గౌతమి కూతురికి శ్రుతి అడ్వైజ్ | Subbulakshmi to change her name? | Sakshi
Sakshi News home page

గౌతమి కూతురికి శ్రుతి అడ్వైజ్

Published Fri, Feb 13 2015 2:34 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

గౌతమి కూతురికి శ్రుతి అడ్వైజ్ - Sakshi

గౌతమి కూతురికి శ్రుతి అడ్వైజ్

తమిళసినిమా: ప్రఖ్యాత నటుడు కమలహాసన్ వారసులుగా శ్రుతిహాసన్, అక్షరహాసన్ రంగ ప్రవేశం చేశారు. శ్రుతి ఇప్పటికే తమిళం, తెలుగు, హిందీ భాషల్లో టాప్ హీరోయిన్‌గా వెలిగిపోతున్నారు. షమితాబ్‌తో నటిగా అరంగేట్రం చేసిన అక్షర చక్కని అభినయంతో అభినందనలు అందుకుంటున్నారు. కమలహాసన్‌తో సహజీవనం చేస్తున్న నటి గౌతమి పాపనాశం చిత్రంతో రీ ఎంట్రీ అయ్యారు. ఇప్పుడామె కూతురు సుబ్బులక్ష్మికి నటి కావాలనే కోరిక ఉందట. తన ఆకాంక్షను గౌతమి చెవిలో వేసింది. కూతురి కోరికకు తల్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.
 
  పనిలో పనిగా చిన్న సూచన కూడా చేశారట. శ్రుతిహాసన్‌ను రోల్ మాడల్‌గా తీసుకో, తాను చెప్పే సలహాలను పాటించు అని హితవు పలికారట. సుబ్బులక్ష్మి ఆశ తెలుసుకున్న శ్రుతిహాసన్ వెంటనే శుభాశీస్సులు అందించేశారు. అయితే ఆమె కూడా సుబ్బులక్ష్మి అనే పేరు మార్చుకో అంటూ చిన్న అడ్వైజ్‌ను ఇచ్చేశారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. సుబ్బులక్ష్మిని ఏ భాషలో పరిచయం చేయాలన్నదే గౌతమి ముందున్న ప్రశ్న అట. అయితే శ్రుతిహాసన్, అక్షరహాసన్ మాదిరిగానే సుబ్బులక్ష్మిని తొలుత బాలీవుడ్‌లో పరిచయం చేయాలని ఆ తరువాత     దక్షిణాదిలో ఆటోమేటిక్‌గా అవకాశాలు తలుపు తడుతాయని ఆమె సన్నిహితులు సలహా ఇస్తున్నారని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement