
గుంటూరు రూరల్: తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని మానసిక ఒత్తిడికి గురై యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ తరంగిణి తెలిపిన వివరాలు.. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గోరంట్ల గ్రామానికి చెందిన దమ్ము జయపాల్‌కు ఒక కుమార్తె సంధ్య(19) ఉంది. ఈనెల 25వ తేదీన సంధ్యకు తల్లిదండ్రులు పెళ్లి ముహూర్తం నిర్ణయించారు.
చదవండి👉: మనసు ‘దోశ’కున్న మంత్రి వేణు
నిశ్చితార్థం విషయం తెలిసిన నాటి నుంచి పెళ్లి ఇష్టంలేదని తల్లిందండ్రులకు చెప్పలేక మానసిక ఒత్తిడికి గురైంది. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జీజీహెచ్‌కి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment