పాకిస్తాన్‌లో ‘తలైవి’ ట్రెండింగ్‌.. జోక్‌ చేసిన కంగనా | Kangana Ranaut Jokes About Thalaivi Trending in Pakistan and Other Countries | Sakshi
Sakshi News home page

Kangana Ranaut: పాకిస్తాన్‌లో ‘తలైవి’ ట్రెండింగ్‌.. ఎక్కడైన ఇలాగే అంటూ జోక్‌ చేసిన కంగనా

Oct 11 2021 10:33 AM | Updated on Oct 11 2021 1:00 PM

Kangana Ranaut Jokes About Thalaivi Trending in Pakistan and Other Countries - Sakshi

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ వరుస చిత్రాలు చేస్తు కెరీర్‌లో దూసుకుపోతోంది. ఆమె నటించిన తాజా చిత్రం ‘తలైవి’ థియేటర్స్‌లో విడుదలై మంచి రెస్పాన్స్‌ అందుకుంది. దివంగత సినీ నటి, రాజకీయ నాయకురాలు జయలలిత..

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ వరుస చిత్రాలు చేస్తు కెరీర్‌లో దూసుకుపోతోంది. ఆమె నటించిన తాజా చిత్రం ‘తలైవి’ థియేటర్స్‌లో విడుదలై మంచి రెస్పాన్స్‌ అందుకుంది. దివంగత సినీ నటి, రాజకీయ నాయకురాలు జయలలిత బయోపిక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ మూవీ అక్కడ కూడా మంచి సక్సెస్‌ని అందుకుంది. అయితే ఎన్నో కంట్రీస్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఈ సినిమా పాకిస్తాన్‌లోనూ నెం.1గా దూసుకుపోతోంది.

కంగనా ఈ విషయమై సోషల్‌ మీడియాలో స్పందించింది.  ‘దేశద్రోహులు పాకిస్తాన్‌లో మాత్రమే లేరని, అన్ని దేశాల్లో ఉన్నారని అక్కడి ప్రజలు తెలుసుకొని ఉపశమనం పొందుతున్నారని’ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో జోక్‌ వేసింది ఫైర్‌ బ్రాండ్‌. 

అంతేకాకుండా ‘తలైవి’ మూవీ బంగ్లాదేశ్‌, భారత్‌, పాకిస్తాన్‌లతో నెం.1గా, ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆరు దేశాల్లో టాప్‌ 3, ఐదు దేశాల్లో టాప్‌ 5, తొమ్మిది దేశాల్లో టాప్‌ 10గా ట్రెండింగ్‌లో ఉన్నట్లు ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో తెలిపింది.

చదవండి: రామ్‌ దర్బార్‌ నాణెం ఇచ్చిన సీఎం యోగి.. థ్యాంక్స్‌ చెప్పిన కంగనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement