Aarav
-
బిగ్‌బాస్ విన్నర్ ఇంట విషాదం
చెన్నై: తమిళ బిగ్‌బాస్ సీజన్ 1 విజేత ఆరవ్ నఫీజ్ ఇంట విషాదం నెలకొంది. ఆరవ్ తండ్రి నిదాన్ గుండెపోటుతో మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం ఒకటిన్నర గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచారు. చెన్నైలో మృతి చెందిన ఆయన భౌతిక కాయాన్ని అంత్యక్రియల కోసం స్వస్థలమైన నాగర్కోల్కు తరలించారు. ఆయన మరణం పట్ల పలువురు సెలబ్రిటీలు, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. (చదవండి: మోనాల్ రెమ్యూనరేషన్ ఎంతంటే?) కాగా ఆరవ్ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. 2016లో విజయ్ ఆంటోని 'భేతాళుడు' చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తర్వాతి ఏడాది బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్‌లోకి వెళ్లి ట్రోఫీని ఎగరేసుకుపోయాడు. అయితే బిగ్‌బాస్ షోలో హీరోయిన్ ఓవియా అతడిని కిస్ చేయడంతో ఆరవ్ పేరు మార్మోగిపోయింది. ఆ తరువాత ఆమె అతడికి ప్రపోజ్ కూడా చేసింది. అలా కొంతకాలం పాటు వీళ్ల మధ్య ప్రేమాయణం నడిచింది. వీరికి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఆర్మీలు కూడా పుట్టుకొచ్చాయి. కానీ బిగ్‌బాస్ తర్వాత వీళ్ల మధ్య విబేధాలు తలెత్తాయి. ఒకానొక సమయంలో ఓవియా ఆత్మహత్యకు యత్నించినట్లు వార్తలు కూడా వెలువడ్డాయి. కాగా గత ఏడాదికాలంగా రేహితో ప్రేమలో ఉన్న ఆరవ్.. ఇరు వర్గాల పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నాడు. ప్రస్తుతం అతడు 'రాజా భీమ', 'మీందుమ్ ఆరగిల్ వా' సినిమాల్లో నటిస్తున్నాడు. (చదవండి: ప్రేయసిని పెళ్లాడనున్న బిగ్‌బాస్ విన్నర్!) -
నికీషా లక్ష్యం ఏంటో తెలుసా?
మంచి స్థానం కోసం పోరాడుతున్న హీరోయిన్లలో నటి నికీషా పటేల్ ఒకరు. చాలా కాలంగా తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం అంటూ పలు భాషల్లో నటిస్తూ మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే ఏ పుట్టలో ఏ పాము ఉంటుందోనన్న సామెతలా వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించేస్తున్నారు. అంతే కాదు అందాలారబోత విషయంలోనూ హద్దులు చెరిపేయడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఈ ఏడాది నికీషా నటించి అరడజను చిత్రాలు తెరపైకి రానున్నాయి. అందులో ఒకటి బిగ్‌బాస్ ఫేమ్ ఆరవ్తో నటిస్తున్న మార్కెట్ రాజా ఎంబీబీఎస్. చరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా ఆ చిత్ర నాయికల్లో ఒకరైన నికీషాపటేల్ మాట్లాడుతూ. ‘ఇటీవలే ఈ చిత్రంలోని పాటల చిత్రీకరణ పూర్తి అయ్యింది. పాటలు చాలా బాగా వచ్చాయి, చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాతో పాటు ఎళిల్ దర్శకత్వంలో ఆయిరం జన్మంగళ్ చిత్రంలోనూ, కస్తూరిరాజా దర్శకత్వంలో భారీ అంచనాలు నెలకొన్న పాండిముని చిత్రంలోనూ, నటుడు శ్రీకాంత్‌కు జంటగా ఒక చిత్రంలోనూ, అదే విధంగా నటుడు నందాతో కలిసి మరో చిత్రంలో నటిస్తున్నాను. ఈ ఏడాది నేను నటించిన ఆరు చిత్రాలు రిలీజ్ అవుతుండటం చాలా సంతోషంగా ఉంది’ అన్నారు. -
జోరు పెరిగింది
‘పులి’ (2010) సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు నికిషా పటేల్. ఆ తర్వాత ‘ఓమ్ త్రీడీ (2013), అరకు రోడ్డులో(2016), గుంటూరు టాకీస్ (2017)’ సినిమాల్లో నటించారామె. కేవలం తెలుగు సినిమాలే కాదు. వీలైనప్పుడల్లా కన్నడ, తమిళ సినిమాలు చేస్తున్నారీ బ్యూటీ. తాజాగా కోలీవుడ్‌పై ఎక్కువ దృష్టి పెట్టినట్లున్నారు. జీవీప్రకాశ్, ఈషా రెబ్బా జంటగా ఎళిల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఓ లీడ్ రోల్ చేయడానికి ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు నికిషా పటేల్. తాజాగా ‘మార్కెట్ రాజా: ఎమ్‌బీబీఎస్’ సినిమాలో కీలకపాత్ర చేస్తున్నారామె. ఆల్రెడీ షూటింగ్లో జాయిన్ అయ్యారు కూడా. ‘జర్నీ’ ఫేమ్ శరవణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆరవ్, కావ్యాథాపర్ జంటగా నటిస్తున్నారు. రాధికా శరత్‌కుమార్, నాజర్ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాని ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేయాలనుకుంటున్నారు. -
‘అతన్ని ప్రేమిస్తే.. అందరికి చెప్తాను’
అతగాడితో ప్రేమలో పడితే తనే అందరికి చెబుతానని అంటోంది తమిళ నటి ఓవియ. ‘బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో’ ద్వారా బాగా ప్రచారం పొందిన నటి ఈ అమ్మడేనని చెప్పవచ్చు. తొలి చిత్రం ‘కలవాని’ విజయం సాధించినా ఆ తరువాత నటించిన చిత్రాలేవీ ఓవియ కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. అలాంటి తరుణంలో ‘బిగ్‌బాస్ గేమ్ షో’కు పిలుపొచ్చింది. అందులో పాల్గొన్న మరో నటుడు ఆరవ్తో ప్రేమ, వివాదం అంటూ వార్తల్లోకెక్కి బాగా ప్రచారం పొందింది ఓవియా. షో నుంచి బయటకు వచ్చిన తరువాత నటిగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. నటుడు, దర్శకుడు రాఘవలారెన్స్ తెరకెక్కిస్తున్న ‘కాంచన–3’లో ఓవియా, ఆయనతో జతకట్టింది. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా మార్చిలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ‘90 ఎంఎల్’ అనే మరో చిత్రంలోనూ ఓవియ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఓవియా నటుడు ఆరవ్తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందనే ప్రచారం జోరందుకుంది. ఈ సందర్భంగా ఓవియ ఒక ఆంగ్లపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఓవియా మాట్లాడుతూ.. ‘‘బిగ్‌బాస్ గేమ్ షో’లో పాల్గొనడం సంతోషకరం. ఆ తరువాత పలు సినీ అవకాశాలు వస్తున్నాయి. అందులో నచ్చిన కథలనే అంగీకరిస్తున్నాను. నా సినీ పయనాన్ని ఇతరులతో పోల్చడం నాకిష్టం లేదు. నేను తీసుకున్న నిర్ణయాలు నాకు సంతృప్తినిస్తున్నాయి. నటుడు ఆరవ్తో నన్ను కలిపి చాలా వదంతులు ప్రచారం అవుతున్న విషయం తెలుసు. అయితే మా ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి’ అన్నారు. అంతేకాక ‘మా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి చాలా అభిమానం ఉంది. దీన్ని స్నేహం అని చెప్పలేను. అందరూ అనుకున్నట్లు మా మధ్య ప్రేమ లాంటిది ఏమైనా పుడితే నేనే ఆ విషయం స్వయంగా అందరికీ చెబుతాను. ప్రస్తుతం మేం సినిమాల మీద దృష్టిపెడుతున్నాం. నేను ప్రస్తుతం ‘కలవాని–2’, ‘కాంచన–3’, ‘90 ఎంఎల్’ చిత్రాల్లో నటిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు ఓవియా. -
అంతకంటే గర్వంగా భావించే విషయం ఏముంటుంది?
సమాజానికి మంచి చేయడానికి రాజకీయాల్లోకి రావలసిన అవసరం లేదని తమిళ హీరో జయంరవి వ్యాఖ్యానించారు. విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈయన ఇటీవల టిక్ టిక్ టిక్ చిత్రంతో అలరించారు. తాజాగా అడంగమరు చిత్రంతో తెరపైకి రావడానికి సిద్ధం అయ్యారు. ఇది జయంరవి మామ సొంతంగా నిర్మిస్తున్న చిత్రం కావటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. కార్తీక్ తంగవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీఖన్నా నాయకిగా నటించింది. ఈ నెల 21న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు జయంరవితో సాక్షి చిట్‌చాట్. అడంగమరు ఏ తరహా చిత్రంగా ఉంటుంది? ఇది విభిన్నంగా సాగే క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుంది. చిత్రంలో మీ పాత్ర గురించి? ఇందులో మరోసారి పోలీస్ అధికారిగా కనిపించనున్నాను. ఇందులో సమాజానికి మంచి చేయాలనే ఒక సిన్సియర్ సీఐగా నటించాను. ఇది పూర్తి కమర్శియల్ కథా చిత్రం అంటున్నారు. మరి దీని ద్వారా ప్రేక్షకులకు ఎలాంటి సందేశం ఇవ్వనున్నారు? ఇప్పుడు దేశంలో జరుగుతున్న దారుణాల గురించి చూపిస్తున్నాం. అలాంటి సంఘటనలను ఎలా అరికట్టాలనే అంశాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించాం. నిజజీవితంలో అలాంటి సంఘటనలను అరికట్టడం సాధ్యమంటారా? ప్రయత్నిస్తే అసాధ్యం అంటూ ఏమీ లేదు. ముఖ్యంగా శిక్షలు చాలా కఠినంగా ఉండాలి. అప్పుడే దారుణాలను అరికట్టగలం. అందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మీకు రాజకీయాల్లోకి వచ్చే అలోచన ఉందా? అసలు లేదు. అయినా మంచి చేయడానికి రాజకీయాల్లోకి రావలసిన అవసరం లేదు. రజనీకాంత్, కమలహాసన్ వంటి వారు రాజకీయాల్లోకి వస్తున్నారుగా? అని మీరు అడగవచ్చు. వారు రాజకీయాల ద్వారానే ప్రజలకు మంచి చేయవచ్చునని భావిస్తున్నారేమో. నేను చెప్పేది నా వ్యక్తిగత అభిప్రాయం. అడంగమరు చిత్రంలో హీరోయిన్ రాశీఖన్నా పాత్ర గురించి? ఆమెది చాలా మంచి పాత్ర. ఇంటీరియర్ డిజైనర్‌గా నటించింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత గురించి డాక్యుమెంటరీని ఇటీవల ఒక చానల్లో ప్రసారమైంది. అందులో జయలలిత నాకు నచ్చిన చిత్రం దీపావళి అని, ఈతరం యువ నటుల్లో జయంరవి అంటే ఇష్టం అని పేర్కొన్నారు. దీనిపై మీ స్పందన? అంతకంటే గర్వంగా భావించే విషయం ఏముంటుంది? చాలా సంతోషం. జయలలితను ఎప్పుడైనా స్వయంగా కలిశారా? ఒకసారి కుటుంబసభ్యులతో కలిసి జయలలిత ఇంటికి వెళ్లాను. నాకు అప్పుడు చిన్న వయసు. మేడమ్ మీ ఇల్లు చాలా బాగుంది అని అనేశాను. అందుకామె థ్యాంక్స్ అని అన్నారు. ఆ తరువాత సంతోష్ సుబ్రమణియం చిత్ర విజయోత్సవ వేడుకలో జయలలిత చేతుల మీదగా జ్ఞాపికను అందుకున్న క్షణాలను ఎప్పటికీ మరచిపోలేను. జయలలిత బయోపిక్ చిత్రంలో ఎంజీఆర్ పాత్రలో నటించే అవకాశం మీకు వస్తే ఎంజీఆర్‌గా నటిస్తారా? అలాంటి అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను. మీ అబ్బాయి ఆరవ్ టిక్ టిక్ టిక్ చిత్రంలో బాల నటుడిగా పరిచయమై మంచి పేరు తెచ్చుకున్నాడు. తదుపరి మరే చిత్రంలోనూ నటించలేదే? నిజం చెబుతున్నా. టిక్ టిక్ టిక్ చిత్రం తరువాత ఆరవ్‌కు 25 చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. అయితే తన వయసు 9 ఏళ్లే. ఇప్పటి నుంచే నటిస్తూ పోతే చదువుకు అంతరాయం కలుగుతుంది.అందుకే 18,19 ఏళ్ల వరకూ పూర్తిగా చదువుపైనే దృష్టి పెట్టాలని భావిస్తున్నాం. ఆ తరువాత ఆరవ్ ఇష్టపడితే నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. -
తమిళ ‘బిగ్‌బాస్’ విజేత ఎవరంటే..?
చెన్నై: తమిళంలో ఆసక్తికరంగా సాగిన సెలబ్రిటీ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ ముగిసింది. నటుడు ఆరవ్ విజేతగా నిలిచాడు. ఉత్కంఠభరితంగా సాగిన గ్రాండ్ ఫైనల్లో అతడిని కార్యక్రమ వ్యాఖ్యాత కమల్‌హాసన్ విజేతగా ప్రకటించారు. అతడికి రూ.50 లక్షల నగదు బహుమతిని, ‘బిగ్ బాస్’ ట్రోఫీని అందజేశారు. ఫైనల్‌కు ప్రముఖ దర్శకుడు శంకర్, నిర్మాత దిల్‌రాజు అతిథులుగా హాజరయ్యారు. వీక్షకుల నుంచి ఈ షోకు మొత్తం 76.7 కోట్ల ఓట్లు వచ్చినట్టు కమల్‌హాసన్ వెల్లడించారు. స్టార్ విజయ్ చానల్లో 100 రోజులపాటు కొనసాగిన తమిళ బిగ్‌బాస్ షోలో చివరికి హౌస్‌లో ఆరావ్, హరీశ్ కళ్యాణ్, స్నేహన్, గణేశ్ వెంకట్రామన్ మిగిలారు. ఈ కార్యక్రమంలో తమ అనుభవాలను గతవారం వీరంతా కలబోసుకున్నారు. అయితే గణేశ్ వెంకట్రామన్ విజేతగా నిలుస్తాడని సోషల్ మీడియాతో ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఆరావ్ ‘బిగ్‌బాస్’ అయ్యాడు. షో నుంచి అనూహ్యంగా బయటికెళ్లిన నటి ఓవియ మిగతా పోటీదారులతో కలిసి ఫైనల్ ఎపిసోడ్‌కు రావడం విశేషం. ‘నువ్వు కొంచెం బరువు తగ్గినట్టుగా కనిపిస్తున్నావ’ని ఆరవ్తో ఓవియ మాట కలిపింది. ప్రత్యేక ఆకర్షణ అదే... బిగ్‌బాస్ హౌస్‌లో నటి ఓవియ, ఆరవ్ మధ్య చిగురించిన ప్రేమ వ్యవహారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరిద్దరి కారణంగా బిగ్‌బాస్ టీఆర్పీ రేటు బాగా పెరిగింది. ఓవియ అనుహ్యంగా బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేయడం పెద్ద సంచలనానికే దారి తీసింది. ఆమెకు అభిమానులు, సానుభూతిపరులు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించారు. జూన్ 25న 19 మంది పోటీదారులతో ప్రారంభమైన ’బిగ్‌బాస్’ సెప్టెంబర్ 30న ముగిసింది. రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని కమల్‌హాసన్ ప్రకటించడంతో రెండో సీజన్‌కు ఎవరు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారనే చర్చ అప్పుడే మొదలైంది. కాగా, బిగ్‌బాస్ వేదికపైనే కమల్‌తో భారతీయుడు సీక్వెల్ చేయనున్నట్టు దర్శకుడు శంకర్ ప్రకటించారు. -
మమ్మీ నీకు డ్రైవింగ్ రాదుగా!
బాలీవుడ్ నటి-రచయిత ట్వింకిల్ ఖన్నా తన జోక్స్‌తో నెటిజన్లకు కితకితలు పెట్టడంలో ఎప్పుడూ ముందుంటారు. 'ఫన్నీబోన్స్' పేరిట ట్విట్టర్లో ఆమె పెట్టే జోక్స్, ఛలోక్తులు బాగా నవ్విస్తుంటాయి. తాజాగా ట్వింకిల్ తన తనయుడు ఆరావ్తో వాట్సాప్‌లో చేసిన సరదా సంభాషణను ట్వీట్ చేశారు. ఈ చాటింగ్‌లో 'డ్రైవర్ ఇప్పుడే వచ్చాడు. ఒక్క నిమిషంలో వస్తున్నాను సర్' అంటూ ఆరావ్ తన మాథ్స్ టీచర్‌కు చెప్పాడు. ట్వింకిల్ స్పందిస్తూ.. 'నువ్వు నాకు చెప్పాల్సింది. నువ్వు వెళ్లిపోయావు అనుకున్నాను. నేను డ్రాప్ చేసేదానిని కదా' అంటూ పేర్కొంది. 'మమ్మీ నీకు డ్రైవింగ్ రాదు'గా అని ఆరావ్ రిప్లై ఇచ్చాడు. దానికి 'నాకు డ్రైవింగ్ వచ్చు. కానీ హరన్, బ్రేకులు నచ్చావు' అంటూ ట్వింకిల్ పేర్కొంది. హారన్, బ్రేకులు వాడకుండా ముంబై బిజీ రోడ్డుమీద డ్రైవింగ్ చేయడం సాధ్యమా? కాదు.. అందుకే ఇలా తనదైన శైలిలో రోజూ జోకులు పేలుస్తానని ట్వింకిల్ సెలవిచ్చింది. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్‌కుమార్-ట్వింకిల్ దంపతులకు ఇద్దరు పిల్లలు. కొడుకు ఆరావ్, కూతురు నిటారా ఉన్నారు. అక్షయ్ తాజా సినిమా 'రుస్తుం' ఈ నెల 12న విడుదలకానుంది.