‘తలైవి’ వర్ధంతి : కంగనా స్టన్నింగ్‌ స్టిల్స్‌ | Death anniversary of Jayalalitha kangana shared working stills | Sakshi
Sakshi News home page

‘తలైవి’ వర్ధంతి : కంగనా స్టన్నింగ్‌ స్టిల్స్‌

Published Sat, Dec 5 2020 11:42 AM | Last Updated on Sat, Dec 5 2020 12:01 PM

 Death anniversary of Jayalalitha  kangana shared working stills - Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి జయలలిత బయోపిక్‌కు సంబంధించిన స్టన్నింగ్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 'తలైవి' మూవీ సంబంధించి  కొన్నివర్కింగ్‌ స్టిల్స్‌ ను ఆమె ట్విటర్‌లో షేర్‌ చేశారు. ముఖ్యంగా  నేడు (శనివారం, డిసెంబరు 5) జయలలిత వర్ధంతి సందర్భంగా  విప్లవ నాయకికి  కంగనా నివాళులర్పించారు. మరో వారం రోజుల్లో సినిమా పూర్తికానుందని పేర్కొన్న కంగనా ఈ సందర్శంగా సూపర్‌ హ్యూమన్‌లా సినిమాను తెరకెక్కిస్తున్న విజయ్‌తోపాటు, తలైవి చిత్ర యూనిట్‌కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జయలలిత బయోపిక్‌ 'తలైవి-ది రివల్యూషనరీ లీడర్‌' లో కంగనా రనౌత్ లీడ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా ఆరు నెలలపాటు వాయిదా పడిన ఈ మూవీ షూటింగ్ కార్యక్రమాలను శరవేంగా పూర్తి చేసుకుంటోంది. హితేష్ ఠక్కర్, తిరుమల్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ హిందీ, తమిళం తెలుగు భాషలలో విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement