హ్యూస్టన్: అమెరికాలో ఓ న్యాయమూర్తి అరుదైన తీర్పును ఇచ్చాడు. ముప్పై రోజుల్లో గర్ల్ ఫ్రెండ్ను పెళ్లి చేసుకో లేదంటే.. రెండేళ్లు జైలు శిక్ష అనుభవించు అని తీర్పు చెప్పాడు. ఇంతకీ ఆ అబ్బాయి చేసిన నేరమేమిటో తెలుసా తన గర్ల్ ఫ్రెండ్ మాజీ బాయ్ ప్రెండ్ ను కొట్టడమే. జోస్టెన్ బండీ అనే టెక్సాస్కు చెందిన ఓ యువకుడు ఎలిజబెత్ జేన్స్ అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు.
ఏదో కారణంతో ఆ అమ్మాయి మాజీ ప్రేమికుడితో గొడవపడి గాయాలపాలు చేశాడు. ఈ ఘటన గత ఫిబ్రవరిలో చోటుచేసుకుంది. దీంతో జేన్స్ కు కొంత కలతను కలిగింది. జోస్టెన్ పై కోపం తెప్పించింది. అప్పటి నుంచి ఈ కేసు విచారిస్తున్న జడ్జి గత జూలైలో రెండు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చాడు. ఆ వెంటనే మరో అవకాశం ఇచ్చి అమ్మాయికి ఇష్టం అయితే 30 రోజుల్లో పెళ్లి చేసుకోవాలని ఆదేశించాడు. కాగా, ఇద్దరు అవగాహన లేని యువతీ యువకుల అభిప్రాయాలను అడిగి అనవసరంగా వారికి ముడిపెట్టారని ఆ న్యాయమూర్తిపై అమ్మాయి తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. గత నెల 30నే వారి వివాహం అయింది.
గర్ల్ఫ్రెండ్ను పెళ్లి చేసుకో లేదంటే జైలుకెళ్లు
Published Sun, Aug 9 2015 6:14 PM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM
Advertisement
Advertisement