Gautami daughter
-
గౌతమి కూతురికి శ్రుతి అడ్వైజ్
తమిళసినిమా: ప్రఖ్యాత నటుడు కమలహాసన్ వారసులుగా శ్రుతిహాసన్, అక్షరహాసన్ రంగ ప్రవేశం చేశారు. శ్రుతి ఇప్పటికే తమిళం, తెలుగు, హిందీ భాషల్లో టాప్ హీరోయిన్గా వెలిగిపోతున్నారు. షమితాబ్తో నటిగా అరంగేట్రం చేసిన అక్షర చక్కని అభినయంతో అభినందనలు అందుకుంటున్నారు. కమలహాసన్‌తో సహజీవనం చేస్తున్న నటి గౌతమి పాపనాశం చిత్రంతో రీ ఎంట్రీ అయ్యారు. ఇప్పుడామె కూతురు సుబ్బులక్ష్మికి నటి కావాలనే కోరిక ఉందట. తన ఆకాంక్షను గౌతమి చెవిలో వేసింది. కూతురి కోరికకు తల్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. పనిలో పనిగా చిన్న సూచన కూడా చేశారట. శ్రుతిహాసన్‌ను రోల్ మాడల్‌గా తీసుకో, తాను చెప్పే సలహాలను పాటించు అని హితవు పలికారట. సుబ్బులక్ష్మి ఆశ తెలుసుకున్న శ్రుతిహాసన్ వెంటనే శుభాశీస్సులు అందించేశారు. అయితే ఆమె కూడా సుబ్బులక్ష్మి అనే పేరు మార్చుకో అంటూ చిన్న అడ్వైజ్‌ను ఇచ్చేశారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. సుబ్బులక్ష్మిని ఏ భాషలో పరిచయం చేయాలన్నదే గౌతమి ముందున్న ప్రశ్న అట. అయితే శ్రుతిహాసన్, అక్షరహాసన్ మాదిరిగానే సుబ్బులక్ష్మిని తొలుత బాలీవుడ్లో పరిచయం చేయాలని ఆ తరువాత దక్షిణాదిలో ఆటోమేటిక్‌గా అవకాశాలు తలుపు తడుతాయని ఆమె సన్నిహితులు సలహా ఇస్తున్నారని సమాచారం. -
తెరపై గౌతమి వారసురాలు?
వారసులు తెరపైకి రావడం అనేది కొత్తేమీ కాదు. ప్రముఖ నటీనటుల్లో చాలామంది వారసులు ఇప్పుడు సినీ రంగంలో మేటి తారలుగా ప్రకాశిస్తున్నారు. ఉదాహరణకు కోలీవుడ్‌లో స్టార్ హీరోలు విజయ్, సూర్య, కార్తీ, ధనుష్, శింబు వారసులుగా తెరంగేట్రం చేసినవారే. అలాగే సిబిరాజ్, విక్రమ్ ప్రభు, గౌతమ్ కార్తీక్ తదితరులు యువ హీరోలుగా ఎదుగుతున్నారు. రజనీకాంత్ వారసులు ఐశ్వర్య, సౌందర్య వర్ధమాన దర్శకులుగా రాణించే ప్రయత్నం చేస్తుంటే కమలహాసన్ కూతురు శ్రుతిహాసన్, అక్షర హీరోయిన్లుగా ఎదుగుతున్నారు. ఇలా సినీ రంగంలో పలువురు పలు శాఖల్లో వారసులు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా నటి గౌతమి కూతురు సుబ్బులక్ష్మి తెరంగేట్రానికి సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ టాక్. సుబ్బులక్ష్మి 16 ఏళ్ల ప్రాయంలో అడుగుపెట్టారు. నాట్యంలో తర్ఫీదు పొందుతూ, నటించాలనే ఆకాంక్షతో ఉన్నట్లు సమాచారం. ఈ మధ్య గౌతమి కూడా తన కూతురిని వెంటేసుకుని తిరుగుతున్నారు. సుబ్బులక్ష్మిని హీరోయిన్గా పరిచయం చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో పలువురు దర్శక, నిర్మాతలు సుబ్బులక్ష్మిని నాయకిగా పరిచయం చేయడానికి పోటీ పడుతున్నట్టు కోడంబాక్కం వర్గాల మాట.