ముగిసిన సుబ్బులక్ష్మి జయంత్యుత్సవాలు
నెల్లూరు(బారకాసు): సింహపురి కల్చరల్ అకాడమీ, సంస్కృతి తరంగాలు సంయుక్త ఆధ్వర్యంలో పురమందిరంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఎమ్మెస్ సుబ్బెలక్ష్మి శత జయంత్యుత్సవాలు ఘనంగా ముగిశాయి. బుధవారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో శాస్త్రీయ జానపద నృత్య ప్రదర్శనలు అలరించాయి. ప్రముఖ జానపద నృత్య కళాకారుడు, భారతదేశ జానపద బ్రహ్మ పున్నూరు నారాయణమూర్తి, ప్రముఖ డోలు విద్వాంసుడు, సంగీత కళాశాల అధ్యాపకుడు(తిరుపతి) ఇనుకొండ నాగరాజు, కృష్ణ ధర్మరాజ దేవస్థాన పాలకమండలి సభ్యుడు వరదా పవన్‌కుమార్‌ను ముఖ్యఅతిథులు సన్మానించి వారికి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పురస్కారాలను అందజేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, సభాసింహం బీవీ నరసింహం, టీడీపీ నాయకుడు పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, ప్రముఖ డోలు విద్వాంసుడు మస్తాన్‌బాబు, నిర్వాహకులు రేణిగుంట రాజశేఖర్, మునికుమార్, మునిరాజ్, తదితరులు పాల్గొన్నారు.