
గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం సినిమాలో నటించేందుకు స్టార్ హీరోలు క్యూ కడతారు. యువ తరం హీరోలకైతే మణి సినిమాలో నటించటం ఓ కల. అందుకే మణిరత్నం సినిమాలో నటించే అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు. కానీ ఓ యంగ్ హీరో మాత్రం అలాంటి గోల్డెన్ ఛాన్స్ కు కూడా నో చెప్పేశాడట. చెలియా సినిమా తరువాత లెజెండరీ దర్శకుడు మణిరత్నం ఓ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
శింబు, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, అరవింద్ స్వామిల కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో ఓ పాత్రకు ముందుకు విజయ్ దేవరకొండను తీసుకోవాలని భావించాడట మణిరత్నం. కానీ ఆ పాత్రలో నటించేందుకు విజయ్ అంగీకరించకపోవటంతో మరొకరిని తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. మణి సినిమాకు విజయ్ ఎందుకు నో చెప్పాడో మాత్రం బయటి రాలేదు. అదే సమయంలో మరో యంగ్ హీరో నానికి కూడా మణి సినిమాలో అవకాశం వచ్చింది. ఈ విషయాన్ని నాని స్వయంగా తెలిపారు. డేట్స్ అడ్జస్ట్ కాని కారణంగా మణిరత్నం సినిమాలో నటించే అవకాశం వదులుకున్నట్టుగా తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment