
నికిషా పటేల్
‘పులి’ (2010) సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు నికిషా పటేల్. ఆ తర్వాత ‘ఓమ్ త్రీడీ (2013), అరకు రోడ్డులో(2016), గుంటూరు టాకీస్ (2017)’ సినిమాల్లో నటించారామె. కేవలం తెలుగు సినిమాలే కాదు. వీలైనప్పుడల్లా కన్నడ, తమిళ సినిమాలు చేస్తున్నారీ బ్యూటీ. తాజాగా కోలీవుడ్‌పై ఎక్కువ దృష్టి పెట్టినట్లున్నారు. జీవీప్రకాశ్, ఈషా రెబ్బా జంటగా ఎళిల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఓ లీడ్ రోల్ చేయడానికి ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు నికిషా పటేల్. తాజాగా ‘మార్కెట్ రాజా: ఎమ్‌బీబీఎస్’ సినిమాలో కీలకపాత్ర చేస్తున్నారామె. ఆల్రెడీ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు కూడా. ‘జర్నీ’ ఫేమ్ శరవణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆరవ్, కావ్యాథాపర్ జంటగా నటిస్తున్నారు. రాధికా శరత్‌కుమార్, నాజర్ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాని ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment