మమ్మీ నీకు డ్రైవింగ్‌ రాదుగా! | This Conversation Between Twinkle Khanna and Her Son Aarav is Hilarious | Sakshi
Sakshi News home page

మమ్మీ నీకు డ్రైవింగ్‌ రాదుగా!

Published Sat, Aug 6 2016 4:09 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

మమ్మీ నీకు డ్రైవింగ్‌ రాదుగా!

మమ్మీ నీకు డ్రైవింగ్‌ రాదుగా!

బాలీవుడ్‌ నటి-రచయిత ట్వింకిల్‌ ఖన్నా తన జోక్స్‌తో నెటిజన్లకు కితకితలు పెట్టడంలో ఎప్పుడూ ముందుంటారు. 'ఫన్నీబోన్స్‌' పేరిట ట్విట్టర్‌లో ఆమె పెట్టే జోక్స్‌, ఛలోక్తులు బాగా నవ్విస్తుంటాయి. తాజాగా ట్వింకిల్‌ తన తనయుడు ఆరావ్‌తో వాట్సాప్‌లో చేసిన సరదా సంభాషణను ట్వీట్‌ చేశారు.

ఈ చాటింగ్‌లో 'డ్రైవర్‌ ఇప్పుడే వచ్చాడు. ఒక్క నిమిషంలో వస్తున్నాను సర్‌' అంటూ ఆరావ్‌ తన మాథ్స్‌ టీచర్‌కు చెప్పాడు. ట్వింకిల్‌ స్పందిస్తూ.. 'నువ్వు నాకు  చెప్పాల్సింది. నువ్వు వెళ్లిపోయావు అనుకున్నాను. నేను డ్రాప్‌ చేసేదానిని కదా' అంటూ పేర్కొంది. 'మమ్మీ నీకు డ్రైవింగ్‌ రాదు'గా అని ఆరావ్ రిప్లై ఇచ్చాడు. దానికి 'నాకు డ్రైవింగ్ వచ్చు. కానీ హరన్‌, బ్రేకులు నచ్చావు' అంటూ ట్వింకిల్‌ పేర్కొంది. హారన్‌, బ్రేకులు వాడకుండా ముంబై బిజీ రోడ్డుమీద డ్రైవింగ్‌ చేయడం సాధ్యమా? కాదు.. అందుకే ఇలా తనదైన శైలిలో రోజూ జోకులు పేలుస్తానని ట్వింకిల్‌ సెలవిచ్చింది. బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌కుమార్-ట్వింకిల్‌ దంపతులకు ఇద్దరు పిల్లలు. కొడుకు ఆరావ్‌, కూతురు నిటారా ఉన్నారు. అక్షయ్‌ తాజా సినిమా 'రుస్తుం' ఈ నెల 12న విడుదలకానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement