Jayalalitha Biopic Thalaivi: Arvind Swami New Look Released As MGR I తలైవి మూవీ ఎంజీఆర్‌ లుక్‌ రిలీజ్‌ - Sakshi
Sakshi News home page

తలైవి: ఎంజీఆర్‌ లుక్‌ రిలీజ్‌

Published Thu, Dec 24 2020 2:27 PM | Last Updated on Thu, Dec 24 2020 3:30 PM

Thalaivi: Arvind Swami Looks Perfect As MGR In Jayalalitha Biopic - Sakshi

నిజ జీవిత పాత్రలు చేయాలంటే ఆషామాషీ కాదు. అందులోనూ ప్రముఖుల జీవిత కథల్లో నటించేటప్పుడు వారి హావభావాలు, ఊతపదాలు, నడత, నడక అన్నీ వారిని తలపించేలా ఉండాలి. స్వయంగా ఆ ప్రముఖులు మళ్లీ కళ్లముందు కనిపించేలా మ్యాజిక్‌ చేయాలి. నటుడు అరవింద్‌ స్వామి కూడా ఈ విషయంలో సక్సెస్‌ సాధించినట్లే కనిపిస్తోంది. నేడు దివంగత నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రమ్‌(ఎంజీఆర్)‌ వర్దంతి. ఈ సందర్భంగా 'తలైవి' సినిమాలో పురట్చి తలైవర్‌(విప్లవ నాయకుడు) ఎంజీఆర్‌ పాత్రకు సంబంధించిన ఫొటోలను చిత్రయూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఎంజీఆర్‌ పాత్రలో అరవింద్‌ స్వామి ఒదిగిపోయారు. ఈ పాత్ర ఒప్పుకున్నప్పుడే ఆయన ‘డెంటిస్ట్‌’ దగ్గరకు వెళ్లి తన పళ్లు ఎంజీఆర్‌ పళ్లకి మ్యాచ్‌ అయ్యేలా ఉన్నాయా? అని కూడా చెక్‌ చేసుకున్నారంటే ఆయన ఎంత పర్ఫెక్షనిస్టో అర్థం చేసుకోవచ్చు. (చదవండి: బ్రెయిన్‌ డెడ్‌: ఏదైనా మిరాకిల్‌ జరగాలి)

దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ 'తలైవి' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో తలైవిగా బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌, ఎంజీఆర్‌ పాత్రలో అరవింద్‌ స్వామి నటించారు. జనవరి 17న ఎంజీఆర్‌ జయంతి సందర్భంగా ఈ ఏడాది విడుదల చేసిన అరవింద్‌ స్వామి లుక్‌కి విశేషమైన స్పందన లభించింది. తలైవి సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. విష్ణు వర్దన్‌ ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌ నిర్మాతలుగా, హితేష్‌ తక్కర్‌, తిరుమల్‌ రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. (చదవండి: నేను ఎంజీఆర్‌ రాజకీయ వారసుడ్ని: కమల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement