చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత బయోపిక్ ‘తలైవి’లో కంగనారనౌత్ ప్రధానపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియన్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి కేఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. నేడు (మార్చి23)న జయలలిత పుట్టినరోజు సందర్భంగా తలైవి ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. అమ్మ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ఒదిగిపోయింది. ఒక సినిమా నటితో మనకి రాజకీయాలు నేర్పించాలనుకోవడం అంటూ అసహనం వ్యక్తం చేస్తున్న డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది.
రాజకీయాల్లోకి రమ్మంటూ ఎంజీఆర్ జయలలితను ఆహ్వానించడం..ఆ తర్వాత ఆమె తమిళ రాజకీయాల్లో తలైవీగా ఎలా మారిందన్న అంశాలు ఈ సినిమాలో చూపించనున్నారు. అసెంబ్లీలో జయలలిత చీర లాగే సన్నివేశంలో ఆమె చెప్పే డైలాగులు తూటాల్లా పేలాయి. అంతేకాకుండా జయలలిత పాత్రలో కంగనా సరిగ్గా సరిపోయిందనిపిస్తుంది. మొదట ఈ పాత్రలో కంగనాపై ట్రోల్స్ వచ్చినా, ట్రైలర్‌తో గట్టి సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ట్రైలర్ ఆద్యంతం ఎంతో ఆకట్టుకుంటుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎంజీఆర్ పాత్రలో అరవిందస్వామి నటించారు. విబ్రి పతాకంపై విష్ణువర్థన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 23న ఈ సినిమా విడుదల కానుంది.
చదవండి : నాలుగోసారి అవార్డు: ఫుల్ ఖుషీలో బాలీవుడ్ ఐరన్ లేడీ
పరాయి దేశంతో పోరాడే వివాహిత కథ!
Comments
Please login to add a commentAdd a comment