వారసులు తెరపైకి రావడం అనేది కొత్తేమీ కాదు. ప్రముఖ నటీనటుల్లో చాలామంది వారసులు ఇప్పుడు సినీ రంగంలో మేటి తారలుగా ప్రకాశిస్తున్నారు. ఉదాహరణకు కోలీవుడ్‌లో స్టార్ హీరోలు విజయ్, సూర్య, కార్తీ, ధనుష్, శింబు వారసులుగా తెరంగేట్రం చేసినవారే. అలాగే సిబిరాజ్, విక్రమ్ ప్రభు, గౌతమ్ కార్తీక్ తదితరులు యువ హీరోలుగా ఎదుగుతున్నారు. రజనీకాంత్ వారసులు ఐశ్వర్య, సౌందర్య వర్ధమాన దర్శకులుగా రాణించే ప్రయత్నం చేస్తుంటే కమలహాసన్ కూతురు శ్రుతిహాసన్, అక్షర హీరోయిన్లుగా ఎదుగుతున్నారు.
ఇలా సినీ రంగంలో పలువురు పలు శాఖల్లో వారసులు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా నటి గౌతమి కూతురు సుబ్బులక్ష్మి తెరంగేట్రానికి సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ టాక్. సుబ్బులక్ష్మి 16 ఏళ్ల ప్రాయంలో అడుగుపెట్టారు. నాట్యంలో తర్ఫీదు పొందుతూ, నటించాలనే ఆకాంక్షతో ఉన్నట్లు సమాచారం. ఈ మధ్య గౌతమి కూడా తన కూతురిని వెంటేసుకుని తిరుగుతున్నారు. సుబ్బులక్ష్మిని హీరోయిన్‌గా పరిచయం చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో పలువురు దర్శక, నిర్మాతలు సుబ్బులక్ష్మిని నాయకిగా పరిచయం చేయడానికి పోటీ పడుతున్నట్టు కోడంబాక్కం వర్గాల మాట.
తెరపై గౌతమి వారసురాలు?
Published Wed, Jan 28 2015 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 PM
Advertisement
Advertisement