
చెన్నై: తమిళ బిగ్‌బాస్ సీజన్ 1 విజేత ఆరవ్ నఫీజ్ ఇంట విషాదం నెలకొంది. ఆరవ్ తండ్రి నిదాన్ గుండెపోటుతో మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం ఒకటిన్నర గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచారు. చెన్నైలో మృతి చెందిన ఆయన భౌతిక కాయాన్ని అంత్యక్రియల కోసం స్వస్థలమైన నాగర్‌కోల్‌కు తరలించారు. ఆయన మరణం పట్ల పలువురు సెలబ్రిటీలు, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. (చదవండి: మోనాల్ రెమ్యూనరేషన్ ఎంతంటే?)
కాగా ఆరవ్ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. 2016లో విజయ్ ఆంటోని 'భేతాళుడు' చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తర్వాతి ఏడాది బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్‌లోకి వెళ్లి ట్రోఫీని ఎగరేసుకుపోయాడు. అయితే బిగ్‌బాస్ షోలో హీరోయిన్ ఓవియా అతడిని కిస్ చేయడంతో ఆరవ్ పేరు మార్మోగిపోయింది. ఆ తరువాత ఆమె అతడికి ప్రపోజ్ కూడా చేసింది. అలా కొంతకాలం పాటు వీళ్ల మధ్య ప్రేమాయణం నడిచింది. వీరికి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఆర్మీలు కూడా పుట్టుకొచ్చాయి. కానీ బిగ్‌బాస్ తర్వాత వీళ్ల మధ్య విబేధాలు తలెత్తాయి. ఒకానొక సమయంలో ఓవియా ఆత్మహత్యకు యత్నించినట్లు వార్తలు కూడా వెలువడ్డాయి. కాగా గత ఏడాదికాలంగా రేహితో ప్రేమలో ఉన్న ఆరవ్.. ఇరు వర్గాల పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నాడు. ప్రస్తుతం అతడు 'రాజా భీమ', 'మీందుమ్ ఆరగిల్ వా' సినిమాల్లో నటిస్తున్నాడు. (చదవండి: ప్రేయసిని పెళ్లాడనున్న బిగ్‌బాస్ విన్నర్!)
Comments
Please login to add a commentAdd a comment