నికీషా లక్ష్యం ఏంటో తెలుసా? | Nikesha Patel Busy With Six Films | Sakshi
Sakshi News home page

నికీషా లక్ష్యం ఏంటో తెలుసా?

Published Sun, Jul 28 2019 10:12 AM | Last Updated on Sun, Jul 28 2019 10:12 AM

Nikesha Patel Busy With Six Films - Sakshi

మంచి స్థానం కోసం పోరాడుతున్న హీరోయిన్లలో నటి నికీషా పటేల్‌ ఒకరు. చాలా కాలంగా తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం అంటూ పలు భాషల్లో నటిస్తూ మంచి సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే ఏ పుట్టలో ఏ పాము ఉంటుందోనన్న సామెతలా వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించేస్తున్నారు. అంతే కాదు అందాలారబోత విషయంలోనూ హద్దులు చెరిపేయడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. 

ఈ ఏడాది నికీషా నటించి అరడజను చిత్రాలు తెరపైకి రానున్నాయి. అందులో ఒకటి బిగ్‌బాస్‌ ఫేమ్‌ ఆరవ్‌తో నటిస్తున్న మార్కెట్‌ రాజా ఎంబీబీఎస్‌. చరణ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా ఆ చిత్ర నాయికల్లో ఒకరైన నికీషాపటేల్‌ మాట్లాడుతూ.  ‘ఇటీవలే ఈ చిత్రంలోని పాటల చిత్రీకరణ పూర్తి అయ్యింది. పాటలు చాలా బాగా వచ్చాయి, చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది.

ఈ సినిమాతో పాటు ఎళిల్‌ దర్శకత్వంలో ఆయిరం జన్మంగళ్‌ చిత్రంలోనూ, కస్తూరిరాజా దర్శకత్వంలో భారీ అంచనాలు నెలకొన్న పాండిముని చిత్రంలోనూ, నటుడు శ్రీకాంత్‌కు జంటగా ఒక చిత్రంలోనూ, అదే విధంగా నటుడు నందాతో కలిసి మరో చిత్రంలో నటిస్తున్నాను. ఈ ఏడాది నేను నటించిన ఆరు చిత్రాలు రిలీజ్‌ అవుతుండటం చాలా సంతోషంగా ఉంది’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement