
పెళ్లికి సిద్ధమైన భావన
నటి భావనకు తాళి కట్టించుకునే శుభవేళ దగ్గర పడుతోంది. కన్నడ నిర్మాతతో ప్రేమ పెళ్లికి దారి తీసింది. దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించి పేరు సంపాదించుకుంది భావన. ఈ మలయాళ బ్యూటీ తమిళంలో చిత్తిరం పేసుదడి చిత్రంలో హీరోయిన్‌గా రంగప్రవేశం చేసింది. ఆ తరువాత జయంకొండాన్, వెయిల్, దీపావళి, రామేశ్వరం చిత్రాల్లో నటించారు. అదే విధంగా తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లోనూ పలు చిత్రాలు చేశారు. 2012లో కన్నడంలో ఈమె నటించిన రోమియో అనే చిత్రాన్ని నిర్మించిన వారిలో నవీన్ ఒకరు. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందనే ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది.
అయితే భావన ప్రేమ విషయాన్ని ఖండించలేదు గానీ ప్రియుడెవరో పెళ్లి ఘడియలు వచ్చినప్పుడు వెల్లడిస్తానన్నారు. నవీన్ కూడా భావన తన స్నేహితురాలు అని చెప్పారు. అయితే తాజాగా వీరి మధ్య ప్రేమ నిజం అని వచ్చే ఏడాది పెళ్లి కూడా చేసుకోనున్నారని తెలిసింది. వీరి వివాహం భావన సొంత ఊరు తిరుచూర్‌లో జరగనున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి భావన కుటుంబ సభ్యుల్ని విచారించగా వచ్చే ఏడాది జనవరి 18న భావన సోదరుడి వివాహం జరగనుందని ఆ తరువాత భావన పెళ్లి ఉంటుందని వెల్లడించారు. అయితే పెళ్లికొడుకు ఎవరన్న విషయం మాత్రం చెప్పడానికి నిరాకరించారు.