సత్యనారాయణపురం (విజయవాడ సెంట్రల్): పెళ్లి చేసుకుంటానంటూ యువతిపై లైంగికదాడికి పాల్పడిన యువకుడిపై సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. పెజ్జోనిపేటకు చెందిన యువతి ఒక ప్రైవేటు కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతోంది. తోటి విద్యార్థి సుహృద్ ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగికదాడి చేశాడు. పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆ యువతి ఒత్తిడి చేయడంతో సుహృద్ తప్పించుకు తిరుగుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment