Subbu Lakshmi
-
ముగిసిన సుబ్బులక్ష్మి జయంత్యుత్సవాలు
నెల్లూరు(బారకాసు): సింహపురి కల్చరల్ అకాడమీ, సంస్కృతి తరంగాలు సంయుక్త ఆధ్వర్యంలో పురమందిరంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఎమ్మెస్ సుబ్బెలక్ష్మి శత జయంత్యుత్సవాలు ఘనంగా ముగిశాయి. బుధవారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో శాస్త్రీయ జానపద నృత్య ప్రదర్శనలు అలరించాయి. ప్రముఖ జానపద నృత్య కళాకారుడు, భారతదేశ జానపద బ్రహ్మ పున్నూరు నారాయణమూర్తి, ప్రముఖ డోలు విద్వాంసుడు, సంగీత కళాశాల అధ్యాపకుడు(తిరుపతి) ఇనుకొండ నాగరాజు, కృష్ణ ధర్మరాజ దేవస్థాన పాలకమండలి సభ్యుడు వరదా పవన్‌కుమార్‌ను ముఖ్యఅతిథులు సన్మానించి వారికి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పురస్కారాలను అందజేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, సభాసింహం బీవీ నరసింహం, టీడీపీ నాయకుడు పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, ప్రముఖ డోలు విద్వాంసుడు మస్తాన్‌బాబు, నిర్వాహకులు రేణిగుంట రాజశేఖర్, మునికుమార్, మునిరాజ్, తదితరులు పాల్గొన్నారు. -
తెరపై గౌతమి వారసురాలు?
వారసులు తెరపైకి రావడం అనేది కొత్తేమీ కాదు. ప్రముఖ నటీనటుల్లో చాలామంది వారసులు ఇప్పుడు సినీ రంగంలో మేటి తారలుగా ప్రకాశిస్తున్నారు. ఉదాహరణకు కోలీవుడ్‌లో స్టార్ హీరోలు విజయ్, సూర్య, కార్తీ, ధనుష్, శింబు వారసులుగా తెరంగేట్రం చేసినవారే. అలాగే సిబిరాజ్, విక్రమ్ ప్రభు, గౌతమ్ కార్తీక్ తదితరులు యువ హీరోలుగా ఎదుగుతున్నారు. రజనీకాంత్ వారసులు ఐశ్వర్య, సౌందర్య వర్ధమాన దర్శకులుగా రాణించే ప్రయత్నం చేస్తుంటే కమలహాసన్ కూతురు శ్రుతిహాసన్, అక్షర హీరోయిన్లుగా ఎదుగుతున్నారు. ఇలా సినీ రంగంలో పలువురు పలు శాఖల్లో వారసులు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా నటి గౌతమి కూతురు సుబ్బులక్ష్మి తెరంగేట్రానికి సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ టాక్. సుబ్బులక్ష్మి 16 ఏళ్ల ప్రాయంలో అడుగుపెట్టారు. నాట్యంలో తర్ఫీదు పొందుతూ, నటించాలనే ఆకాంక్షతో ఉన్నట్లు సమాచారం. ఈ మధ్య గౌతమి కూడా తన కూతురిని వెంటేసుకుని తిరుగుతున్నారు. సుబ్బులక్ష్మిని హీరోయిన్గా పరిచయం చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో పలువురు దర్శక, నిర్మాతలు సుబ్బులక్ష్మిని నాయకిగా పరిచయం చేయడానికి పోటీ పడుతున్నట్టు కోడంబాక్కం వర్గాల మాట.