Woman Attacked By Man Armed With Machete In Kerala Kochi - Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై వేట కొడవలితో మహిళపై దాడి...అంతలో...

Published Sat, Dec 3 2022 3:51 PM | Last Updated on Sat, Dec 3 2022 4:52 PM

Woman Attacked By Man Armed With Machete In Keralas Kochi - Sakshi

కొచ్చి: ఒక వ్యక్తి పట్టపగలే నడిరోడ్డుపై వేట కొడవలితో ఒక మహిళపై దాడి చేసేందుకు తెగబడ్డాడు. ఈ ఘటన కేరళలోని కొచ్చిలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..ఈ ఘటన కాలూర్‌లోని అజాద్‌ రోడ్డుపై పట్టపగలే బహిరంగంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక యువకుడు, ఇద్దరు మహిళల మద్య వాగ్వాదం చోటుచేసుకుంది.

అనంతరం ఆ యువకుడు వేటకొడవలితో ఒక మహిళ తలపై దాడి చేసేందుకు పలుమార్లు యత్నించగా.. పక్కనే ఉన్న మరో మహిళ గట్టిగా అడ్డుకోవడంతో ఆమె చేతికి త్రీవ గాయలయ్యాయి. ఆ తర్వాత సదరు యువకుడు ఆ కొడవలిని అక్కడే పడేసి మోటార్‌ బైక్‌పై పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని, దాడి చేసేందుకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని చెప్పారు. పోలీసులు నిందితుడి ఆచూకి కోసం ఆ ప్రాంతంలోని సీసీఫుటేజ్‌ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.

(చదవండి: గుండెల్ని మెలిపెట్టే విషాద ఘటన.. ‘అమ్మానాన్నను త్వరగా రమ్మని చెప్పండి’..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement