సాక్షి, చెన్నై : బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తలైవి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ మూవీ సెప్టెంబర్10న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ కంగనా తమిళనాడు మెరీనా బీచ్ సమీపంలో ఉన్న జయలలిత సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం ఎంజీఆర్ స్మారకం వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ..జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన తలైవి చిత్రం అందరికీ చేరువ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఏ.ఎల్.విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కంగనా టైటిల్ రోల్ పోషించగా, అరవింద స్వామి ఎంజీఆర్ పాత్రలో కనిపించనున్నారు. విద్యార్థి దశ నుంచి హీరోయిన్‌గా, ఆ తర్వాత రాజకీయ నేతగా ఎదిగే క్రమంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు, ఎంజీఆర్‌తో పరిచయం..ఇలా పలు ఆసక్తికర అంశాలతో తలైవి సినిమాను రూపొందించారు.
‘తలైవి’ థియేటర్లో విడుదలైన నెల రోజుల తర్వాత నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం. భాగ్యశ్రీ కీలకపాత్రలో కనిపించనున్నారు. విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్, బ్రిందా ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
చదవండి : సిద్ధార్థ్ శుక్లా అంత్యక్రియల్లో వివాదం..వీడియో వైరల్
సిద్ధార్థ్‌కు నివాళి తెలుపను, ఎందుకంటే: షెహనాజ్ సోదరుడు
Comments
Please login to add a commentAdd a comment