మాల్దీవులకు భాస్కర్‌ ఒరు రాస్కెల్‌ | Nikisha Patel joins Bhaskar Oru Rascal | Sakshi
Sakshi News home page

మాల్దీవులకు భాస్కర్‌ ఒరు రాస్కెల్‌

Published Wed, Aug 23 2017 2:47 AM | Last Updated on Sun, Sep 17 2017 5:51 PM

మాల్దీవులకు భాస్కర్‌ ఒరు రాస్కెల్‌

మాల్దీవులకు భాస్కర్‌ ఒరు రాస్కెల్‌

భాస్కర్‌ ఒరు రాస్కెల్‌ చిత్ర యూనిట్‌ మాల్దీవులకు పయనం అవుతోంది. మలయాళంలో మమ్ముట్టి, నయనతార జంటగా నటించిన భాస్కర్‌ ది రాస్కెల్‌ చిత్రానికి రీమేక్‌ అవుతున్న చిత్రం భాస్కర్‌ ఒరు రాస్కెల్‌.

ఇందులో అరవిందస్వామి, అమలాపాల్‌ జంటగా నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రల్లో నాజర్, సూరి, రోబోశంకర్, రమేశ్‌ఖన్నా, సిద్ధిక్‌ మాస్టర్‌ రాఘవ నటిస్తున్నారు. తెరి చిత్రం ద్వా రా బాలతారగా పరిచయమైన నటి మీనా కూతురు నైనిక, కీలక పాత్రల్లో బాలీవుడ్‌ నటుడు అఫదవ్‌ వివద్‌శాని నటిస్తున్నారు. ఒక ప్రత్యేక పాత్రలో నటి నికీషాపటేల్‌ నటిస్తుం డడం విశేషం. మలయాళ చిత్రానికి దర్శకత్వం వహించిన సిద్ధికే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ ప్రస్తుతం చిత్ర చివరి షెడ్యూల్‌ను చెన్నైలో చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. ఇందులోని ఒక పాటను మాల్దీవుల్లో చిత్రీకరించనున్నామని, అందుకు ఈ నెల 27ను చిత్ర యూనిట్‌ మాల్దీవులకు పయనం కానందని తెలిపారు. ఈ పాటతో చిత్ర షూటింగ్‌ పూర్తి అవుతుందని చెప్పారు. అనంతరం నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలోనే భాస్కర్‌ ఒరు రాస్కెల్‌ చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement