తలైవికి తలైవర్‌ రెడీ | Arvind Swami AS MGR In J Jayalalithaa biopic | Sakshi
Sakshi News home page

తలైవికి తలైవర్‌ రెడీ

Published Sat, Oct 5 2019 8:50 PM | Last Updated on Sat, Oct 5 2019 8:50 PM

Arvind Swami AS MGR In J Jayalalithaa biopic - Sakshi

తమిళసినిమా: తలైవికి తలైవర్‌ రెడీ అయిపోయారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌కు ఇప్పుడు మంచి డిమాండ్‌ ఉన్నట్టు కనిపిస్తోంది. ఆమె జీవిత చరిత్రతో ఆధారంగా దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ రూపొందించిన వెబ్‌ సిరీస్‌ నిర్మాణం పూర్తయింది. కానీ, విడుదలలోనే ఇది సమస్యలను ఎదుర్కొంటోంది. మరోవైపు నవ దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్‌ లేడీ’ పేరుతో జయలలిత బయోపిక్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో జయలలితగా నిత్యామీనన్‌ నటించబోతున్నారు.

ఇంకోవైపు దర్శకుడు విజయ్‌ కూడా అమ్మ జీవితకథను ప్రతిష్టాత్మకంగా తెరపై ఆవిష్కరించబోతున్నారు. దీనికి తలైవి అనే టైటిల్‌ను ఖారారు చేశారు. ఇందులో జయలలితగా బాలీవుడ్‌ సంచలన నటి కంగనారనౌత్‌ నటించనున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో ‘మక్కళ్‌తిలగం’ ఎంజీఆర్‌ పాత్రను నటుడు అరవిందస్వామి పోషించబోతున్నారు. ఈ మేరకు చిత్ర వర్గాలు ధ్రువీకరించాయి. సో తలైవిగా కంగనా, తలైవర్‌గా అరవిందస్వామి నటించబోతుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. దీనికి బాహుబలి చిత్రం ఫేమ్‌ విజయేంద్రప్రసాద్‌ కథను సిద్ధం చేస్తుండగా.. జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. విష్ణు ఇందూరి, సైలేశ్‌లు నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ డిసెంబర్‌లో గానీ, 2020 ప్రథమార్ధంలో గానీ సెట్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం ప్రస్తుతం కంగనా భారతనాట్యం కూడా నేర్చుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement