
కొన్ని పాత్రలు చేసినప్పుడు సినిమా షూటింగ్ పూర్తయ్యాక కూడా ఆ పాత్రల్లోంచి బయటకు రాలేరు కొందరు నటీనటులు. ఇప్పుడు కంగనా రనౌత్ పరిస్థితి అదే. దివంగత నటి, తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితం ఆధారంగా తీసిన ‘తలైవి’ (నాయకురాలు)లో ఆమె టైటిల్ రోల్ చేశారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ‘‘ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి చేసిన మా ‘తలైవి’ చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. తలైవి.. ఓ విప్లవ నాయకురాలు. ఇలాంటి పాత్రలు చేసే అవకాశం అరుదుగా వస్తుంది. ఈ పాత్రను ఎంతో ప్రేమించి చేశాను. అందుకే సినిమా చివరి రోజు ఈ క్యారెక్టర్‌కి బై చెప్పడానికి బాధపడ్డాను’’ అన్నారు కంగనా రనౌత్. ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment