ కమిటీ కేసీఆర్‌ను కోరిన విషయం తెలిసిందే. మరోవైపు భారీ లంబోదరుడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తులు బారికేడ్లను దాటుకుని గణేషుడిని చూసేందుకు యత్నించటంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు తిప్పలు పడుతున్నారు. గణనాథుడికి వీడ్కోలు పలికేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దాంతో స్వామివారిని దర్శించుకుని బయటకు వెళ్లేందుకు కూడా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. -
వినాయకుడి చుట్టూ ఎలుక ప్రదక్షిణలు
వినాయక చవితి రోజున భక్తులకు వినాయకుడు ఎంత ముఖ్యమో.. ఆయన వాహనమైన ఎలుక కూడా అంతే ముఖ్యం. అనింద్యుడు అనే మూషికాన్ని వినాయకుడికి పరమశివుడు వాహనంగా ఇచ్చినట్లు వినాయకచవితి కథలో చెబుతారు. ఇప్పుడు అనంతపురం జిల్లా గుంతకల్లులో ఒక ఎలుక వినాయకుడి విగ్రహం చుట్టూ తిరుగుతూ, అక్కడే ఆయన తొండం మీద నివాసం ఏర్పరుచుకుని భక్తులు సమర్పించిన ప్రసాదాలు తింటూ అలాగే ఉండిపోయింది. వినాయక చవితి సందర్భంగా గుంతకల్లు లోని మునిసిపల్ బాలుర హైస్కూల్ సమీపంలో ఒక వినాయక మండపం ఏర్పాటు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో అక్కడకు ఓ చిన్న ఎలుక వచ్చింది. వచ్చిందే తడవుగా విఘ్నేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టింది. దాంతో భక్తులు పరమానంద భరితులయ్యారు. గణపతి బప్పా మోరియా.. ఆధా లడ్డూ ఖాలియా అంటూ ఆ మూషికానికి మరిన్ని లడ్డూలు, ఉండ్రాళ్లు పెట్టసాగారు. ఈ విషయం ఆనోట, ఈ నోట అందరికీ తెలిసి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా తండోపతండాలుగా జనం రావడం మొదలుపెట్టారు. స్వయంగా వినాయకుడే ఈ ఎలుక రూపంలో వచ్చి తమకు దర్శనం ఇచ్చాడంటూ మురిసిపోయారు. శనివారం మధ్యాహ్నం వరకు కూడా ఆ ఎలుక ఆ విగ్రహం వద్దే ఉండటం విశేషం! -
చవితి చంద్రుడు రాలేదు!!
భాద్రపద శుద్ధ చవితి.. అంటే వినాయక చవితి రోజున చంద్రుడిని చూస్తే నీలాపనిందలు తప్పవని, ఏదో ఒక అపనింద భరించాల్సి ఉంటుందని అంటారు. అయితే, శుక్రవారం నాడు దాదాపుగా రెండు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో దట్టంగా మబ్బులు పట్టి కుండపోతగా వర్షం కురవడంతో అసలు చవితి చంద్రుడే కనిపించలేదు! ఉమ్మడి రాజధాని నగరమైన హైదరాబాద్‌లో అయితే సాయంత్రం నుంచి మబ్బు బాగా పట్టి అర్ధరాత్రి, తెల్లవారుజాము వరకు కూడా వర్షం అడపాదడపా కురుస్తూనే ఉంది. చాలాచోట్ల మండపాలు తడిసిపోయాయి. అయినా భక్తులు అలాగే వర్షంలో తడుస్తూనే విఘ్ననాయకుడికి పూజలు చేశారు. ఈసారి మాత్రమే వినాయకచవితికి చంద్రడు కనిపించలేదని, ప్రతిసారీ తప్పనిసరిగా వస్తాడని పలువురు అర్చకులు కూడా అన్నారు. అయితే.. వినాయక చవితి రోజున పూజ చేసుకుని, కథ విని అక్షింతలు వేసుకుంటే చంద్రుడిని చూసినా ఎలాంటి సమస్య ఉండబోదని వారు చెప్పారు. మొత్తానికి కావాలని చూడాలనుకున్నవారికి కూడా చవితి చంద్రుడు కనిపించకపోవడం ఈసారి విశేషం! -
ఖైరతాబాద్ గణేశుడిపై పూలవర్షం
ఖైరతాబాద్‌లో నెలకొల్పిన 60 అడుగుల భారీ గణేశుడి విగ్రహంపై త్వరలోనే హెలికాప్టర్‌తో పూలవర్షం కురిపిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. అత్యధికంగా ఈసారి మాత్రమే 60 అడుగుల విగ్రహం ఏర్పాటుచేయడం, వచ్చే ఏడాది నుంచి వరుసగా ఎత్తు తగ్గుతూ వస్తుండటంతో ఈసారి పూలవర్షం కురిపించాలని ఉత్సవ కమిటీ సీఎం కేసీఆర్‌ను కోరింది. శుక్రవారం సాయంత్రం కేసీఆర్ ఖైరతాబాద్‌లో కొలువైన శ్రీ కైలాస విశ్వరూప మహాగణపతిని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణపతి దయతో బంగారు తెలంగాణ కల సాకారం కావాలని ఆకాంక్షించారు. విఘ్ననాయకుడి కరుణా కటాక్ష వీక్షణాలతో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. -
నమ్మకం: వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు?
రుతుధర్మాన్ననుసరించి జరుపుకునే పండుగలలో వినాయక చవితి ముఖ్యమైనది. యేటా వర్షరుతువు చివర్లో భాద్రపద శుద్ధ చవితినాడు వస్తుందీ పండుగ. వేసవి తాపం తగ్గి, బీటలు వారిన భూమి వర్షపు జల్లులతో ప్రాణశక్తిని పుంజుకుని పచ్చదనాన్ని సంత రించుకుంటుంది. పుష్పాలు విచ్చి పరిమళం వెదజల్లుతుంటాయి. నదులలో నీరు నిండి జీవనతత్వం అభివృద్ధి చెందుతుంది. బుధుడు అధిపతియైన హస్త... వినాయకుని జన్మనక్షత్రం. బుధగ్రహానికి ఆకుపచ్చనివంటే ఇష్టం. వినాయకునికి కూడా గడ్డిజాతి మొక్కలంటే ఇష్టం. అందుకే ఆయనను గరికతోనూ, వివిధ ఆకులతోనూ పూజిస్తాం. గణేశ పూజకు ఒండ్రుమట్టితో చేసిన వినాయకుడి ప్రతిమను మాత్రమే ఉపయోగించడంలో ఒక విశేషముంది. అదేమంటే జలాశయాలన్నీ పూడికతో నిండి వుంటాయి. బంకమట్టికోసం జలాశయాలలో దిగి, మట్టిని తీయడం వల్ల పూడిక తీసినట్లవుతుంది. నీళ్లు తేటపడతాయి. అదీగాక మట్టిని తాకడం, దానితో బొమ్మలు చేయడం వల్ల మట్టిలోని మంచి గుణాలు ఒంటికి పడతాయి. ఒండ్రుమట్టిలో నానడం ఒంటికి మంచిదని ప్రకృతి వైద్యులు చెబుతారు. ప్రకృతి చికిత్సకు ఒండ్రుమట్టిని వాడటం మనకు తెలిసినదే. అయితే పదిరోజులపాటు పూజలు చేసిన వినాయక విగ్రహాన్ని పదకొండోరోజున మేళతాళాలతో జల నిమజ్జనం చేయడంలో ఒక వేదాంత రహస్యం ఉంది. పాంచభౌతికమైన ప్రతి ఒక్క పదార్థం, అంటే పంచభూతాలనుంచి జనించిన ప్రతి ఒక్క సజీవ, నిర్జీవ పదార్థమూ మధ్యలో ఎంత వైభవంగా, ఇంకెంత విలాసంగా గడిపినప్పటికీ అంతిమంగా మట్టిలో కలసిపోవలసిందే. అందుకే ప్రకృతి దేవుడైన వినాయక విగ్రహాలను మట్టితోనే చేస్తారు. అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, నైవేద్యాలు సమర్పించి నీటిలో నిమజ్జనం చేస్తారు. -
ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః
మహిళలందరూ ఎంతో ఆనందంగా, భక్తిశ్రద్ధలతో ఇళ్లలోనూ, గుళ్లలోనూ సామూహికంగా జరుపుకునే పండుగ వరలక్ష్మీవ్రతం. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం ఆచరిస్తారు. కుదరని వారు ఆ మాసంలో వచ్చే ఏదో ఒక శుక్రవారంనాడు ఈ వ్రతం జరుపుకోవచ్చు. ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసి, గుమ్మాన్ని పసుపు కుంకుమలు, మామిడాకు తోరణాలతో అలంకరించాలి. ఇల్లాలు తలంటి స్నానం చేసి, కలశం స్థాపించి, అందులో లక్ష్మీదేవిని ఉంచాలి. ముందుగా విఘ్న నివారణకై గణపతి పూజ చేయాలి. తర్వాత సంకల్పం చెప్పుకుని ఒక పంచపాత్రను గాని, లోటాను గాని తీసుకుని, అందులో నీరు పోసి అక్షతలు, పువ్వులు, తమలపాకులను ఉంచాలి. దానికి బయట మూడువైపులా పసుపు, కుంకుమ, గంధాలతో అలంకరించి కలశపూజ చేయాలి. వరలక్ష్మీ పూజావిధానం... సులభ పద్ధతిలో అమ్మవారిని ఇంటికి ఆహ్వానించి, కాళ్లు కడుక్కోవడానికి నీళ్లిచ్చి, నవరత్న ఖచిత సింహాసనంపై కూర్చుండబెట్టి, తాగడానికి నీళ్లిచ్చి, స్నానం చేయించి, వస్త్రాలు, ఆభరణాలు అలంకరించి, ధూపదీపనైవేద్యాలతో పూజించి, కథ చెప్పుకుని, శక్తికొద్దీ నైవేద్యాలు సమర్పించి, సకల మర్యాదలతో సాగనంపినట్లుగా భావించుకోవాలి. అదే పూజామంత్రాలలోని అంతరార్థం. ఇక పూజలోకి వద్దాం... ధ్యానం: పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధ్యాయామి (అమ్మవారి కలశం ముందు కొన్ని పుష్పాలుంచి నమస్కరించాలి) ఆవాహన: సర్వమంగళ మాంగల్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవీ త్వాం సుప్రతా భవ సర్వదా, శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఆవాహయామి’ అని చెబుతూ కలశం ముందు అక్షతలు వేయాలి. ఆసనం: శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. (అక్షతలు లేదా పుష్పాలు ఉంచాలి) అర్ఘ్యం: శ్రీవరలక్ష్మీ దేవతాయైనమః అర్ఘ్యం సమర్పయామి అంటూ ఉద్ధరిణతో నీటిని అమ్మవారికి చూపించి ముందున్న అర్ఘ్యపాత్రలో వేయాలి. పాద్యం: పాద్యం గృహాణ దేవత్వం సర్వదేవ నమస్కృతే అంటూ అర్ఘ్యపాత్రలో ఓ ఉద్ధరిణెడు నీటిని వేయాలి. ఆచమనం: శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః శుద్ధాచమనీయం సమర్పయామి (అర్ఘ్యపాత్రలో ఉద్ధరిణెడు నీటిని వేయాలి) పంచామృతస్నానం: పయోదధిఘృతో పేతం శర్కరా మధుసంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే శ్రీవరలక్ష్మీ దేవతాయైనమః పంచామృతస్నానం సమర్పయామి (తమలపాకుతో కొన్ని చుక్కల నీటిని కలశం మీద చిలకరించాలి) శుద్ధోదకస్నానం: శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి (తమలపాకుతో కొన్ని చుక్కల నీటిని కలశం మీద చిలకరించాలి) ఆచమనీయం: స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి (అర్ఘ్యపాత్రలో ఉద్ధరిణెడు నీటిని వేయాలి) వస్త్రం: శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి (అక్షతలు లేదా పుష్పాలు ఉంచాలి) ఆభరణం: శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః ఆభరణాని సమర్పయామి (పుష్పాలు ఉంచాలి) ఉపవీతం: శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః ఉపవీతం సమర్పయామి (పత్తితో చేసిన సూత్రం చివరలో గంధం రాసి కలశానికి అంటించాలి) గంధం: శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః గంధం సమర్పయామి (కలశంపై గంధం చిలకరించాలి) అక్షతలు: శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః అక్షతాన్ సమర్పయామి (అక్షతలు వేయాలి) పుష్పం: శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః పుష్పైః పూజయామి (అమ్మవారి కలశం ముందు పుష్పం ఉంచాలి). అధాంగ పూజ: పుష్పాలు లేదా అక్షతలతో కలశాన్ని పూజించాలి. అనంతరం అష్టోత్తర శతనామాలతో అర్చిస్తూ, పుష్పాలతో పూజించాలి). దూపం: శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధూప మాఘ్రాపయామి (అగరు వత్తులు వెలిగించి ఆ ధూపాన్ని అమ్మవారికి చూపాలి) దీపం: శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః దీపం దర్శయామి ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి (దీపం చూపించి ఉద్ధరిణెతో కొంచెం నీటిని అర్ఘ్యపాత్రలో వేయాలి) నైవేద్యం: నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్వాజ్య సంయుతం నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరి వల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి (ఉద్ధరిణెతో నీటిని అర్ఘ్యపాత్రలో ఉంచాలి) పానీయం: ఘనసార సుగంధేన మిశ్రీతం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవీ శీతలం సుమనోహరమ్ శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః పానీయం సమర్పయామి (ఉద్ధరిణెతో నీటిని అర్ఘ్యపాత్రలో ఉంచాలి) తాంబూలం: పండు, పుష్పం, వక్క, దక్షిణతో కూడిన తాంబూలాన్ని అమ్మవారి వద్ద ఉంచాలి. నీరాజనం: శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నీరాజనం సమర్పయామి (ఘంటానాదం చేస్తూ కర్పూర హారతిని అమ్మవారికి చూపించాలి) మంత్రపుష్పం: పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవి సుప్రీతో భవసర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః మంత్రపుష్పం సమర్పయామి (పుష్పాలను అమ్మవారి ఎదుట ఉంచాలి) ప్రదక్షిణ: యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవా త్రాహిమాం కృపయాదేవి శరణాగత వత్సలే అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగధారిణి శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః ప్రదక్షిణం సమర్పయామి (ముమ్మారు ప్రదక్షిణ చేయాలి) నమస్కారం: నమస్తే లోక జననీ నమస్తే విష్ణు వల్లభే పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ దేవతాయై నమః నమస్కారాన్ సమర్పయామి (అమ్మవారికి అక్షతలు సమర్పించి నమస్కరించాలి) తోరపూజ: తోరాలను అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో పూజించి, తోరం కట్టుకోవాలి. తర్వాత వరలక్ష్మీ వ్రతకథ చదువుకొని అక్షతలు వేసుకుని, ముత్తయిదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి, పూజచేసిన వారు కూడా తీర్థప్రసాదాలు స్వీకరించాక, అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని ఆరగించాలి. -కూర్పు: డి.వి.ఆర్.భాస్కర్ వతానికి సమకూర్చుకోవలసిన సంభారాలు పసుపు, కుంకుమ, వాయనానికవసరమైన వస్తువులు, అక్షతలు, ఎర్రటి రవికె, గంధం, పూలు, పండ్లు, తమలపాకులు, వక్కలు, తోరాలు చేసుకోవడానికి తగినంత నూలు దారం, 5 కొబ్బరికాయలు, దీపపు కుందులు, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి, దీపారాధనకు ఆవునెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం, శనగలు, అర్ఘ్య పాత్ర (చిన్నగిన్నె) తదితరాలను సిద్ధంగా ఉంచుకోవాలి. పసుపు గణపతిని తయారు చేసి ఉంచుకోవాలి.