సినీ నటి, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తలైవి’.విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జయలలిత పాత్రలో బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్ నటిస్తుండగా, ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి నటిస్తున్నారు. కథను బాహుబలి ఫేమ్ విజయేంద్ర ప్రసాద్ సమకూర్చారు. ఈ చిత్రాన్ని విజయ్ దర్శకత్వంలో లిబ్రి మోహన్ పిక్చర్స్ కర్మ మీడి యా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు భారీ ఎత్తున నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన తలైవి టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.
తమిళం, తెలుగు, హిందీ భాషలో పాన్ ఇండియా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ సినిమా ఓటీటీ ఫ్లామ్‌ఫామ్‌లో విడుదల చేయనున్నారు అని వస్తోన్న వార్తలను కంగనా కొట్టిపారేసింది. ఇప్పటివరకు తలైవి రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదని, దయచేసి ఎవరూ పుకార్లను నమ్మవద్దని పేర్కొంది. దేశ వ్యాప్తంగా థియేటర్లను ఓపెన్ చేసినప్పుడే తలైవి సినిమాను రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చింది. ఇక జయలలిత పదహారేళ్ల వయసు నుండి 60 ఏళ్ల వయసు వరకూ మొత్తం నాలుగు దశలను తలైవి బయోపిక్‌లోలో చూపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment